గుంతకల్లు టౌన్ (అనంతపురం) : ఒంటరిగా ఉన్న వితంతువుపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటంతోపాటు, వారిలో ఒకరు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని నాగప్పకాలనీకి చెందిన వితంతువు(38) మంగళవారం రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో బేల్దారి మస్తానయ్య(35), మరో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. వారంతా కలసి ఆమెను చితకబాదారు. అనంతరం మస్తానయ్య ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు శుక్రవారం సాయంత్రం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.