అప్పు తిరిగివ్వలేదని.. బాలిక నిర్బంధం | girl gets detention for money | Sakshi
Sakshi News home page

అప్పు తిరిగివ్వలేదని.. బాలిక నిర్బంధం

Jun 23 2016 3:58 PM | Updated on Sep 4 2017 3:13 AM

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని.. ఓ వడ్డీ వ్యాపారి బాలికను నిర్బంధించిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో గురువారం వెలుగుచూసింది.

గుంతకల్లు (అనంతపురం) : తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని.. ఓ వడ్డీ వ్యాపారి బాలికను నిర్బంధించిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న అరుణ వడ్డీ వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఓ మహిళ తన కుటుంబ అవసరాల కోసం అరుణ నుంచి రూ.17 వేలు అప్పుగా తీసుకుంది.

తిరిగి చెల్లించడంలో ఆలస్యం అవడంతో.. కోపోద్రిక్తురాలైన వడ్డీ వ్యాపారి బాధితురాలి ఎనిమిదేళ్ల కూతురిని తన ఇంట్లో నిర్బంధించుకొని డబ్బులు ఇస్తేనే వదిలేస్తానని చెప్పింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement