హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తాచాటుతోంది. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీతో హోరాహోరీగా ఫలితాలు సాధిస్తోంది. సోమవారం మున్సిపల్ కౌంటింగ్ ఆరంభమైన అరగంట నుంచే ఫలితాలు వెలువడ్డాయి. సీమాంధ్రలో 92 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, ఇచ్చాపురం, వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్లతో పాటు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. ఇక తుని, పులివెందుల, బొబ్బిలి మున్సిపాల్టీలతో పాటు కడప, ఏలూరు కార్పొరేషన్లలో ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. కడపటి సమాచారం అందేసరికి ఫలితాలు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ నెగ్గిన మున్సిపాల్టీలు
చీరాల, గిద్దలూరు, ఆదోనీ, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గూడురు, ఎర్రగుంట్ల, పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, ఇచ్చాపురం, ఆముదాలవలస, గొల్లప్రోలు, చిలకలూరిపేట, బొబ్బిలి, జగ్గయ్యపేట, నూజివీడు, పుంగనూరు, పలమనేరు, కడప కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్