హోరాహోరీగా అనంత ప్రీమియర్‌ లీగ్‌ | anantha premiur league in anantpur | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా అనంత ప్రీమియర్‌ లీగ్‌

Feb 5 2017 10:55 PM | Updated on Jun 1 2018 8:54 PM

హోరాహోరీగా అనంత ప్రీమియర్‌ లీగ్‌ - Sakshi

హోరాహోరీగా అనంత ప్రీమియర్‌ లీగ్‌

అనంత క్రీడా మైదానం, గుంతకల్లులోని రైల్వే క్రికెట్‌ మైదానంలో ఆదివారం నిర్వహించిన అనంత ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు హోరాహోరీగా సాగాయి.

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : అనంత క్రీడా మైదానం, గుంతకల్లులోని రైల్వే క్రికెట్‌ మైదానంలో ఆదివారం నిర్వహించిన అనంత ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు హోరాహోరీగా సాగాయి. అనంత క్రీడా మైదానంలో నార్పల జట్టుతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన అనంత స్పోర్ట్స్‌ అకాడమీ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. జట్టులో జాన్‌ మైఖేల్‌ (89), రాఘవేంద్ర (69), మహేంద్రరెడ్డి (71) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నార్పల జట్టు 31.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. అనంత బౌలర్లలో భార్గవ్‌ 4, నవీన్‌ 2 వికెట్లు పడగొట్టారు.

గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో గుంతకల్లు మండల క్రికెట్‌ అకాడమీ, గుంతకల్లు క్రికెట్‌ అకాడమీ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన గుంతకల్లు క్రికెట్‌ అకాడమీ జట్టు 40 ఓవర్లలో 213 పరుగులు చేసింది. జట్టులో ఆసిమ్‌ సెంచరీతో కదం తొక్కాడు. గుంతకల్లు మండల క్రికెట్‌ అకాడమీ జట్టు క్రీడాకారుడు మనోజ్‌ 6 వికెట్లు తీశాడు.  అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుంతకల్లు మండల క్రికెట్‌ అకాడమీ జట్టు 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జట్టులో అభిషేక్‌ 52, రియాజ్‌ 46 పరుగులు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement