పురాతన రాగి నాణేలు లభ్యం | The ancient copper coins available | Sakshi
Sakshi News home page

పురాతన రాగి నాణేలు లభ్యం

Published Tue, Jan 27 2015 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

పురాతన రాగి నాణేలు లభ్యం

పురాతన రాగి నాణేలు లభ్యం

గంగావతి  : గంగావతి తాలూకాలోని బండ్రాళ్ గ్రామ శివారులోని పొలంలో 15వ శతాబ్దపు రాజుల కాలం నాటి 245 పురాతన రాగి నాణేలు సోమవారం దొరికాయి. గ్రామానికి చెందిన మర్దానప్ప అనే రైతు తన పొలం దుక్కి దున్నతున్న సమయంలో ఈ నాణాలు బయట పడ్డాయి. ఈ నాణాలను వెంటనే రైతు గంగావతి తహశీల్దార్‌కు స్వాధీన పరిచారు. తహాశీల్దార్ వెంక నగౌడ పాటిల్ గంగావతి పోలీస్‌స్టేషన్‌కు తరలించి డీఎస్పీ విన్సెంట్ శాంతకుమార్‌కు అప్పగించారు. స్థానిక చారిత్రక పరిశోధకులు డాక్టర్ శరణ బసప్ప కోల్కర్‌ను పిలిపించి నాణాలను పరిశీలించాలని సూచించారు.

ఈ నాణాలు 15వ శతాబ్దపు బీజాపూర్ సుల్తాన్ కాలం నాటివన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాహి కాలపు నాణాలని తెలిపారు. కనకగిరి ప్రాంతాన్ని వారు అప్పుడు తమ స్వాధీనంలోకి తీసుకొన్నారని, ఆ కాలంలో ఈ నాణాలు ఈ ప్రాంతాల్లో చలామణి చేసేవారని చారిత్రక పరిశోధకులు కోల్కర్ తెలిపారు. వీటిని కూలంకుషంగా పరిశీలనకు పురావస్తు శాఖకు పంపించాలని ఆయన అధికారులకు సూచించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement