టీడీపీ నేతల కుర్చీల లొల్లి! | tdp leaders fight for chairs at kadapa corporation | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల కుర్చీల లొల్లి!

Published Sat, Dec 31 2016 12:37 PM | Last Updated on Tue, Oct 16 2018 7:49 PM

టీడీపీ నేతల కుర్చీల లొల్లి! - Sakshi

టీడీపీ నేతల కుర్చీల లొల్లి!

కడప: కడప మునిసిపల్ కార్పొరేషన్‌ సమావేశంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అవకాశంగా మలుచుకుని కార్పొరేషన్‌లో రసాభాస చేశారు. ఇటీవల ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లను తమ పార్టీలోకి ఆహ్వానించిన తెలుగు తమ్ముళ్లు.. తమ ఇష్టరీతిన కుర్చీలు వేయాల్సిందేనంటూ కార్పొరేషన్‌లో కుర్చీల కోసం బాహాబాహీకి దిగారు. తాము చెప్పినట్లు ఇటీవల తమ పార్టీలోకి ఫిరాయించిన కార్పొరేటర్లకు కుర్చీలు వేయలేదంటూ సమావేశంలో టీడీపీ సభ్యులు నానా రభస చేశారు. టీడీపీ నేతలు మేయర్ పోడియం వద్దకు ఆగ్రహంగా దూసుకెళ్లారు. వారిని అడ్డుకోబోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై దాడికి యత్నించారు.

తమకు కుర్చీలు వేయలేదంటూ ఆవేశంతో మైకులు విరగొట్టినట్లు తెలుస్తోంది. తమకు నచ్చినట్లుగా కుర్చీలు వేయలేదన్న కోపంతో కార్పొరేటర్ల నేమ్ ప్లేట్లను చెల్లచెదురు చేసి టీడీపీ కార్పొరేటర్లు గొడవకు దిగారు. వైఎస్ఆర్ సీపీ సభ్యులు నచ్చజెప్పినా.. టీడీపీ సభ్యులు వినకుండా గొడవకు దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా తమదే పైచేయి కావాలని, ప్రతి జిల్లాలోనూ ఏదో రకంగా అధికార పార్టీ నేతలు ఇలా గొడవకు దిగుతున్నారని వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement