భర్త సుబ్రహ్మణ్యంతో అఖిలబాయి (ఫైల్)
సాక్షి, అనంతపురం: వివాహిత దారుణహత్య గుంతకల్లులో కలకలం రేపింది. బెడ్ రూంలోనే ఈ ఘటన జరగ్గా.. భర్త పరారీలో ఉన్నాడు. అనుమానంతో భర్తే హత్య చేసి ఉంటాడని హతురాలి పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. వన్‌టౌన్ సీఐ నాగశేఖర్, ఎస్‌ఐ కొండయ్య తెలిపిన మేరకు... రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్న రైల్వే గార్డ్ బాలాజీనాయక్ కుమారుడు సుబ్రహ్మణ్యం నాయక్‌కు కదిరి మండలం నాయనపల్లికి చెందిన అఖిలబాయికి గత ఏడాది నవంబర్‌లో వివాహమైంది. ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ చదువుతున్న అఖిలబాయి సెలవుల్లో భర్త ఇంటికి వచ్చి వెళ్లేది.
కాలేజీ రోజుల్లో ఓ యువకుడితో కలిసి అఖిలబాయి చేసిన టిక్‌టాక్‌ను చూసి సుబ్రహ్మణ్యం సహించలేకపోయాడు. వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై తరచూ గొడవపడుతుండేవారు. క్రమంగా ఇద్దరి మధ్య దూరం కూడా పెరుగుతూ వచ్చింది. రెండు నెలలక్రితం వీరి పంచాయితీ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు సర్దిచెప్పి పంపించారు. ఉగాది పండుగ నేపథ్యంలో అఖిలబాయిని భర్త ఇడుపులపాయ నుంచి గురువారం రాత్రి గుంతకల్లులోని ఇంటికి తీసుకొచ్చాడు.
చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. భార్యకు తెలిసిపోయిందని..
తెల్లవారుజామునే సుబ్రహ్మణ్యం బయటకు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత అత్త వెళ్లి చూడగా బెడ్‌రూంలో అఖిలబాయి రక్తపు మడుగులో పడి ఉంది. గొంతు, చేతి మణికట్లు కోసిన ఆనవాళ్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చేపట్టారు. అనుమానం పెనుభూతమై అఖిలబాయిని భర్తే కడతేర్చి ఉంటాడని హతురాలి పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment