చోరీ కేసులో దొంగ అరెస్ట్‌ | thief arrest in theft case | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో దొంగ అరెస్ట్‌

Published Mon, Nov 7 2016 12:11 AM | Last Updated on Sat, Aug 11 2018 6:04 PM

thief arrest in theft case

కళ్యాణదుర్గం రూరల్‌ : గత ఆగస్ట్‌ 24న కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీనగర్‌లో నివాసముంటున్న టైలర్‌వరదరాజులు ఇంటిలో పట్టపగలు చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేసిన్లు డీఎస్పీ అనిల్‌ పులపాటి చెప్పారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం సీఐ శివప్రసాద్, పట్టణ ఎస్‌ఐ శంకర్‌రెడ్డితో కలిసి డీఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుంతకల్లు పట్టణంలోని గుత్తి రోడ్డులో కాలవ గడ్డ రోడ్డులో నివాసముంటున్న ఎరికల పెద్దనాగయ్య ఇంటికివేసిన తాళాన్ని పగులగొట్టి  బీరువాలోని ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదును ఎత్తుకెళ్లాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి ఆదివారం కళ్యాణదుర్గం పట్టణంలోని శెట్టూరు రోడ్డులోని బ్రహ్మయ్యగారి ఆలయం వద్ద దొంగను అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న రూ.1.40 లక్షల విలవ చేసే బంగారు నగలను స్వాధీనం చేసినట్లు చెప్పారు. సోమవారం నిందితుడిని కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. దొంగను అరెస్టు చేయడంలో  చాకచక్యంగా వ్యహరించిన ఎస్‌ఐశంకర్‌రెడ్డి, ఏఎస్‌ఐ తులన్న, కానిస్టేబుల్స్‌ రామాంజినేయులు, శివలింగ, శివన్నలను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement