
ది పోస్ట్
హాలీవుడ్ సినిమాకు అవార్డులంటే ఆస్కార్ అవార్డులే! ఇక ఆ తర్వాత చెప్పుకునే అవార్డులంటే ‘గోల్డెన్ గ్లోబ్’. చాలాసార్లు ఈ రెండు అవార్డుల ఫలితాలూ ఒకేలా ఉంటాయ్! బెస్ట్ అనుకునే సినిమా రెండు అవార్డులనూ తన్నుకుపోతుంది. ఈ ఏడాదికి కూడా ఆస్కార్ బరిలో మహా మహా దర్శకుల సినిమాలే పోటీపడనున్నాయి. ఆస్కార్ నామినేషన్స్ అనౌన్స్ కావడానికి ఇంకా నెల టైమ్ ఉంది. ఏయే సినిమాలు నామినేషన్స్ దక్కించుకుంటాయి అన్నది ఇంకా సస్పెన్సే! గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్ అయితే ఇప్పటికే బయటకొచ్చేశాయ్.
ఇందులో ‘ది షేప్ ఆఫ్ వాటర్’ మొత్తం ఏడు నామినేషన్స్ దక్కించుకుంది. స్టీవెన్ స్పీల్‌బర్గ్ తెరకెక్కించిన ‘ది పోస్ట్’ ఆరు నామినేషన్లు దక్కించుకుంది. ఈ రెండు సినిమాలకు చాలాకాలం నుంచే విపరీతమైన క్రేజ్ ఉంది. గోల్డెన్ గ్లోబ్‌లో ఈ సినిమాలు నామినేషన్స్ తెచ్చుకోవడంతో ఆస్కార్ నామినేషన్స్‌లోనూ ఈ రెండు సినిమాలదే జోరు ఉంటుందని హాలీవుడ్ సినీ పండితులు అంచనా వేస్తున్నారు. 2018 జనవరి 7న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానం జరగనుంది.
ది షేప్ ఆఫ్ వాటర్
Comments
Please login to add a commentAdd a comment