gangavathi
-
దుండగులపై పోలీసు కాల్పులు
గంగావతి: ఇద్దరు దోపిడీ దొంగలు తప్పించుకుని పారిపోతుండగా ఓ పోలీసు కానిస్టేబుల్ తుపాకీతో కాల్చడంతో గాయపడిన ఘటన శుక్రవారం తాలూకాలోని ముస్టూరు గ్రామ సమీపంలో జరిగింది. కొప్పళ జిల్లా ఎస్పీ అరుణ్గిరి కథనం మేరకు ఈనెల 16న బెంగళూరులో ఓ పందుల ఫారంలో ఇద్దరు దుండగులు దోపిడీకి పాల్పడగా, ఫారం యజమాని రామకృష్ణ వారికి అడ్డుపడ్డారు. ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచి ఉడాయించారు. దుండగులు గంగావతి తాలూకాలో సంచరిస్తున్నట్లు తెలియడంతో చిక్కజాల ఎస్ఐ ప్రవీణ్ నేతృత్వంలోని పోలీసు బృందం గంగావతికి చేరుకుంది. దుండగులు ప్రైవేట్ వాహనంలో వెళ్తుండగా వెంబడించి ముస్టూరు సమీపంలో అటకాయించారు. అయితే దుండగులు పోలీసులపై తిరగబడి పరారవ్వడానికి ప్రయత్నించగా కానిస్టేబుల్ బసవరాజ్ వారిపై తుపాకీతో కాల్పులు జరిపారు. శంకర్ సింధనూరు, అశోక్ బెళహట్టిల కాళ్లకు తూటాలు తగిలి తీవ్రంగా గాయపడగా గంగావతి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆస్పత్రి వద్ద డీఎస్పీ రుద్రేశ్ ఉజ్జినకొప్ప గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
టీలో నిద్రమాత్ర వేసి.. మత్తులోకి వెళ్లగానే అత్యాచారం
సాక్షి, గంగావతి (కర్ణాటక): టీలో నిద్రమాత్ర వేసి ఓ వివాహితపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన హిరేబెనకల్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. ఇటుకల బట్టి యజమాని మహేష్ ఓ వివాహితను వేకువజామున పనికి రమ్మని పిలిచాడు. ఆ సమయంలో టీలో నిద్రమాత్ర వేసి ఆమెకు ఇచ్చాడు. ఆమె మత్తులోకి వెళ్లగా అత్యాచారం చేశాడు. ఆ తరువాత విషయం గుర్తించిన బాధితురాలు గంగావతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: (అనుమానం.. చిత్రహింసలు.. నదిలో దూకి తల్లీ, బిడ్డ ఆత్మహత్య) -
కూతుర్ని ప్రేమిస్తున్నాడని పొలంలోనే ఉరి వేశాడు
గంగావతి: తన కూతుర్ని ప్రేమిస్తున్నాడనే కోపంతో ఆమె తండ్రి యువకున్ని పొలంలో ఉరివేసి చంపాడు. కొప్పళ జిల్లా సంగాపురం గ్రామంలో బుధవారం ఈ ఘోరం జరిగింది. సంగాపుర గ్రామానికి చెందిన యువకుడు హనుమేష్ (22) గ్రామంలో కూలీ పనులు చేస్తుంటారు. ఇతడు ఒక యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పుకునేవాడు. ఇది తెలిసిన యువతి తండ్రి కసితో రగిలిపోయాడు. పని ఉందని యువకున్ని వారి పొలానికి పిలిపించి కొట్టి చెట్టుకు ఉరివేశాడు. ఇందుకు యువతి తల్లి కూడా సహకరించినట్లు యువకుని అన్న పరుశురాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
పురాతన రాగి నాణేలు లభ్యం
గంగావతి : గంగావతి తాలూకాలోని బండ్రాళ్ గ్రామ శివారులోని పొలంలో 15వ శతాబ్దపు రాజుల కాలం నాటి 245 పురాతన రాగి నాణేలు సోమవారం దొరికాయి. గ్రామానికి చెందిన మర్దానప్ప అనే రైతు తన పొలం దుక్కి దున్నతున్న సమయంలో ఈ నాణాలు బయట పడ్డాయి. ఈ నాణాలను వెంటనే రైతు గంగావతి తహశీల్దార్‌కు స్వాధీన పరిచారు. తహాశీల్దార్ వెంక నగౌడ పాటిల్ గంగావతి పోలీస్‌స్టేషన్‌కు తరలించి డీఎస్పీ విన్సెంట్ శాంతకుమార్‌కు అప్పగించారు. స్థానిక చారిత్రక పరిశోధకులు డాక్టర్ శరణ బసప్ప కోల్కర్ను పిలిపించి నాణాలను పరిశీలించాలని సూచించారు. ఈ నాణాలు 15వ శతాబ్దపు బీజాపూర్ సుల్తాన్ కాలం నాటివన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాహి కాలపు నాణాలని తెలిపారు. కనకగిరి ప్రాంతాన్ని వారు అప్పుడు తమ స్వాధీనంలోకి తీసుకొన్నారని, ఆ కాలంలో ఈ నాణాలు ఈ ప్రాంతాల్లో చలామణి చేసేవారని చారిత్రక పరిశోధకులు కోల్కర్ తెలిపారు. వీటిని కూలంకుషంగా పరిశీలనకు పురావస్తు శాఖకు పంపించాలని ఆయన అధికారులకు సూచించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
ఏపీఎంసీ సభ్యుల స్థానాలకు మద్దతుదారులతో నామినేషన్లు దాఖలు గంగావతి: గంగావతి తాలూకాలో రెండు ఏపీఎంసీ సభ్యు ల స్థానాలకు ఈనెల 18న నిర్వహించనున్న ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శనివారం ముగిసింది. శనివారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు మద్దతుదారులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నగరంలోని ఏపీఎంసీ కార్యాలయంలో జనసందోహంతో కిక్కిరిసిపోయింది. గంగావతి, కారటగి రెండు ఏపీఎంసీలలో 14 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గంగావతి ఏపీఎంసీకి 13 మంది వ్యవసాయ క్షేత్ర సా ్థనాల పరిధిలో 71,735 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 53,398 మంది పురుష ఓటర్లు, 19,337 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వర్తకుల క్షేత్ర స్థానం పరిధిలో 888 మంది ఓటర్లు కలిగి ఉండగా, ఇందులో 864 మంది పురుష ఓటర్లు, కేవలం 24 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. కారటగి ఏపీఎంసీ పరిధిలో 33,784 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 24,596 మంది పురుష ఓటర్లు, 9,188 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈనెల 18న జరిగే ఎన్నికలకు గంగావతి ఏపీఎంసీకి 145 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. కారటగి ఏపీఎంసీకి 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు ఏపీఎంసీలకు వర్తకుల కోసం కేటాయించిన ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ,జేడీఎస్ నాయకులు ఈ ఎన్నికల్లో అన్ని స్థానాలకు తమ మద్దతుదారులైన అభ్యర్థులను రంగంలోకి దింపారు.