మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు శ్రీనివాసులురెడ్డి
కడప కార్పొరేషన్ : కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని కోట్లూరు గ్రామపంచాయితీకి టీడీపీ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి ఏంచేశారో చెప్పాలని హెచ్‌ఎల్‌డబ్లు్యసీ అధ్యక్షుడు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు శ్రీనివాసులరెడ్డి ప్రశ్నించారు. కడపలోని కార్పొరేషన్ కాంప్లెక్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిన్న దళిత తేజం కార్యక్రమానికి కోట్లూరుకు వచ్చిన పుత్తా ఇక్కడి సర్పంచ్ లైట్లు వేశారా, నీళ్లు ఇచ్చారా, రోడ్లు వేశారా అని విమర్శించడం సరికాదన్నారు. కోట్లూరు మెయిన్ విలేజ్‌లో రూ.20లక్షలతో సీసీ రోడ్లు వేశామని, నీటి సమస్య తీర్చడానికి రూ.17లక్షల 12వ ఆర్థిక సంఘం నిధులతో టెండర్లు పిలిస్తే, వారి పార్టీకి చెందిన కాంట్రాక్టరే టెండర్‌వేసి పనులు చేయలేదన్నారు. ఫలితంగా నిధులు వెనక్కిపోయాయన్నారు.
పెన్నానది నుంచి ప్రత్యేకంగా బోరువేసి హరిజనవాడకు నీళ్లిచ్చామన్నారు. బాకరాపురంలో రూ.25లక్షలతో 12 రోడ్లు వేశామన్నారు. అలాగే 14వ ఆర్థిక సంఘం నిధులతో రూ.8.87లక్షలతో 7 రోడ్లు వేశామని, ఎంపీ నిధులతో మరో రూ.6లక్షలకు ప్రతిపాదనలు పంపామన్నారు. బీచువారిపల్లెలో నీటి ఎద్దడి తీర్చేందుకు పంచాయితీ నిధులతో బోరువేసి, కొత్తమోటారు అమర్చామన్నారు. దీన్ని తానే వేయిం చానని పుత్తా చెప్పుకోవడం దారుణమన్నారు. ఆయన ఆ బోరును ఏ నిధులు తెచ్చి వేశారో చెప్పాలని ప్రశ్నించారు. వక్కిలేరు వంకలో 12సార్లు మరమ్మతు పనులు చేసి 15 సార్లు చేసినట్లు టీడీపీ నాయకులు బిల్లులు చేసుకున్నారని, ఇప్పటికీ కొత్త బ్రిడ్జి రాలేదన్నారు. నీరుచెట్టు పనుల్లో కూడా టీడీపీ నాయకులు భారీ ఎత్తును అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పుత్తా నరసింహారెడ్డి ఈ నాలుగేళ్లలో కోట్లూరుకు ఈ పనిచేశానని చెప్పగలిగితే తనతో పాటు సర్పంచ్ వెంకటలక్ష్మి కూడా రాజీనామా చేస్తుందని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment