ఏపీఎంసీ సభ్యుల స్థానాలకు
మద్దతుదారులతో నామినేషన్లు దాఖలు
గంగావతి: గంగావతి తాలూకాలో రెండు ఏపీఎంసీ సభ్యు ల స్థానాలకు ఈనెల 18న నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శనివారం ముగిసింది. శనివారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు మద్దతుదారులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నగరంలోని ఏపీఎంసీ కార్యాలయంలో జనసందోహంతో కిక్కిరిసిపోయింది. గంగావతి, కారటగి రెండు ఏపీఎంసీలలో 14 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గంగావతి ఏపీఎంసీకి 13 మంది వ్యవసాయ క్షేత్ర సా ్థనాల పరిధిలో 71,735 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 53,398 మంది పురుష ఓటర్లు, 19,337 మంది మహిళ ఓటర్లు ఉన్నారు.
వర్తకుల క్షేత్ర స్థానం పరిధిలో 888 మంది ఓటర్లు కలిగి ఉండగా, ఇందులో 864 మంది పురుష ఓటర్లు, కేవలం 24 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. కారటగి ఏపీఎంసీ పరిధిలో 33,784 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 24,596 మంది పురుష ఓటర్లు, 9,188 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈనెల 18న జరిగే ఎన్నికలకు గంగావతి ఏపీఎంసీకి 145 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. కారటగి ఏపీఎంసీకి 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు ఏపీఎంసీలకు వర్తకుల కోసం కేటాయించిన ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ,జేడీఎస్ నాయకులు ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలకు తమ మద్దతుదారులైన అభ్యర్థులను రంగంలోకి దింపారు.
ముగిసిన నామినేషన్ల ఘట్టం
Published Sun, Jan 4 2015 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM
Advertisement