ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీలో కూడా చిచ్చు రగిల్చింది. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల మధ్య మాత్రమే చోటు చేసుకున్న విభేదాలు కాస్తా బీజీపీకి పాకాయి. రెండు ప్రాంతాలలోనూ ఒకే ఎజెండాతో ముందకు వెళుతున్నామని చెప్పిన నేతలకు ఒక్కసారిగా షాక్ తగిలింది. తెలంగాణ నేతల ఢిల్లీ టూర్ ను రద్దు చేయడంతో విభేదాలు తారస్థాయికి చేరాయి. సీమాంధ్ర నేతల ఢిల్లీ టూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బీజేపీ పెద్దలు, తెలంగాణ నేతల పర్యటనను రద్దు చేయడంతో ముసలం మొదలైంది.
దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అలిగినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర నేతలకు అంగీకారం తెలిపి, తెలంగాణ నేతల పర్యటనను రద్దు చేయడంపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఓ దశలో తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం.