మతసామరస్యానికి ప్రతీక మస్తానయ్య ఉరుసు
- రేపటి నుంచి ఉత్సవాలు
గుంతకల్లు: పట్టణంలోని పాతగుంతకల్లులో వెలసిన హజరత్ సయ్యద్‌షాఅలీ అక్బర్ ఉరుఫ్ హజరత్ మస్తాన్‌వలి ఉరుసు హిందూముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మస్తాన్‌వలి దర్గా 381వ ఉరుసు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఏటా మొహర్రం పండుగ తర్వాత 15 రోజులకు ఉరుసు ప్రారంభిస్తారు. ఉత్సవాలకు దర్గా కమిటీ సభ్యులు, నిర్వాహకులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. దర్గాకు రంగులు అద్దుతున్నారు. దర్గా ఆవరణంలో పలు రకాల బొమ్మల, మిఠాయి అంగళ్లు వెలిశాయి. మహోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు మస్తాన్‌వలి దర్గా కమిటీ సభ్యులు, నిర్వాహకులు. అందులో భాగంగానే దర్గాకు రంగులు దిద్దుతున్నారు. దర్గా ఆవరణంలో పలు రకాల బొమ్మల, మిఠాయి అంగళ్లు వెలిశాయి. ఈ నెల 26న స్వామివారి గంధం ఊరేగింపు, 27న రాత్రి షంషీర్ (ఉరుసు) జరుగుతుందన్నారు. 28న జియారత్ కార్యక్రమంతో ఉరుసు ముగుస్తుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా తదితర ప్రాంతాలతోపాటు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు ఉత్సవాలకు హాజరవుతారు. ఉరుసు రోజున స్వామి వారి దివిటీల్లో ఎండు కొబ్బరిని కాల్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు.