‘ప్రభు’ ఈసారైనా.. | railway budjet 2016-2017 | Sakshi
Sakshi News home page

‘ప్రభు’ ఈసారైనా..

Published Thu, Feb 25 2016 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

‘ప్రభు’ ఈసారైనా..

‘ప్రభు’ ఈసారైనా..

రైళ్ల కేటాయింపులో గుంతకల్లు డివిజన్‌కు ప్రతియేటా అన్యాయం
ఈ సారైనా సీమ ఎంపీల
ప్రయత్నాలు ఫలించేనా?
నేడు రైల్వేబడ్జెట్

   
గుంతకల్లు :ప్రతియేటా రైల్వే బడ్జెట్‌లో గుంతకల్లు డివిజన్‌కు అన్యాయం జరుగుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుంతకల్లు డివిజన్‌కు ఆదాయపరంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. అయినా రైళ్ల కేటాయింపు, పొడిగింపు, ప్రాజెక్టుల విషయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదు.రెండు దశాబ్దాలుగా రైలే ్వ మంత్రులుగా పనిచేసిన వారందరూ తమ రాష్ట్రాలకు, ప్రాంతాలకు రైళ్లను, ప్రాజెక్టులను కేటాయించుకోవడంలో సఫలీకృతులయ్యారు. డివిజన్‌కు న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాయలసీమ ప్రజాప్రతినిధులు  పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలున్నాయి.

నేడు రైల్వే బడ్జెట్
నిధులను రాబట్టడంలో రాయలసీమ ప్రాంత ఎంపీలు చొరవ ఏమాత్రమూ లేదన్న ఆరోపణలున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాలను దృష్టిలో ఉంచుకుని నాటి రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కర్నూలులో రైలుబోగీల మరమ్మతు కర్మాగారాన్ని రూ.110 కోట్లతో మంజూరు చేయించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను పూర్తి చేసి రైల్వే శాఖకు అప్పగించింది. ఈ బడ్జెట్‌లోనైనా ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో గురువారం పార్లమెంటులో రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్‌లో సీమకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీలు ఢిల్లీలో గట్టిగా కోరుతున్నారు.

 బోర్డులో నలుగుతున్న ప్రతిపాదనలివీ..
పుట్టపర్తి - షిర్డీ మధ్య నూతన ఎక్స్‌ప్రెస్ రైలు  
హైదరాబాద్ - పుట్టపర్తి (వయా గుంతకల్లు, ధర్మవరం ) నూతన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు  
కడప - షిరిడీ మధ్య నూతన ఎక్స్‌ప్రెస్ రైలు
అమరావతి రాజధాని దృష్ట్యా ధర్మవరం-గుంతకల్లు-విజయవాడ మార్గంలో మరో రెండు ఎక్స్‌ప్రెస్, రెండు ప్యాసింజర్ ైరె ళ్లు
అనంతపురం-విశాఖపట్నం, గుంతకల్లు-ధర్మవరం-తిరుపతి మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు
గుంతకల్లు-హైదరాబాద్ మధ్య పగటి పూట ఎక్స్‌ప్రెస్ రైలు

రైళ్ల పొడిగింపు ప్రతిపాదనలు
సికింద్రాబాద్ - కర్నూలు మధ్య నడుస్తున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్లు లేదా మంత్రాలయం నిలయం వరకు  పొడిగింపు
కాచిగూడ - గుంటూరు - కాచిగూడ ప్యాసింజర్‌ను ఫాస్ట్ ప్యాసింజర్‌గా మార్పు

అత్యంత కీలకమైన డబ్లింగ్ మార్గాల ప్రతిపాదన
గుంతకల్లు డివిజన్‌లోని డోన్-పెండేకల్లు, కల్లూరు-ధర్మవరం అత్యవసర డబ్లింగ్ మార్గాలు. ఈ మార్గాల గుండా రైళ్ల రద్దీ అధికం. ఈ పనులు పూర్తి చేస్తే రైళ్ల క్రాసింగ్ సమస్య తీరుతుంది.నత్తనడకన డబ్లింగ్ పనులుగుంతకల్లు-కల్లూరు వయా గూళ్యపాళ్యం, కల్లూరు-ధర్మవరం మధ్య డబ్లింగ్ పనులకు రూ.50 కోట్లు కేటాయించారు. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి.గుంటూరు-గుంతకల్లు డబుల్‌లైన్ పనులకు రూ.1,400 కోట్లు అవసరమని రైల్వేబోర్డు నివేదికలు తయారు చేసింది. ఈ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాల్సి ఉంది.

ధర్మవరం-పాకాల మధ్య డబ్లింగ్ పనులకు రూ.10 కోట్లు కేటాయించినా సర్వేలో జాప్యం .
హోస్పేట-గుంతకల్లు మధ్య డబ్లింగ్ పనులు నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి.
రేణిగుంట-తిరుపతి మధ్య డబ్లింగ్ పనులకు రూ.1.10 కోట్లు కేటాయించారు.
రాయచూర్-గుంతకల్లు మార్గంలో పెండింగ్‌లో ఉన్న 13 కి.మీల డబ్లింగ్ పనులకు రూ.6 కోట్లు కేటాయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement