చనిపోయిన పాములు
సాక్షి, అనంతపురం: చీమలు గుంపుగా చేరి ఆహారం కోసం అన్వేషించడం మనం సాధారణంగా చూసే దృశ్యమే. కానీ చీమల గుంపులా పాములు కూడా ఒకేచోట కనిస్తే ఆ దృశ్యాన్ని ఊహించగలమా? అయితే ఇలాంటి దృశ్యమే గుంతకల్లు మండలం గుర్రబ్బాడు గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు పొలంలో వరి నారుమడి వేశాడు. దాన్ని తొలగించే ముందు నారుమడిలో పురుగూ పుట్ర ఉంటాయని భావించి ఐదు రోజుల క్రితం థిమేట్ ద్రావకాన్ని చల్లాడు.
చదవండి: వాషింగ్ మెషీన్‌లో బుసలు కొట్టిన నాగుపాము, వీడియో హల్‌చల్
తర్వాత రెండు రోజులకు కూలీలతో కలిసి నారుమడి తొలగించేందుకు వెళ్లారు. మడిలో చనిపోయిన పాములు తేలియాడుతూ కనిపించాయి. వాటిని బయటకు తీసి ఒకచోట చేర్చారు. వందకు పైగా పాములు ఉన్నట్లు తేలింది. నారుమడి వేయక ముందే భూమిలో పాము గుడ్లు పెట్టిందో లేక పాములు నారుమడిలో చేరాయో తెలియదని రైతు చెప్పాడు.!
చదవండి: గుంటూరులో లారీ బీభత్సం.. తల్లీకూతుళ్ల దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment