borrow
-
మంగళవారం అప్పుల బాంబు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు మంగళవారాల అప్పుల ముఖ్యమంత్రిగా మారిపోయారు! కేవలం 22 రోజుల వ్యవధిలో మూడు మంగళవారాల్లో ఏకంగా రూ.9,000 కోట్లు అప్పు చేశారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మంగళవారం అప్పులు చేస్తోందంటూ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం పదేపదే ఆరోపణలు చేయడంతోపాటు రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నారంటూ బురద చల్లేందుకు ప్రయత్నించాయి. గత సర్కారు పరిమితికి లోబడి నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆచితూచి అప్పులు చేసినా మహా ఘోరం చేసినట్లు చిత్రీకరించాయి.ఇప్పుడు చంద్రబాబు మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకున్నా కిక్కురుమనకపోవడం గమనార్హం. తాజాగా ఈ నెల 16న మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.2,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. 16 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 19 ఏళ్ల కాల వ్యవధితో మరో రూ.1000 కో ట్లు చొప్పున 7.33 శాతం వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం అ ప్పు చేసింది.దీంతో ఇప్పటి వరకు కూటమి ప్రభు త్వం చేసిన అప్పులు రూ.9,000 కోట్లకు చేరుకున్నా యి. ఇదంతా ఎల్లో మీడియాకు సంపద సృష్టిలా కనిపిస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. 22 రోజుల్లో రూ.9,000 కోట్ల అప్పుల భారం మోపిన కూటమి సర్కారు అదంతా ఏ దేనికి వ్యయం చేసిందో చెబితే బాగుంటుందని పరిశీలకులు సూచిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అప్పులు చేయడాన్ని తప్పుబట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు బాబు సర్కారు అ ప్పులపై ఎందుకు నోరు మెదపడం లేదో ప్రజలు గమనిస్తున్నారని ఓ అధికారి అన్నారు. బడ్జెట్ బయట గ్యారెంటీ అప్పు రూ.5,200 కోట్లురైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖతో పాటు మార్కెఫెడ్లు బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులకు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంపై ఎల్లో మీడియాతో పాటు టీడీపీ నేతలు రభస చేశారు. తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పౌరసర ఫరాల సంస్ధ, మార్కెఫెడ్లు బ్యాంకుల నుంచి చేసే రూ.5,200 కోట్ల అప్పులకు ప్రభుత్వ గ్యారెంటీ ఇ స్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.నాడు త ప్పు లుగా తోచినవన్నీ నేడు ఒప్పులుగా కనిపిస్తున్నా యా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభు త్వ గ్యారెంటీలు ఇచ్చి బడ్జెట్ బయట అ ప్పులు తేవ డాన్ని, ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో రుణాలు తీసుకోవడం ప్రారంభించిందీ గ తంలో చంద్రబాబు అధికారంలో ఉండగానే అనే విషయం గుర్తుంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. -
వచ్చే ఆరు నెలల్లో రూ.6.55 లక్షల కోట్ల రుణాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023–24 ద్వితీయార్థంలో (2023 అక్టోబర్– మార్చి 2024) డేటెడ్ సెక్యూరిటీల ద్వారా రూ. 6.55 లక్షల కోట్లు రుణం తీసుకోనున్నట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఇందులో సావరిన్ గ్రీన్ బాండ్ల (ఎస్‌జీఆర్‌బీ) జారీ ద్వారా సమీకరణల మొత్తం రూ. 20,000 కోట్లు. మార్కెట్ రుణ సమీకరణల ద్వారానే ప్రభుత్వం తన ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం)ను పూడ్చుకునే సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరంలో రూ.15.43 లక్షల కోట్ల స్థూల మార్కెట్ రుణ సమీకరణలను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ద్వితీయార్థం వాటా (రూ.6.55 లక్షల కోట్లు) రూ.42.45 శాతం. దీర్ఘకాలిక సెక్యూరిటీల కోసం మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో మొదటిసారి 50 సంవత్సరాల సెక్యూరిటీ (బాండ్) కూడా ఈ దఫా జారీ చేస్తుండడం గమనార్హం. 20 వారాల పాటు జరిగే వేలం ద్వారా రూ.6.55 లక్షల కోట్ల స్థూల మార్కెట్ రుణ సమీకరణలు పూర్తవుతాయి. మార్కెట్ రుణం 3, 5, 7, 10, 14, 30, 40, 50 సంవత్సరాల సెక్యూరిటీలలో ఉంటుంది. -
Telangana: అప్పులకు ‘ఆలంబన’
సాక్షి, హైదరాబాద్: ద్రవ్య నియంత్రణ, బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం)లో రుణ పరిమితి పెంపు కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆలంబనగా నిలుస్తుందని తెలంగాణ ఆర్థిక శాఖ ఆశిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో 5 శాతం వరకు రుణం పొందొచ్చని వెసులుబాటు కలి్పంచింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దాదాపు రూ.60 వేల కోట్ల అప్పులు తీసుకోవచ్చని అంచనా వేస్తోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.11.05 లక్షల కోట్ల వరకు ఉండొచ్చన్న అంచనా మేరకు అందులో 5 శాతం అంటే రూ.55 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు అప్పులు తీసుకునే అవకాశముందని లెక్కలు కడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో మొత్తం రూ.47,500 కోట్లను బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా సమీకరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు అదనంగా మరో రూ.7,500 నుంచి రూ.12,500 కోట్ల వరకు తీసుకునే వెసులుబాటు కలగనుందని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఓవర్ డ్రాఫ్ట్ లోనూ ఊరట.. ప్రతి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ)కు వెళ్లేందుకు 36 రోజుల సమయం అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఓడీని ఆర్బీఐ సవరించింది. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 3 నెలల కాలంలో 50 రోజుల పాటు ఓడీకి వెళ్లొచ్చు. అలాగే గతంలో వరుసగా 14 రోజులు మాత్రమే ఓడీకి వెళ్లే వీలుండగా, ఇప్పుడు అది 21 రోజులకు పొడిగించింది. ఈ వెసులుబాటు అన్ని రాష్ట్రాలకు సెప్టెంబర్ 30 వరకు వర్తించనుంది. దీంతో కష్టకాలంలో ఓడీలు ఉపయోగపడతాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. ముఖ్యంగా వేతనాలు, వడ్డీల చెల్లింపు లాంటి తక్షణావసరాలకు ఈ వెసులుబాటు ఉపయోగపడుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం తగ్గిన నేపథ్యంలో నిధుల సమీకరణ ఎలా అన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే మొదటి త్రైమాసికానికి గాను బాండ్ల అమ్మకాల ద్వారా రూ.9 వేల కోట్ల సమీకరణకు ప్రణాళిక రూపొందించుకోగా, మిగిలిన నిధులు ఎక్కడి నుంచి తేవాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇందుకు సంబంధించిన లెక్కలు ఈ నెలాఖరుకు తేలుతాయని, మేలో ఆదాయ, వ్యయ అంచనాల ఆధారంగా, వచ్చే త్రైమాసికానికి కూడా నిధుల సమీకరణ ప్రణాళిక రూపొందిస్తామని చెబుతున్నారు. -
అప్పు చుట్టూ ఇంత రాజకీయమా?
చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి వంద కోట్ల రూపాయల నిధి మాత్రమే ఉందని కూడా ఒక పత్రిక వార్త ఇచ్చింది. అయినా జగన్ ప్రభుత్వం నానా తంటాలు పడి వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఆయన పాలనకు ఏడాది కాకముందే కరోనా సంక్షోభం కుదిపేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్రమైన కష్టాలలో పడ్డాయి. అందులో ఏపీ మరింత క్లిష్ట పరిస్థితికి గురైంది. అప్పులు చేసుకోండని కేంద్రమే రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించింది. అంతేకాక ఆత్మనిర్భర్ భారత్ పేరుతో రకరకాల రుణాలు ఇవ్వడం, అప్పుల పరిమితి పెంచడం వంటివి చేశారు. వాటి గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకుండా అప్పుల్లో నెంబర్ వన్ అంటూ ఏపీ ప్రభుత్వం 79వేల కోట్లకు పైగా అప్పు చేసిందని వార్త ఇచ్చారు. రాష్ట్ర ప్రజలను గాలికి వదలి ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకపోతే, వారంతా ఆర్థికంగా అల్లాడుతుంటే వీరంతా సంతోషించేవారని అనుకోవాలి. ఈ మధ్య ఒక ప్రముఖ పత్రిక అప్పుల్లో నెంబర్ వన్ అంటూ ఏపీ ఆర్థిక సమస్యలపై ఒక భారీ కథనాన్ని ఇచ్చింది. తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియా ప్రతి నెలలో ఒకటికి రెండుసార్లు ఇలాంటి కథనాలు ఇస్తున్నాయి. అప్పులు భారీగా చేయడం ప్రమాదమే. ఆ విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తగానే ఉండాలి. అంతవరకు తప్పు లేదు. కాని ఆ వార్త రాసిన తీరు. ఏ పరిస్థితిలో అప్పులు చేయవలసి వచ్చింది, దానికి కేంద్రం అనుమతి ఉందా? లేదా, నిర్దిష్ట ఎఫ్ఆర్బీఎమ్ చట్ట పరిధిలో ఉందా? లేదా అన్న అంశాల జోలికి వెళ్లకుండా కేవలం బురద చల్లే లక్ష్యంతో ఆ మీడియా వార్తలు ఇవ్వడమే బాధాకరం. పోనీ ఇదే మీడియా గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షన్నర కోట్ల అప్పు తెచ్చినప్పుడు రెగ్యులర్‌గా ఇలాంటి కథనాలు వచ్చి ఉంటే, అప్పుడు ఇచ్చారు.. ఇప్పుడూ ఇచ్చారులే అని సరిపెట్టుకోవచ్చు. కాని అప్పుడు రుణం తేవడం సమర్థతగా, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖం చూసి అప్పులు ఇచ్చేవారు ఎగబడుతున్నట్లు కథనాలు రాశారు. ఉదాహరణకు రాజధాని అమరావతి పేరుతో రెండువేల కోట్ల రూపాయల విలువైన బాండ్లను విడుదల చేస్తే అవి నిమిషాలలో అమ్ముడు పోయాయని, విపరీతమైన స్పందన వచ్చిందని అప్పట్లో ఈ పత్రికలు స్టోరీలు ఇచ్చాయి. అంతేకాదు. ఎన్నికలు ఒకటి, రెండు నెలల్లో జరుగుతాయనగా చంద్రబాబు ప్రభుత్వం పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో వేల కోట్ల రూపాయలను పందారం చేసింది. అదంతా చంద్రబాబు గొప్పతనంగాను, ఆ స్కీములతో ఆడవాళ్లు, రైతులు అంతా ఎగబడి టీడీపీకి ఓట్లు వేయబోతున్నట్లు గాను ప్రచారం చేశాయి. కాని ప్రజలు ఆ స్కీములు ఎందుకు, ఎప్పుడు వచ్చాయో అర్థం చేసుకుని ప్రభుత్వానికి, తెలుగుదేశం మీడియాకు వాత పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి వంద కోట్ల రూపాయల నిధి మాత్రమే ఉందని కూడా ఒక పత్రిక వార్త ఇచ్చింది. అయినా జగన్ ప్రభుత్వం నానా తంటాలు పడి వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఆయన పాలనకు ఏడాది కాకముందే కరోనా సంక్షోభం కుదిపేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్రమైన కష్టాలలో పడ్డాయి. అందులో ఏపీ మరింత క్లిష్ట పరిస్థితికి గురైంది. అప్పులు చేసుకోండని కేంద్రమే రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించింది. అంతేకాక ఆత్మనిర్భర్ భారత్ పేరుతో రకరకాల రుణాలు ఇవ్వడం, అప్పుల పరిమితి పెంచడం వంటివి చేశారు. వాటి గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకుండా అప్పుల్లో నెంబర్ వన్ అంటూ ఏపీ ప్రభుత్వం 79 వేల కోట్లకు పైగా అప్పు చేసిందని వార్త ఇచ్చారు. రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలతో పోల్చి కథనాన్ని ఇచ్చారు. ఏపీ అప్పటి బడ్జెట్లో రూ.48,295 కోట్ల అప్పు చేయవలసి ఉంటుందని అంచనా వేస్తే, రూ.79 వేల కోట్లకు పైగా అప్పు చేయవలసి వచ్చింది. అంటే ఇది ఊహించిన దానికన్నా డబుల్ కాదు. రాజస్తాన్ బడ్జెట్లో రూ.10,482 కోట్ల అప్పులు అవసరం అవుతాయని అనుకుంటే రూ.51,304 కోట్లు అప్పు చేసింది. అంటే ఐదు రెట్లు అధికంగా అప్పు చేయవలసి వచ్చిందన్నమాట. తెలంగాణ రూ.33,191 కోట్ల అప్పు అంచనాతో ఉంటే, రూ.46,700 కోట్లు అప్పు చేసింది. ఆయా రాష్ట్రాలు ఇలా అప్పులు చేశాయి. కానీ ఈ అప్పులు ఎందుకు తెచ్చారు? కరోనా సమయంలో ప్రజల ఆదాయం పడిపోయి, సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో నవరత్నాల స్కీమ్ లోని వివిధ కార్యక్రమాల కింద అమ్మ ఒడి కావచ్చు, చిన్న పరిశ్రమలకు సాయం కావచ్చు, చేయూత కావచ్చు.. టైలర్లు, రజకులు, చేనేత కార్మికులు కావచ్చు.. ఇలా సమాజంలోని అణగారిన వర్గాలను ఈ డబ్బుతో ఆదుకున్నారు. ఈ విషయాలు కూడా ప్రస్తావించి ఉంటే ఆ కథనంలో తప్పు లేదని అనుకోవచ్చు. ఇవేవి రాయక పోవడంతో వారు ద్వేష భావంతో ఆ కథనం వండారని అర్థం అయిపోతుంది. వెంటనే టీటీపీ నేతలు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వంటివారు కానీ, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కానీ ఈ అప్పులపై విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. మరి యనమల ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు లక్షన్నర కోట్ల అప్పు తెచ్చారు. దానిని ఏ విధంగా ఖర్చు చేసింది చెప్పి ఉంటే, ఇప్పుడు ఈ ఖర్చు గురించి కూడా అడగవచ్చు. విశేషం ఏమిటంటే జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలో యనమల తదితరులు ఒక వ్యాఖ్య చేసేవారు. జగన్ ముఖం చూసి ఎవరూ రుణం ఇవ్వడం లేదని విమర్శించేవారు. ఇప్పుడు అదే పెద్దమనుషులు జగన్ అంత అప్పు చేశారు.. ఇంత అప్పు చేశారు.. అని గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలను గాలికి వదలి ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకపోతే, వారంతా ఆర్థికంగా అల్లాడుతుంటే వీరంతా సంతోషించేవారని అనుకోవాలి. అప్పుడు ఆ విమర్శలు చేసేవారు. ప్రతిపక్షానికి రెండువైపులా మాట్లాడే అవకాశం ఉంటుందని ఊరికే అనరు. అప్పు తేలేదనుకోండి..వీళ్లకు అప్పులు ఇచ్చేవారు కూడా లేరు.. జనాన్ని ఆదుకోలేదని విమర్శించేవారు. ఇప్పుడు అప్పులు తేగలిగారు కనుక అమ్మో అప్పులు తెచ్చేశారు.. ఇంతగా పెరిగిపోయాయి అని విమర్శిస్తున్నారు. మరో వైపు కేంద్రం అప్పులు కూడా భారీగానే పెరిగాయన్న విషయాన్ని విస్మరించరాదు. కోటి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు కేంద్రం మెడపై ఉంది. వాటి గురించి మాట్లాడే ధైర్యం తెలుగుదేశం నేతలకు లేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే కరోనా సంక్షోభ సమయంలో కూడా జగన్ తన హామీలు నెరవేర్చుతున్నారే అన్న దుగ్ధ తప్ప మరొకటి కాదని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఈ స్కీములను వారు నేరుగా విమర్శించకుండా అప్పులు, అప్పులు అని ప్రచారం చేస్తుంటారు. మరి గతంలో చంద్రబాబు రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలు మొత్తం లక్ష కోట్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చి చతికిలపడ్డారు. రైతు రుణాలే 87 వేల కోట్లు ఉంటే పాతికవేల కోట్లకు కుదించి అందులో 15 వేల కోట్లు మాత్రమే చెల్లించారు. మరి అదంతా ఉత్పాదక వ్యయమేనా అంటే అవునని వారు చెప్పగలరా? రాజధాని అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు వ్యయం చేయాలని పూనుకున్నారు. అదేమంటే లక్ష కోట్ల ఆదాయం వస్తుందని ప్రచారం చేశారు. నిజంగా అంత ఆదాయం వచ్చేటట్లయితే ప్రభుత్వధనం లక్ష కోట్లు ఎందుకు పెట్టాలన్నదానికి సమాధానం ఇవ్వలేరు. ఇలా అసంబద్ధమైన వాదనలతో చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారీతిలో అప్పులు చేసి దుబారాగా వ్యయం చేసింది. జగన్ ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలకోసం ఈ వ్యయం చేసింది. నిజమే. కొందరికి ఈ స్కీములు మంచివి కావేమో అన్న భావన ఉండవచ్చు. కాని ప్రజలు వాటిని అమలు చేయడానికి తీర్పు ఇచ్చారు. వాటిని అమలు చేయకపోతే ఈపాటికి జగన్ ప్రభుత్వం అన్ పాపులర్ అయి ఉండేది. చంద్రబాబు ఊరు, వాడ ఏకం చేసి మరీ విమర్శలు చేసేవారు. ఏది ఏమైనా ఒక్క విషయం చెప్పాలి. కరోనా సంక్షోభ సమయంలో అప్పులు తేవడాన్ని ఎవరూ తప్పుపట్టనవసరం లేదు. క్రమేపి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నందున దానికి తగ్గట్లుగా ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసుకోవాలి. మరీ ఎక్కువ అప్పులు తెస్తుందేమో అన్న అనుమానం మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజలకు కలగకుండా చూసుకుంటే చాలు. కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
జీఎస్టీ : 21 రాష్ట్రాలు కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ఏర్పడిన జీఎస్టీ లోటు భర్తీకి సంబంధించి 21 రాష్ట్రాలు కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించిన "ఆప్షన్ 1" ఎంచుకున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జీఎస్టీ ప్రతిపాదించిన రుణాలు తీసుకోవడానికే ఈ రాష్ట్రాలు నిర్ణయించాయి. తద్వారా ఆర్థిక మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఒక ప్రత్యేక విండో కింద రుణాల ద్వారా 97,000 కోట్ల అంచనా లోటును అప్పుగా తీసుకోవడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు అందించిన సమచారం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్న వాటిల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పాండిచేరి ఒకటి కావడం విశేషం. ఇంకా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇతర కాంగ్రెస్ లేదా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలిపాయి. అలాగే మిగిలిన రాష్ట్రాలు అక్టోబరు 5న జరగనున్న కౌన్సిల్ సమావేశాని కంటే ముందు తమ నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లేదంటే బకాయిల కోసం జూన్, 2022 వరకు వేచి ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి.('జీఎస్టీ రుణాల్ని కేంద్రమే చెల్లిస్తుంది') కాగా జీఎస్టీ అమలు ద్వారా రాష్ట్రాలు నష్టపోతున్న మొత్తం 97,000 కోట్లుగా లెక్కించాం. ఆ మొత్తాన్ని రాష్ట్రాలు కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ విండో ద్వారా రుణం రూపంలో పొందవచ్చు అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ప్రకటించారు. కోవిడ్ నష్టాన్ని కలుపుకుంటే మొత్తం లోటు రూ. 2,35,000 కోట్లుగా లెక్కించామనీ, ఈ మొత్తాన్ని రాష్ట్రాలు మార్కెట్ నుంచి రుణాలు పొందడం రెండో ఆప్షన్ గా పేర్కొన్నారు. ఈ రుణం తిరిగి కేంద్రం చెల్లిస్తుందని, కానీ వడ్డీని రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంద న్నారు. రాష్ట్రాలు ఈ రెండు విధానాల్లో ఏదైనా ఎంచుకోవచ్చనీ, 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కూలంకుషంగా చర్చించామనీ ఆమె తెలిపారు. రాష్ట్రాలకు రెండు ఆప్షన్స్ ఇచ్చామని ఆర్థికమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రూ.15కోసం దారుణంగా దంపతుల హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత దంపతులను ఓ షాపు యజమాని కర్కశంగా చంపేశాడు. కత్తితో దాడి చేసి వారిని హత్య చేశాడు. అది కూడా కేవలం రూ.15 అప్పు చెల్లించనుందుకు. ఈ ఘటన మెయిన్ పురి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఇది సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నియోజకవర్గం. పోలీసులు వివరాల ప్రకారం ఓ దుకాణంలో ఏవో సరుకుల నిమిత్తం దళిత దంపతులు పదిహేను రూపాయలు అప్పు చేశారు. వాటిని చెల్లించడం విఫలమయ్యారు. దానిపై ప్రశ్నించిన యజమాని ఆ వెంటనే వారిద్దరిపై కత్తితో దాడి చేసి చంపేశాడు. పోలీసులు హత్య చేసిన షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. -
వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక..
కరీమాబాద్ (వరంగల్) : వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక ఓ ఆటో డ్రైవర్ బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం జరిగిన అతన్ని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో గురువారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న పిట్ట వినోద్(25) కామునిపేట ప్రాంతానికి చెందిన అంగన్వాడి ఆయా బత్తిని స్వరూప వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న వినోద్ సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించలేకపోవడంతో.. స్వరూప తన మనుషులతో వినోద్ ఇంటి ముందు గొడవ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వినోద్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
అప్పు తిరిగివ్వలేదని.. బాలిక నిర్బంధం
గుంతకల్లు (అనంతపురం) : తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని.. ఓ వడ్డీ వ్యాపారి బాలికను నిర్బంధించిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న అరుణ వడ్డీ వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలో స్థానికంగా ఓ మహిళ తన కుటుంబ అవసరాల కోసం అరుణ నుంచి రూ.17 వేలు అప్పుగా తీసుకుంది. తిరిగి చెల్లించడంలో ఆలస్యం అవడంతో.. కోపోద్రిక్తురాలైన వడ్డీ వ్యాపారి బాధితురాలి ఎనిమిదేళ్ల కూతురిని తన ఇంట్లో నిర్బంధించుకొని డబ్బులు ఇస్తేనే వదిలేస్తానని చెప్పింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. -
అప్పు చెల్లించలేదని వ్యక్తి అపహరణ
శంషాబాద్ (రంగారెడ్డి) : తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకపోవడంతో ఓ వ్యక్తిని రుణదాతలు అపహరించుకుపోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన బురాన్ శంషాబాద్‌లోని మధురానగర్‌లో నివాసం ఉంటూ స్థానికంగానే వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు దేవరకద్రకు చెందిన సుజాత అనే మహిళ దగ్గర రూ.40వేలు అప్పు కింద తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం బురాన్ ఇంటికి సుజాత తరఫున నలుగురు వ్యక్తులు వచ్చి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని కోరారు. తనకు బయట వచ్చేవి ఉన్నాయని, అవి వచ్చిన వెంటనే తీరుస్తానని అతడు చెప్పాడు. దీంతో మాట్లాకుందాం రమ్మంటూ అతడ్ని తమ వెంట తీసుకెళ్లిపోయారు. తన భర్తను కిడ్నాప్ చేశారంటూ నర్సమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుతీర్చలేదని తల్లిబిడ్డల నిర్బంధం
అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుతీర్చలేదని ఓ వడ్డీ వ్యాపారస్తుడు తల్లి ఇద్దరు పిల్లలను నెలరోజులుగా నిర్బంధంలో ఉంచిన ఘటన జిల్లాలోని కదిరిలో జరిగింది. నెలరోజులపాటు ఆ వ్యాపారస్తుడు ఇబ్బందులు పెట్టినట్లు కూడా తెలిసింది. చివరకు ఈ విషయం పోలీసులకు తెలిసి వడ్డీ వ్యాపారస్తుడుని అరెస్టు చేయగా బాధితులకు విముక్తి లభించింది. -
తొలిసారి అప్పు చేయనున్న ఏపీ !
రూ.2,000 కోట్ల అప్పునకు కేంద్రం అనుమతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తరువాత తొలిసారిగా ఈ నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్ల అప్పు చేయనుంది. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే అనుమతించింది. దీంతో ఈ నెలాఖరులోగా రూ.2,000 కోట్ల రుణ సమీకరణకు గాను సెక్యూరిటీల విక్రయానికి తేదీని ఖరారు చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి లేఖ రాసింది. ఆర్బీఐ ప్రకటించిన తేదీన సెక్యూరిటీల వేలంలో పాల్గొనే ఆర్థిక సంస్థలు దాఖలు చేసే బిడ్ల ఆధారంగా మొత్తం రూ.2,000 కోట్లను సమీకరించాలా? లేక రూ.1,500 కోట్లనే సేకరించాలా? అనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా మరో రూ.3,000 కోట్ల అప్పు చేసేందుకు కూడా అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. -
కేసీఆర్‌కు కేటీఆర్ బాకీ రూ. 43.40 లక్షలు
హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు, ఆ పార్టీ ఎమ్మెల్యే కే టీ రామారావుకు 43.40 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. తండ్రీకొడుకుల మధ్య రుణం ఏంటన్నే ఆశ్చర్యం కలగవచ్చు. అయితే నామినేషన్ల దాఖలు కార్యక్రమం సందర్భంగా ఈ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. టీఆర్ఎస్ తరపున శాసనసభకు కేటీఆర్ బుధవారం నామినేషన్ వేశారు. తనకు మొత్తం 1.82 కోట్ల రూపాయిల అప్పులు ఉన్నట్టుగా ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో తండ్రి కేసీఆర్ నుంచి 43.40 లక్షల రూపాయిలు అప్పుగా తీసుకున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో చివరి రోజైన బుధవారం కేటీఆర్‌తో పాటు ఆయన తండ్రి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు.