
కేబినేట్ నోట్ కు ఆమోదం తర్వాత ఇరుప్రాంతాల్లో శాఖలు: కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేబినేట్ నోట్ కు మంత్రివర్గ ఆమోదం లభించాక ఇరుప్రాంతాల్లో బీజేపీ రెండు శాఖలను ఏర్పాటు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పలు పార్టీలు ద్వంద విధానాలను అవలంభిస్తోందని..రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు.
తెలంగాణపై బీజేపీది ఒకటే మాట అని కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీల తీరు వల్ల ఇరుప్రాంతాల్లో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. రాజకీయ లబ్ది కోసం పార్టీలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టవద్దని కిషన్ రెడ్డి విజ్క్షప్తి చేశారు.