అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
గుంతకల్లు : మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు డీఎస్పీ శ్రీధర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు అర్బన్ సీఐ రాజు, టూటౌన్ ఎస్‌ఐ వలిబాషు ఒక బృందం, వన్‌టౌన్ ఎస్‌ఐ నగేష్‌బాబు మరో టీంగా ఏర్పడి నాలుగు రోజులుగా పట్టణంలో విస్తృతంగా దాడులు నిర్వహించి మట్కా ఆర్గనైజర్స్ జేపీ రామచంద్ర (బళ్లారి), సుధాకర్‌రెడ్డి (ప్యాపిలి, కర్నూలుజిల్లా)తోపాటు పట్టణానికి చెందిన బీటర్లు ఎం.గోపి, రంగ, అంజాద్, మాబు, సంజీవరాయుడు, భీమన్న, కృష్ణమూర్తి, లోకలను అరెస్టు చేశారన్నారు. వీరి నుంచి రూ 2.25లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.