అనంతపురం : గుంతకల్లులో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఎల్వీ థియేటర్ సమీపంలోని మూడు టింబర్ డిపోల్లో అగ్నిప్రమాదం కారణంగా భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ అగ్నిప్రమాదంలో రూ. 30 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... అగ్నిప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.