అనంతపురం : అనంతపురం జిల్లా గుంతకల్ మండల కేంద్రంలోని ఎస్‌బీహెచ్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం విధుల్లోకి వచ్చిన సిబ్బంది కంప్యూటర్ ఆన్ చేయడంతోనే కేబుల్ వైర్ ద్వారా షార్ట్‌సర్క్యూట్ అయి అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంకు అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఇంతలో బ్యాంక్ సిబ్బంది స్థానికులతో సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం వల్ల ఈ రోజు బ్యాంకు లావాదేవిలకు అంతరాయం కలగనుందని ఎస్బీహెచ్ మేనేజర్ వెల్లడించారు.