20 మంది జూదరుల అరెస్ట్‌.. | 20 gamblers arrest | Sakshi

20 మంది జూదరుల అరెస్ట్‌..

Published Wed, Sep 13 2017 10:10 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

20 gamblers arrest

గుంతకల్లు రూరల్‌: కదిరిపల్లి సమీపంలోని పేకాట స్థావరంపై గుంతకల్లు రూరల్‌ ఎస్‌ఐ బాబాజాన్‌ తన సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. 20 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారినుంచి 14 సెల్‌ఫోన్‌లు, 7 బైక్‌లు, రూ. 2 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అడపాదడపా జూదరులు పట్టుపడుతున్నప్పటికీ, ఇంత భారీ ఎత్తున గ్యాంబ్లింగ్‌ జరుగుతూ పట్టుపడటం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో నిఘా మరింత పెంచుతామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement