బహిరంగ కౌన్సెలింగ్ ఫలితం.. గ్రేహౌండ్స్కు డీఎస్పీ సుప్రజ | DSP Supraja sent to greyhounds training | Sakshi
Sakshi News home page

బహిరంగ కౌన్సెలింగ్ ఫలితం.. గ్రేహౌండ్స్కు డీఎస్పీ సుప్రజ

Published Mon, Dec 2 2013 8:33 AM | Last Updated on Fri, May 25 2018 5:59 PM

బహిరంగ కౌన్సెలింగ్ ఫలితం.. గ్రేహౌండ్స్కు డీఎస్పీ సుప్రజ - Sakshi

బహిరంగ కౌన్సెలింగ్ ఫలితం.. గ్రేహౌండ్స్కు డీఎస్పీ సుప్రజ

గుంతకల్లులో కొంతమందికి బహిరంగంగా కౌన్సెలింగ్ నిర్వహించినందుకు గాను డీఎస్పీ సుప్రజపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

గుంతకల్లులో కొంతమందికి బహిరంగంగా కౌన్సెలింగ్ నిర్వహించినందుకు గాను డీఎస్పీ సుప్రజపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. హత్యకేసులో నిందితులకు బహిరంగంగా కౌన్సెలింగ్ నిర్వహించినందుకు గాను మూడు నెలల పాటు గ్రేహౌండ్స్ శిక్షణకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

అంతకుముందు ఆదివారం నాడు డీఎస్పీ సుప్రజ ఆదేశాలతో గుంతకల్లు పోలీసులు చెలరేగిపోయారు. నిందితులను ఊరేగించడంతోపాటు బహిరంగంగా రోడ్డుపైనే లాఠీలతో వారికి బుద్ధి చెప్పారు. రోడ్డు మీదే నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్‌ చేయించుకున్న నలుగురిలో శేఖర్ అనే వ్యక్తి ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. స్వయానా పిల్లనిచ్చిన మామనే చంపాడన్న ఆరోపణ అతడిపై వచ్చింది. కొంతకాలం వైవాహిక జీవితాన్ని బాగానే అనుభవించాడు. ఆ తర్వాత అసలు గొడవలు మొదలయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో విభేదాలు పొడచూపాయి. దీంతో శేఖర్‌ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో ఆమె ఇంటికి వెళ్లి, రమ్మని అడగ్గా ఆమె నిరాకరించింది. దీంతో ఆమె తండ్రి మల్లన్నతో శేఖర్‌ గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య  గొడవ తీవ్రంగానే జరిగింది. ఆ తర్వాత మల్లన్నను తన స్నేహితులతో కలిసి శేఖర్ హతమార్చాడన్న ఆరోపణలు వచ్చాయి.

పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండు రోజుల్లోనే శేఖర్‌, అతని స్నేహితులను పట్టుకున్నారు. వారందరినీ రోడ్డుపైనే కుళ్లబొడిచారు. గుంతకల్లు డీఎస్పీ సుప్రజ లాఠీ అందుకుని శేఖర్‌ వీపు విమానం మోత మోగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement