పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
Published Tue, Apr 5 2016 3:20 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
గుంతకల్లు (అనంతపురం జిల్లా) : గుత్తి మండలం చట్నేపల్లికి చెందిన ఒక మహిళ తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. బెంగళూరుకు చెందిన నేత్రావతికి ఎనిమిదేళ్ల క్రితం చట్నేపల్లికి చెందిన రఘుబాబుతో వివాహమైంది. వీరికి మురహరి(6), మహేష్(5)లు సంతానం. రఘుబాబు వ్యాపారం చేసేవాడు. అమితే రఘుబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దాంతో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి.
వివాహేతర సంబంధం వదులుకోమని మంగళవారం ఉదయం కూడా నేత్రావతి భర్తను బతిమాలిందని, భర్త వినకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన నేత్రావతి ఇద్దరు పిల్లలకు ఉరివేసి తనూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. ప్రస్తుతం రఘుబాబు పరారీలో ఉన్నాడు. సమాచారం అందుకున్న గుత్తి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement