ఏ తల్లి కన్నబిడ్డో! | Left a child in Hospital | Sakshi
Sakshi News home page

ఏ తల్లి కన్నబిడ్డో!

Published Wed, Apr 15 2015 4:01 AM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM

ఏ తల్లి కన్నబిడ్డో!

ఏ తల్లి కన్నబిడ్డో!

అనంతపురం(గుంతకల్లు టౌన్): ముద్దులొలికే ఓ చిన్నారిని  ఓ ప్రెవేట్ ఆస్పత్రిలోనే ఎవరో వదిలివేశారు.  అమ్మఒడిలో వెచ్చగా హాయిగా ఒదిగిపోవాల్సిన ఆ పసికందు గుక్క పట్టి ఏడుస్తుంటే ఆస్పత్రిలో పనిచేసే మహిళలు అక్కున చేర్చుకుని చిన్నారికి పాలు పట్టించి ఓదార్చారు. ఈ ఘటన మంగళవారం ఉదయం గుంతకల్లు పట్టణంలోని శ్రీ పద్మావతి శ్రీనివాస మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో వెలుగుచూసింది.

వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పద్మావతి ఆస్పత్రి ఓపి విభాగంలో సరిగ్గా 11 గంటల సమయంలో నెల రోజుల వయస్సు కలిగిన ఓ ఆడశిశువు గుక్కపట్టి ఏడుస్తోంది. అక్కడ ఉన్ననర్సులు ఆస్పత్రికి వచ్చిన వారే చిన్నారిని అక్కడ పడుకోపెట్టి చికిత్స చేయించుకునేందుకు వెళ్లారేమోనని భావించారు. గంటసేపయినా ఆ చిన్నారి తాలూకా వారు ఎవరూ రాలేదు. దీంతో ఆస్పత్రిలో పనిచేసే నర్సు గౌరమ్మ తన అక్కున చేర్చుకుని పాపాయికి పాలు పట్టి ఓదార్చింది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ ఎస్‌ఐ నగేష్‌బాబు ఆస్పత్రి సిబ్బందిని విచారించారు. చైల్డ్‌లైన్‌కు చిన్నారిని అప్పగించారు. శిశువుకు వైద్యపరీక్షలు చేయించిన తరువాత వారి తల్లిదండ్రుల కోసం ఒక రోజు పాటు తమ వద్ద అబ్జర్వేషన్‌లో ఉంచుకుని, బుధవారం  అనంతపురంలోని శిశువిహార్‌కు తరలిస్తామని  చైల్డ్‌లైన్‌ బాధ్యురాలు చెప్పారు. ఆడపిల్ల పుట్టిందనే కారణం చేతనే శిశువును వదిలేసి వెళ్లారా?  ఎవరు వదిలారు? అనే విషయాలను తెలుసుకునేందుకు  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement