తొలిసారి అప్పు చేయనున్న ఏపీ ! | Andhra Pradesh to borrow first time | Sakshi
Sakshi News home page

తొలిసారి అప్పు చేయనున్న ఏపీ !

Published Sun, Aug 24 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM

Andhra Pradesh to borrow first time

రూ.2,000 కోట్ల అప్పునకు కేంద్రం అనుమతి

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తరువాత తొలిసారిగా ఈ నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్ల అప్పు చేయనుంది. ఇందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే అనుమతించింది. దీంతో ఈ నెలాఖరులోగా రూ.2,000 కోట్ల రుణ సమీకరణకు గాను సెక్యూరిటీల విక్రయానికి తేదీని ఖరారు చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి లేఖ రాసింది. ఆర్‌బీఐ ప్రకటించిన తేదీన సెక్యూరిటీల వేలంలో పాల్గొనే ఆర్థిక సంస్థలు దాఖలు చేసే బిడ్‌ల ఆధారంగా మొత్తం రూ.2,000 కోట్లను సమీకరించాలా? లేక రూ.1,500 కోట్లనే సేకరించాలా? అనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా మరో రూ.3,000 కోట్ల అప్పు చేసేందుకు కూడా అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement