మద్యం సేవిస్తూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది.
గుంతకల్లు (అనంతపురం) : మద్యం సేవిస్తూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక కసాపురం రోడ్డులో ఉన్న స్వాగత్ వైన్స్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి(40) మద్యం సేవిస్తూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కల్తీ మద్యం సేవించడం వల్లే మృతిచెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.