మరో రూ.2,000 కోట్లు అప్పు చేసిన కూటమి సర్కారు
సెక్యూరిటీల వేలం ద్వారా రుణ సమీకరణ
22 రోజులు.. మూడు మంగళవారాల్లో రూ.9,000 కోట్ల అప్పుల మంట
నాడు గుండెలు బాదుకుని నేడు కిక్కురుమనని ఎల్లో మీడియా
25/06/2024 (మంగళవారం) 2,000
02/07/2024 (మంగళవారం) 5,000
16/07/2024 (మంగళవారం) 2,000
22 రోజుల వ్యవధిలో కూటమి ప్రభుత్వం అప్పులు ఇలా (రూ.కోట్లలో)
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు మంగళవారాల అప్పుల ముఖ్యమంత్రిగా మారిపోయారు! కేవలం 22 రోజుల వ్యవధిలో మూడు మంగళవారాల్లో ఏకంగా రూ.9,000 కోట్లు అప్పు చేశారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మంగళవారం అప్పులు చేస్తోందంటూ ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం పదేపదే ఆరోపణలు చేయడంతోపాటు రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నారంటూ బురద చల్లేందుకు ప్రయత్నించాయి. గత సర్కారు పరిమితికి లోబడి నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆచితూచి అప్పులు చేసినా మహా ఘోరం చేసినట్లు చిత్రీకరించాయి.
ఇప్పుడు చంద్రబాబు మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకున్నా కిక్కురుమనకపోవడం గమనార్హం. తాజాగా ఈ నెల 16న మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ.2,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. 16 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 19 ఏళ్ల కాల వ్యవధితో మరో రూ.1000 కో ట్లు చొప్పున 7.33 శాతం వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం అ ప్పు చేసింది.
దీంతో ఇప్పటి వరకు కూటమి ప్రభు త్వం చేసిన అప్పులు రూ.9,000 కోట్లకు చేరుకున్నా యి. ఇదంతా ఎల్లో మీడియాకు సంపద సృష్టిలా కనిపిస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. 22 రోజుల్లో రూ.9,000 కోట్ల అప్పుల భారం మోపిన కూటమి సర్కారు అదంతా ఏ దేనికి వ్యయం చేసిందో చెబితే బాగుంటుందని పరిశీలకులు సూచిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అప్పులు చేయడాన్ని తప్పుబట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు బాబు సర్కారు అ ప్పులపై ఎందుకు నోరు మెదపడం లేదో ప్రజలు గమనిస్తున్నారని ఓ అధికారి అన్నారు.
బడ్జెట్ బయట గ్యారెంటీ అప్పు రూ.5,200 కోట్లు
రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖతో పాటు మార్కెఫెడ్‌లు బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులకు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంపై ఎల్లో మీడియాతో పాటు టీడీపీ నేతలు రభస చేశారు. తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పౌరసర ఫరాల సంస్ధ, మార్కెఫెడ్‌లు బ్యాంకుల నుంచి చేసే రూ.5,200 కోట్ల అప్పులకు ప్రభుత్వ గ్యారెంటీ ఇ స్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
నాడు త ప్పు లుగా తోచినవన్నీ నేడు ఒప్పులుగా కనిపిస్తున్నా యా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభు త్వ గ్యారెంటీలు ఇచ్చి బడ్జెట్ బయట అ ప్పులు తేవ డాన్ని, ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో రుణాలు తీసుకోవడం ప్రారంభించిందీ గ తంలో చంద్రబాబు అధికారంలో ఉండగానే అనే విషయం గుర్తుంచుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment