కేసీఆర్కు కేటీఆర్ బాకీ రూ. 43.40 లక్షలు
హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర రావు, ఆ పార్టీ ఎమ్మెల్యే కే టీ రామారావుకు 43.40 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. తండ్రీకొడుకుల మధ్య రుణం ఏంటన్నే ఆశ్చర్యం కలగవచ్చు. అయితే నామినేషన్ల దాఖలు కార్యక్రమం సందర్భంగా ఈ ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
టీఆర్ఎస్ తరపున శాసనసభకు కేటీఆర్ బుధవారం నామినేషన్ వేశారు. తనకు మొత్తం 1.82 కోట్ల రూపాయిల అప్పులు ఉన్నట్టుగా ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో తండ్రి కేసీఆర్ నుంచి 43.40 లక్షల రూపాయిలు అప్పుగా తీసుకున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో చివరి రోజైన బుధవారం కేటీఆర్తో పాటు ఆయన తండ్రి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేశారు.