అనంతపురం సప్తగిరిసర్కిల్ :
గుంతకల్లును తక్షణమే రైల్వేజోన్‌గా ప్రకటించాలని రాయలసీమ విమోచన సమితి సమన్వయకర్త అశోక్‌వర్ధన్ రెడ్డి, గుంతకల్లు రైల్వే జోన్ సాధన సమితి సమన్వయకర్త రాజశేఖర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్ ఆవరణ లో గుంతకల్లు రైల్వే జోన్ సాధన పోస్టర్‌లను బుధవారం విడుదల చేశారు. నేటి నుంచి జిల్లాలో లక్ష కరపత్రాలను పంపిణీ చేస్తామన్నారు.
రాష్ట్రంలోనే గుంతకల్లు అత్యధిక ఆదాయం కలిగిన డివిజన్ అని తెలిపారు. దక్షిణ భారతదేశాన్ని కలిపే రైల్వే వ్యవస్థ గుంతకల్లుకు ఉందని దీంతో రైల్వేజోన్‌గా ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ నిర్మాణ విద్యార్థి సమాఖ్య అధ్యక్షులు సీమక్రిష్ణా నాయక్, ఆర్‌వీపీయస్ అధ్యక్షులు రవికుమార్, బాషా, బండి నారాయణ స్వామి, కుమార్ నాయక్ తదితరులు పాల్గోన్నారు.