మండల పరిధిలోని కసాపురం వద్ద ఏర్పాటు చేసిన పుష్కరఘాట్ వద్ద గత 12 రోజులుగా వైభవంగా సాగిన కృష్ణా పుష్కరాలు మంగళవారం నాటి తెప్పోత్సవంతో ముగిశాయి.
కసాపురం(గుంతకల్లు రూరల్) : మండల పరిధిలోని కసాపురం వద్ద ఏర్పాటు చేసిన పుష్కరఘాట్ వద్ద గత 12 రోజులుగా వైభవంగా సాగిన కృష్ణా పుష్కరాలు మంగళవారం నాటి తెప్పోత్సవంతో ముగిశాయి. జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ హాజరయ్యారు. ఆంజనేయస్వామిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి, తెప్పోత్సవంపై కొలువుదీర్చి, ప్రత్యేకSపూజలు చేశారు. వేలాది మంది మహిళలు కృష్ణమ్మకు హారతులు పట్టారు.
ఒంటెవాహనంపై విహరించిన నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్: శ్రావణమాసం మూడో మంగళవారం రాత్రి నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. వేద పండితులు అనంతపద్మనాభశర్మ , రామకృష్ణావధాని , ఆలయ ప్రధాన అర్చకుడు వసుధరాజాచార్యులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో ముత్యాలరావు ఆధ్వర్యంలో ప్రాకారోత్సవం నిర్వహించారు.