Urs Celebration
-
మహిమాన్విత సూఫీ క్షేత్రం.. కడప అమీన్‌పీర్ దర్గా
అడుగడుగునా ప్రశాంతత ఉట్టిపడే పవిత్రభూమి అది ఆధ్యాత్మిక శిఖరంగా విశ్వఖ్యాతిగాంచిన ప్రాంగణమది ఎందరో మహానుభావులు కొలువైన పుణ్యవాటిక అది భక్తుల కొంగుబంగారమై విలసిల్లుతున్న సూఫీ క్షేత్రమది అదే.. కడప నగరంలోని ప్రఖ్యాత అమీన్ పీర్ (పెద్ద) దర్గా.. ప్రధాన ఉత్సవానికి ముస్తాబవుతోంది.. త్వరత్వరగా! ఇపుడా సన్నిధిలో.. ఉరుసుకు వేళయింది రారండంటూ.. ఆహ్వానిస్తున్న సు‘గంధ’ పరిమళాలు వేడుకను కనులారా చూద్దామంటూ.. కదిలొస్తున్న ‘చాంద్ సితారే’లు ‘అయ్.. మాలిక్ దువా ఖుబూల్ కరో’ అంటూ దగ్గరవుతున్న చేతులు అందరి మనసుల్లో ప్రతిధ్వనిస్తున్న ‘ఆమీన్.. ఆమీన్’ పలుకులు కడప కల్చరల్ : ఆధ్యాత్మిక చింతనకు... మత సామరస్యానికి మారుపేరు కడప అమీన్‌పీర్ దర్గా. ప్రశాంతతకు నిలయంగా జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచిన పెద్దదర్గా గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతోంది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ప్రధాన ఉరుసు ఉత్సవాలకు దర్గా సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఇప్పటికే విద్యుద్దీప కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతోంది. పలు ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో దర్గా ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది. కడప నగరంలోని అమీన్‌పీర్ (పెద్ద) దర్గా జాతీయ స్థాయిలో విశిష్ట ఖ్యాతి పొందింది. దశాబ్దాలపాటు కఠోరమైన తపస్సు చేసిన దివ్య గురువులకు దర్గా నిలయంగా మారింది. ఇక్కడ గురువులు జీవ సమాధి కావడంతో మహిమాన్విత క్షేత్రంగా విలసిల్లుతోంది. దర్గాలో ప్రార్థనలు చేసి తమ సమస్యలు చెప్పుకుంటే తప్పక మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఏటా జరిగే ఉత్సవాలలో మతాలకతీతంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటుంటారు. ఈ దర్గా మతసామరస్యానికి, జాతీయ సమైక్యతకు మారుపేరుగా నిలుస్తోంది. మహిమాన్విత క్షేత్రం 16వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి మహా ప్రవక్త మహమ్మద్ వంశీకులైన ఖ్వాజా యే ఖ్వాజా.. నాయబే రసూల్ అతాయే రసూలుల్లా హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ సాహెబ్ తన సతీమణితో పాటు కుమారులు హజరత్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్, హజరత్ అహ్మద్ హుసేనీ సాహెబ్‌లు పలువురు శిష్యగణంతో ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. జీవ సమాధి హజరత్ పీరుల్లా మాలిక్ ఆధ్యాత్మిక బోధనలు చేయడంతో పాటు ఎన్నో మహిమలు చూపేవారు. అనతి కాలంలోనే మాలిక్ పట్ల పెద్ద సంఖ్యలో విశ్వాసం చూపడం, వారి సంఖ్య పెరుగుతుండటంతో గిట్టనివారికి కన్నుకుట్టింది. పీరుల్లా మాలిక్‌కు మహిమలే ఉంటే జీవసమాధి అయి మూడో రోజు సజీవంగా కనిపించాలని సవాల్ విసిరారు. దాన్ని చిరునవ్వుతో స్వీకరించిన ఆయన మొహర్రం పదో రోజు (షహదత్) తన పెద్ద కుమారుడు హజరత్ ఆరీఫుల్లా హుసేనీకి బాధ్యతలు అప్పగించి వందలాది మంది చూస్తుండగా సమాధిలోకి వెళ్లారు. మూడో రోజు సమాధి తెరిచిన వారికి అందులో ఆయన నమాజు చేస్తూ కనిపించారు. ఆయన శక్తిని ప్రత్యక్షంగా చూసిన గిట్టనివారు సైతం శిష్యులుగా మారారు. అనంతరం దర్గా బాధ్యతలు పెద్ద కుమారుడు హజరత్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ చేపట్టగా, చిన్న కుమారుడు హజరత్ అహ్మద్ హుసేనీ సాహెబ్ నందలూరు కేంద్రంగా ఆధ్యాత్మిక ప్రయాణం సాగించారు. మహా తపస్వి దర్గాను వ్యవస్థీకరించింది హజరత్ సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ అయినా ఇక్కడి పెద్ద ఉరుసు మాత్రం సూఫీ సర్ మస్తాని ఆరీఫుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ సాహెబ్ పేరిటే జరుగుతోంది. వీరు 40 ఏళ్లకు పైగా తాడిపత్రి అడవుల్లో, మిగతా 23 ఏళ్లు శేషాచల అడవుల్లో కఠోర తపస్సు చేశా రు. భక్తులు తొలుత ప్రధాన గురువులైన హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్‌ను దర్శించుకుని తర్వాత హజరత్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌తో పాటు హజరత్ అమీనుల్లా హుసేనీ సాహెబ్, ఇతర గురువుల మజార్లను దర్శించుకుంటారు. 11వ పీఠాధిపతి ఆధ్వర్యంలో.. దర్గాకు ప్రస్తుతం హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ 11వ పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఆయన చిన్న వయస్సులోనే అనేక మత గ్రంథాలను అధ్యయనం చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధించడం విశేషం. శిష్య కోటికి ఈయన కొంగు బంగారంగా నిలిచారు. మానవతా వాదానికి మారుపేరుగా నిలుస్తున్న ఆయన హయాంలోనే దర్గా విశేషంగా అభివృద్ధి చెందింది. కులమతాలకతీతంగా పీఠాధిపతి పట్ల భక్తుల్లో ఎనలేని గౌరవభావం నెలకొంది. కవిగా గురువులు ఆధ్యాత్మిక గురువుగానే కాకుండా కవిగా కూడా ప్రస్తుత దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ పేరు గడించారు. ‘అల్ రిసాలా’ సినిమాలో ఆయన ‘మర్హబా.. యా ముస్తఫా’ అనే నాత్ గీతాన్ని రాశారు. అది పెద్ద విజయం సాధించింది. అనంతరం ‘జుగ్ని’ సినిమాలో ఖాసిఫ్ పేరిట ఆయన ‘లాఖో సలాం’ పాట రాశారు. ఈ రెండు గీతాలను ఏఆర్ రెహ్మాన్ స్వీయ సంగీత నిర్వహణలో ఆలపించారు. ఇవేకాకుండా అనేక నాత్ సూఫీ గీతాలను రచించారు. ఇవి డీవీడీలు తదితర రూపాల్లో భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అటు ఆధ్మాత్మిక సందేశాలు.. ఇటు కవితాత్మక రచనలతో ఆయన ప్రత్యేకత చాటారు. సినీ నటుల సందడి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తన కుటుంబంతో ఏడాదికి కనీసం ఆరేడుసార్లు దర్గాను దర్శిస్తారు. బాలీవుడ్ స్టార్లు అభి షేక్, ఐశ్వర్యబచ్చన్, అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌లతో పాటు మరెందరో తెలుగు, తమిళ సినీ ప్రముఖులు.. రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రజాప్రతినిధులు కూడా ఈ దర్గాను దర్శిస్తుంటారు. సేవలకు మారు పేరుగా దర్గా పెద్దల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. పేద ముస్లిం యువతులకు కుట్టు, అల్లికల్లో శిక్షణ.. యువకులకు ఐటీఐ ద్వారా వృత్తి విద్యలు నేర్పుతున్నారు. అమీన్ బ్లడ్ గ్రూప్ పేరిట రక్తదానం చేస్తున్నారు. -
వరల్డ్ ఫాస్టెస్ట్ ఎస్యూవీ భారత్‌లో లాంచ్
ఎంతో కాలంగా వేచిచూస్తున్న ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్యూవీ భారత్‌లో లాంచ్ అయింది. ఊరుస్ పేరుతో ఈ ఎస్‌యూవీని ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని విడుదల చేసింది. దీని ధర ఎక్స్‌షోరూం, భారత్‌లో రూ.3 కోట్లగా నిర్ణయించింది. కంపెనీ చరిత్రలో ఇది రెండో ఎస్యూవీ కావడం విశేషం. ఎల్ఎం002 తర్వాత కంపెనీ ఉత్పత్తి చేసిన ఎస్యూవీ ఇదే. కొన్ని నెలల క్రితమే ఈ కారును గ్లోబల్‌గా లంబోర్ఘిని లాంచ్ చేసింది. ఈ లాంచింగ్‌తో భారత్ పోర్ట్‌ఫోలియోలో ఆవెంటోర్, హురాకాన్ వంటి సూపర్‌కార్ల సరసన ఇది కూడా వచ్చి చేరింది. 3500 వాహనాల వార్షిక ఉత్పత్తితో, ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల్లో మంచి వాల్యుమ్ను ఊరుస్ అందిస్తుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టెఫానో డొమెనికల్ అన్నారు. భవిష్యత్తు వృద్ధిలో భారత్ కూడా ఓవ్యూహాత్మకమైన మార్కెట్ అని లంబోర్ఘిని ఇండియా అధినేత శరద్ అగర్వాల్ చెప్పారు. ప్రపంచంలోని తొలి కొన్ని మార్కెట్లలో భారత్ కూడా ఒకటని పేర్కొన్నారు. ఇది కేవలం ప్రాక్టికల్ ఎస్యూవీ మాత్రమే కాదని, మెరుగైన ప్రదర్శనను ఇది కనబర్చనున్నట్టు లంబోర్ఘిని చెప్పింది. ఊరుస్ 4 లీటర్ ట్విన్-టర్బో వీ8 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది అత్యధికంగా 650 హెచ్‌పీ, 850ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3.6 సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్‌ను, 12.8 సెకన్లలో 200 కేఎంపీహెచ్‌ను చేరుకోగలదు. ఊరుస్ టాప్ స్పీడ్ 305 కేఎంపీహెచ్. దీని వీ8 ఇంజిన్ 8 స్పీడ్ టర్క్ కన్వర్టర్‌తో కలిసి రూపొందింది. ఈ ఇంజిన్ దాని విభాగంలో అత్యంత శక్తివంతమైనది, ఉరూస్‌ని దాని విభాగంలో అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీగా చేస్తుందని తెలుస్తోంది. కేవలం ఊరుస్ కోసమే స్పెషల్ టైర్లను లంబోర్ఘిని అభివృద్ధి చేసింది. -
15న కొత్త కేజీబీవీలు, యూఆర్ఎస్ల ప్రారంభం
డిప్యూటీ సీఎం కడియం వెల్లడి ప్రభుత్వ స్కూళ్లలో ఈసారి 50 వేల మంది విద్యార్థులు పెరిగారు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న 84 కొత్త కేజీబీవీలు, 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లను (యూఆర్ఎస్) ఇంగ్లిష్ మీడియంలో ప్రారంభి స్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలి పారు. ఈలోగా నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పాఠశాల విద్యా కార్యక్రమాలపై గురువారం డీఈవోలతో సమీక్ష తర్వాత కడియం మీడియాతో మాట్లాడారు. జిల్లాల్లో కలెక్టర్లు, డీఈవోలు అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను అన్ని జిల్లాల్లో అమలు చేసేలా వచ్చే నెలలో 3 రోజులపాటు డీఈవోలకు వర్క్‌షాప్ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసి సర్కారు ప్రతిష్టను పెంచేలా డీఈవోలు పని చేయాలన్నారు. ఒకటో తరగతిలో ఈసారి విద్యార్థుల సంఖ్య గతేడాదికన్నా 50 వేలు తగ్గిం దని, మొత్తంగా చూస్తే గతేడాదికన్నా ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల మంది విద్యార్థులు పెరిగారన్నారు. కొత్తగా 525 ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు ఇంగ్లిష్ మీడియంలో రావడం వల్ల పాఠశాలల నుంచి గురుకులాలకు వెళ్తున్నారన్నారు. తరగతి గదిలో సెల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేదిలేదన్నారు. పదో తరగతి ఫలితాలను పెంచేందుకు వచ్చే నెల 10వ తేదీ తరువాత ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో అదనంగా 2 గంటలపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఈ సారి జూన్ కంటే ముందే 95% పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు అందించామన్నారు. యూనిఫా రాల బట్ట అన్ని స్కూళ్లకు సరఫరా అయిందని, వాటిని కుట్టించే పని కూడా 80% పూర్తయిందన్నారు. ఈ నెలాఖరుకల్లా మొత్తం పూర్తవుతుందన్నారు. ఒక్క విద్యార్థి కూడా చేరని స్కూళ్లు ఉన్నప్పటికీ, ఈసారి ఒక్క పాఠశాలనూ మూసివేయలేదన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇన్చార్జి కమిషనర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
కస్తూర్బా తరహాలో యూఆర్ఎస్
బడిబయట ఉన్న బాలుర కోసం యూఆర్ఎస్ పాఠశాలల (అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో జిల్లాకు ఒకటి చొప్పున ప్రారంభించనుంది. వీటి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 శాతం చొప్పున నిధులు కేటాయించున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని, ఇందు కోసం భవనాన్వేషణలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. – సాక్షి, వికారాబాద్ భవనం లభించగానే ప్రారంభిస్తాం వికారాబాద్‌కు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైంది. ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభించే సమయానికే ఈ పాఠశాలను కూడా ప్రారంభించాలని ఉన్నతాధికారులు సూచించినా భవనం లభించలేదు. తాత్కాలిక భవనం కోసం అన్వేషిస్తున్నాం. భవనం లభించగానే ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తాం. ప్రభుత్వ భవనం లభించకపోతే అద్దె భవనంలోనైనా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. – దీపిక, జిల్లా విద్యాధికారి సాక్షి, వికారాబాద్: ఎటువంటి ఆసరా లేని, బడి బయట ఉన్న బాలికల విద్యాభ్యాసం కోసం ప్రభుత్వం కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలలు (కేజీబీవీ)లను దశాబ్దకాలం క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక్కడ బాలికలకు ఉచిత చదువుతో పాటుగా వసతులను కల్పించారు. దీంతో వేలాదిమంది బాలికలు ఇందులో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ ప్రక్రియ సత్ఫలితాలను ఇవ్వడంతో ఇదే తరహాలో బడిబయట ఉన్న బాలుర కోసం యూఆర్ఎస్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను సమకూర్చగా రాష్ట్ర వాటాగా 40శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది బాలల గుర్తింపు.. పనులకు వెళుతూ బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి వారికి విద్యాబోధన చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ పాఠశాల పనిచేయనుంది. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగానే ఈ తరహా పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయించారు. బాలకార్మికులు, తల్లిదండ్రులు లేని అనాథలు, తల్లి, తండ్రి మృతి చెందిన ఎలాంటి ఆసరా లేని పిల్లలు వీటిలో చేరేందుకు అర్హులుగా చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి వారి తెలివితేటలు, సామర్థ్యాలను ఆధారంగా చేసుకొని 6, 7, 8 తరగతుల్లో ప్రవేశం కల్పించి విద్యాబోధన చేయనున్నారు. జిల్లాలోని ఏమండలం వారైనా ప్రవేశానికి అర్హులు. కాగా.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వారిని చేర్చుకోవడానికి అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలలో సుమారుగా 100 మంది విద్యార్థులను చేర్చుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏడాది తరువాత వారికి నిర్వహించే పరీక్షా ఫలితాలను బట్టి రెగ్యులర్ పాఠశాలలో చేరవచ్చు.. లేదా అదే పాఠశాలలో చదివేందుకు అవకాశం ఉంటుంది. తాత్కాలిక భవనం కోసం అన్వేషణ ఉన్నతాధికారుల సూచన మేరకు యూఆర్ఎస్ బాలుర పాఠశాలను పాఠశాలలు తెరిచే 12వ తేదీనే ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నా భవనం ఇప్పటివరకు లభించలేదు. దీంతో ఈ పాఠశాల భవనం ప్రారంభానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పాఠశాలకు అనువైన ప్రైవేటు అద్దె భవనం ఏదైనా దొరుకుతుందా.. లేక ప్రభుత్వం భవనాలు ఏవైనా ఖాళీగా ఉన్నాయా అనే కోణంలో అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అనంతగిరిలో ఉన్న జిల్లా ట్రెజరీ కార్యాలయం (డీటీఓ) భవనంలో ఆన్లైన్, ఇంటర్నెట్ అంతరాయం, తదితర సమస్యలు తలెత్తుతున్నందు వల్ల ఈ భవనం వికారాబాద్ పట్టణంలోని మార్చారు. దీంతో ఈ డీటీఓ భవనం ఖాళీ అయితే తాత్కాలికంగా అందులో అర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను ఏర్పాటు చేయాలని కూడా అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏదిఏమైనా జిల్లాలో మరో బాలుర రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు కానుంది. -
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
కర్నూలు: గోనెగండ్ల పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నీలకంఠప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అదే మండలం గంజిహల్లి గ్రామంలో జరిగిన ఉరుసు బందోబస్తు విధులు ముగించుకుని శనివారం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తూ మార్గమధ్యంలో అదుపుతప్పి కింద పడటంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాలకు ఎదురుగా ఉన్న ఎస్జీఆర్ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆకే రవికృష్ణ హాస్పిటల్‌కు చేరుకుని నీలకంఠప్ప ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. రాత్రి 7 గంటల సమయంలో కోలుకోలేక ఆయన మృతిచెందారు. డీఎస్పీలు రమణమూర్తి, కొల్లి శ్రీనివాసరావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నారాయణ తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు. నీలకంఠప్ప మృతి వార్త తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. 1983లో ఈయన పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ఈయనకు భార్యతో పాటు ముగ్గురు సంతానం. సర్వీసు మొత్తం ఆదోని సబ్ డివిజన్‌లోనే విధులు నిర్వహించారు. -
నేడు కంగాల్‌షా వలీ ఉరుసు
– తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు – ముగిసిన గంధం కర్నూలు సీక్యాంప్ : తుంగభద్ర నదీ తీరంలో బావాపురంలో కంగాల్‌షా వలీ ఉరుసు బుధవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలిరోజు వేలాది భక్తుల మధ్య భక్తిశ్రద్ధలతో గంధం కార్యక్రమం నిర్వహించారు. గురువారం కిస్తీ, ఖవ్వాలీ నిర్వహించనున్నట్లు పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఖాద్రీ తెలిపారు. వాటిని తిలకించేందుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. -
పోలీస్ వాటర్‌స్పోర్ట్స్ కు ఏర్పాట్లు
► వచ్చే నెల 3 నుంచి 7 వరకు రాష్ట్రస్థాయి పోటీలు ► ఉర్సు చెరువును పరిశీలించిన పోలీస్ అధికారులు కరీమాబాద్ : వరంగల్ ఉర్సు రంగసముద్రం చెరువు వద్ద పోలీస్ వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను ఆదివారం పోలీస్ అధికారులు పరిశీలించారు. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలకు అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని ఉర్సు రంగ సముద్రం చెరువు వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను డీసీపీ వేణుగోపాల్‌రావు, వరంగల్, హన్మకొండ ఏసీపీలు చైతన్యకుమార్, మురళీధర్‌తోపాటు మిల్స్‌కాలనీ సీఐ పుప్పాల తిరుమల్ పరిశీలించి మాట్లాడారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది పోలీస్ క్రీడాకారులు హాజరు కానున్నట్లు చెప్పారు. చెరువు వద్ద అన్ని రకాల ఏర్పాట్లు, సదుపాయాలు కలిగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రవీందర్, రవి, ఏఎస్సై రాజేందర్, పీసీలు రమేష్, శ్రీనివాస్, స్థానిక నాయకులు మేడిది మధుసూదన్, బజ్జూరి వాసు పాల్గొన్నారు. -
మహిమాన్వితుడు..కంగాల్ షా వలీ
- మార్చి 1.2 తేదీల్లో ఉరుసు - ప్రసిద్ధిగాంచిన కిస్తీ వేడుకలు - ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు - తుంగా తీరంలో ఆకట్టుకుంటున్న దర్గా కర్నూలు (ఓల్డ్‌సిటీ): కొలిచిన వారికి కొంగు బంగారం.. హజరత్ కంగాల్‌షా వలీ. ఈయన అసలు పేరు హజరత్ సయ్యద్ ఖుద్రతుల్లాషా ఖాద్రి. ఈ హజరత్ దర్గా పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో కర్నూలుకు పది కిలోమీటర్ల దూరంలో వెలిసింది. మార్చి నెల ఒకటో తేదీ ఉరుసు ప్రారంభం కానుంది. ఉత్సవాల్లో పాల్గొనేందుకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది రానున్నారు. ఈ నేపథ్యంలో హజరత్ దర్గాపై ప్రత్యేక కథనం. హజరత్.. బాగ్దాద్‌కు చెందిన మహెబూబ్ సుభాని (గౌసేపాక్ దస్తగిరి) (ర.అ) 13వ తరం వారసుడు. భారత దేశంలో మొగలులు సామ్రాజ్యం స్థాపించక ముందే హర్యానా రాష్ట్రంలోని సధౌరా ప్రదేశంలో ఈయన స్థిరపడ్డారు. అక్బర్ చక్రవర్తి తల్లి హమీదా స్థాపించిన ఇస్లాం యూనివర్సిటీకి హజరత్ తాత సయ్యద్ అబ్దుల్ ముకరిమ్ ఖాద్రీ వైస్ చాన్స్‌లర్‌గా ఉండేవారు. హజరత్ పూర్వీకులు చదువు, ఆధ్యాత్మిక అంశాల్లో ఆరితేరి ఉండటంతో మొగల్ సామ్రాజ్యంలోని చక్రవర్తులంతా వీరి కుటుంబం వద్ద శిష్యరికం పొందారు. ఔరంగజేబు మరణం తర్వాత రాజరిక పరిస్థితులు అధ్వానంగా మారాయి. ఆతర్వాత హజరత్ కుటుంబం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లింది. షాజహానాబాద్ (ఇప్పటి న్యూఢిల్లీ)లో ఉంటున్న హజరత్ క్రీ.శ. 1725లో కర్నూలుకు వచ్చారు. బావాపురంలో సమాధి.. ప్రస్తుతం బావాపురం గ్రామం..ఒకప్పుడు క్రూరమృగాలు సంచరించే అటవీ ప్రాంతం. హజరత్ స్థిరపడ్డాక అక్కడ నివాసాలు ఏర్పడి గ్రామంగా అవతరించింది. దైవచింతన ద్వారా కుల మతాలకు అతీతంగా భక్తుల సమస్యలు ఆయన పరిష్కరించే వారు. తన ప్రసంగాల ద్వారా శిష్యులను (భక్తులను) సన్మార్గంలో నడిపించే వారు. ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు వినేందుకు ముస్లింలతో పాటు అన్యమతస్తులూ వచ్చే వారు. కర్నూలు నవాబ్ అలాఫ్ ఖాన్–1.. హజరత్ వద్ద శిష్యరికం స్వీకరించారు. గ్రామం చుట్టూ ఉన్న ఐదు ఎస్టేట్ల జాగీరును బహూకరించినా హజరత్ స్వీకరించలేదు. కర్నూలు ప్రజలు హజరత్ వద్దకు వచ్చి విద్య, ఆధ్యాత్మిక విలువలు నేర్చుకునేందుకు వీలుగా నవాబు.. కర్నూలు నుంచి బావాపురానికి రోడ్డు వేయించారు. స్వామి 1766లో సమాధి అయ్యారు. ప్రస్తుతం హజరత్.. ఆరో ముని మనుమడు సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఖాద్రి..ఉరుసు నిర్వహిస్తున్నారు. ఉరుసు చివరి రోజున నిర్వహించే కిస్తీలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సుందరంగా దర్గా.. మొదట సమాధి వరకే నిర్మించిన దర్గాను ఇప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా సుందరంగా తీర్చిదిద్దారు. చుట్టూ నాలుగు స్తంభాలతో తాజ్‌మహల్‌ను పోలి ఉండటం, భారీ ప్రవేశ ద్వారం, మదీనాలోని మస్జిదే నబ్వీని పోలిన ఆస్తానా గుమ్మజ్ కట్టించడంతో భక్తులకు ఇట్టే ఆకట్టుకుంటోంది. హజరత్ దర్గా తుంగభద్ర నదీ తీరంలో ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది. ఆవరణలో పచ్చని చెట్ల నీడ లభిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో కర్నూలు నగర వాసులు దీన్ని విహార స్థలంగా ఎంచుకున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ఈ ప్రాంతం నుంచే ప్రారంభించడం ఆనవాయితీ. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రతిసారి ఎన్నికల ప్రచారాన్ని మొదట దర్గాను దర్శించుకున్న తర్వాతే ప్రారంభిస్తారు. ఇలా చేరుకోవాలి.. హజరత్ కంగాల్‌షా వలీ దర్గాకు చేరుకోవాలంటే కర్నూలు కొత్త బస్టాండులో సుంకేసుల డ్యాం, రాజోలి గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణించాల్సి ఉంది. పాత బస్టాండు నుంచి ఈ మార్గంలో ఆటోలు కూడా ఉంటాయి. భక్తులు బావాపురం దర్గా వద్ద ఏర్పాటు చేసిన స్టేజీలో దిగాల్సి ఉంటుంది. ఒకటి నుంచి ఉరుసు – సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఖాద్రి మార్చి నెల ఒకటో తేదీ నుంచి ఉరుసు ప్రారంభమవుతుంది. ఒకటిన గంధోత్సవం, బాణోత్సవం, రెండో తేదీ సాయంత్రం 4 గంటలకు కిస్తీ, రాత్రి ఖవ్వాలి కార్యక్రమాలు ఉంటాయి. ఉరుసుకు లక్ష మంది వచ్చే అవకాశం ఉంది. ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. -
ఘనంగా ఉరుసు మహోత్సవం
బొమ్మనహాళ్ : మండలంలోని దర్గాహోన్నూరు గ్రామంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రమైన సయ్యద్‌షా ఖాజా, సయ్యద్ షా సూఫి సర్మస్, హుసేన్ చిఫ్తి వారి ఉరుసు మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో ఫాతెషా ఆరాధన చేపట్టారు. అనంతరం స్వామివారికి భక్తులు చక్కెర, బెల్లం, గోధుమలను తులాభారంగా ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. బొమ్మనహాళ్ , కణేకల్ ఎస్ఐలు ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఉచిత వైద్యం, తాగునీరు సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. -
కడపలో దర్గా వార్షిక ఉరుసు ఉత్సవాలు
-
వైభవంగా కడప పెద్దదర్గా గంధోత్సవం
కడప కల్చరల్: ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం కడప అమీన్‌పీర్ (పెద్ద) దర్గా ఉరుసు ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అర్ధరాత్రి దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుస్సేనీ సాహెబ్ తన ఇంటి నుంచి గంధం కలశాన్ని తీసుకుని పకీర్ల మేళతాళాలు, ఖడ్గ విన్యాసాల మధ్య ఊరేగింపుగా దర్గా వద్దకు చేర్చారు. ఏఆర్ రెహమాన్ ప్రార్థనలు: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. తొలుత ఆయన పీఠాధిపతిని కలిసి ఆశీస్సులు పొందారు. -
బాహుబలం
మహానంది (శ్రీశైలం) బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ భారీ శివలింగాన్ని ఎత్తే సీన్ ప్రేక్షకాదరణ పొందింది. అది సినిమా.. నిజ నిజీవితంలో అలాంటి బాహుబలులు అరుదుగా తారసపడతారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో ఆదివారం ఇలాంటి వారు కనిపించారు. సయ్యద్ దస్తగిరిస్వామి ఉరుసు సందర్భంగా ఆదివారం పోటీలు నిర్వహించారు. రాతి గుండు(120 కేజీలు)ను అలవోకగా ఎత్తి శిరివెళ్లకు చెందిన ఉస్మాన్ ప్రథమ స్థానం, కొత్తపల్లె వెంకట లక్ష్మిరెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరికి బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ఇసుక సంచి (105 కేజీలు)ని ఎత్తి హబీబుల్లాఖాన్ విజేతగా నిలిచారు. ఒక టైర్ బండిని లాగే పోటీలు ఆసక్తికరంగా సాగాయి. -
ఘనంగా ఉరుస్ ఉత్సవం
పెద్దాపురం : తొమ్మిది మూరల సాహెబ్ ఉరుస్ ఉత్సవం మత సామరస్యానికి ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక షేక్ హజరత్ పాచ్చా ఔలియా (తొమ్మిది మూరల సాహెబ్) సమాధి వద్ద శుక్రవారం నిర్వహించిన ఉరుస్ (గంధోత్సవాన్ని) ఉత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ముస్లిం పెద్దలు అబ్దుల్ గఫర్‌ఖాన్, ఎండీ లాయక్ అలీ, ఎంఎల్ అలీ నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, మున్సిపల్ చైర్మ¯ŒS రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ పట్టణాభివృద్ధితో పాటు దర్గా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎండీ సతార్ ఇంటి నుంచి గుర్రపు గంధాన్ని ఊరేగింపుగా సమాధి వద్దకు తీసుకు రాగా సాహెబ్ సమాధిపై గంధాన్ని పూసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మిమిక్రీ, మ్యూజికల్ నైట్, ఖవ్వాళి, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మ¯ŒS త్సలికి సత్యభాస్కర్, పరదేశి, బొడ్డు బంగారుబాబు, తూతిక రాజు, విరోధుల రాజేశ్వరరావు, విజ్జపు రాజశేఖర్, బేదంపూడి సత్తిబాబు, బాబూలాల్, రఫీ, జిలానీ, ఇర్షద్ అలీ, ఆరీఫ్ ఆలీ పాల్గొన్నారు. -
ఏఎస్‌పేట దర్గాలో భక్తుల సందడి
అనుమసముద్రంపేట : ఏఎస్‌పేటలో జరుగుతున్న శ్రీహజ్రత్ ఉరుసు గంధోత్సవాలు తిలకించేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీహజ్రత్, అమ్మాజీలపై సమాధులపై గలేఫులు, పూలదుప్పట్లు కప్పారు. ఫకీరుల డప్పు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. వేలాదిమంది మహిళలు గంధం దంచేందుకు బారులు తీరారు. -
ఆదోని పిలిప్స్ జట్టు విజయకేతనం
- ఎల్లార్తిలో ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు - విజేత జట్లకు నగదు బహుమతులు ప్రదానం హొళగుంద: ఎల్లార్తి షేక్షావలి, షాషావలి ఉరుసును పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఎస్ఎస్వి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటిల్లో ఆదోని పిలిప్స్ జట్టు విజేతగా నిలిచింది. దర్గా పీఠాధిపతి, ముతవల్లి డాక్టర్ సయ్యద్ షేక్ తాజుద్దిన్ అహమ్మద్ ఖాద్రి ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి పోటీలు నిర్వహిస్త్నునారు. ఆదివారం ఆదోని-గంగావతి జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఆదోని పిలిప్స్ జట్టుకు రూ. 20 వేల నగదును బళ్లారి జిల్లాకు చెందిన సూగప్ప అందించారు. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా మంత్రాలయం మఠానికి చెందిన వీరేంద్రాచారి, మారుతిబాలు రూ. 15వేలు, రూ.10 వేలు ప్రకారం అందించారు. ఆలూరు సీఐ శంకరయ్య, ఎస్ఐ మారుతి, ఎల్లార్తి దర్గా పీఠాధిపతి డాక్టర్ సయ్యద్ షేక్ తాజుద్దిన్ అహమ్మద్ ఖాద్రి చేతుల మీదుగా బహుమతులు అందించారు. -
ఖాకార్షా కొలువు మహిమలకు నెలవు
కులమతాలకు అతీతంగా భక్తుల పూజలు నేటి నుంచి ఉరుస్ ఉత్సవాలు నగరంలో అతిపురాతనమైన దర్గా కులమతాలకు అతీతంగా ప్రజల పూజలందుకుంటున్న సయ్యద్‌షా ఖాకార్షా ఖాదరీ ఔలియా దర్గా ఉరుస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 7న ఖురాన్, 8న గంథోత్సవం, 9న మిలాద్ ఉన్నబి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అతిపురాతనమైన దర్గా గురించి... – రాజమహేంద్రవరం కల్చరల్ మహా ప్రవక్త హజ్రత్ మహ్మద్ ఆదేశాల మేరకు, ఇస్లాం పరిరక్షణ కోసం సయ్యద్‌షా ఖాకార్షా ఖాదరీ ఔలియా గోదావరీ తీరానికి బాగ్దాద్ నుంచి తరలి వచ్చారు. రాజరాజనరేంద్రుని కాలం కన్నా ముందే, క్రీ.శ. 850–950 మధ్యకాలంలో ఆయన ఈ ప్రాంతాతానికి వచ్చి, ఇక్కడ జీవించారు. బాబాలకు గురుబ్రహ్మ అయిన పిరానీ ఫీర్ దస్తగిర్ గౌస్ అజంకు ఈయన నాల్గవ తరానికి చెందిన వ్యక్తి. రైల్వేస్టేషన్ సమీపంలో... రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేçÙనుకు సమీపంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల పక్కనే ఉన్న హజ్రత్ ఖాకార్షా ఖాదరీ ఔలియా దర్గాను నిత్యం భక్తులు సందర్శిస్తుంటారు. అప్పట్లో ఈ ప్రాంతంలో ఒక చింతచెట్టు ఉండేది. నిత్యం దైవారాధనలో కాలం గడిపే ఖాకార్షా తన జీవిత కాలంలో అనేక మహిమలు చూపారని నేటికీ భక్తులు చెబుతుంటారు. ఎన్నో మహిమలు ఖాకార్షా చిన్నగా దగ్గితే, ఆ శబ్దం సుమారు నాలుగయిదు కిలోమీటర్ల దూరం వినిపించేదట. దీంతో ఆ శబ్దం విన్న దుష్టశక్తులు పారిపోయేవట. ఆయన తన శిషు్యడు ఫనా ఫిల్లాషాను జీవసమాధి చేసి, మూడు రోజుల తరువాత సజీవంగా బయటకు తీసుకువచ్చారని చెబుతారు. ఖాకార్షా ధ్యానంలో ఉండగా ఒక పులి వచ్చి, ఆయన ఎదుటనే కూర్చునేదని, పాము పడగ విప్పి ఆయన సన్నిధిలో ఉండేదని భక్తులు చెబుతారు. క్రూరజంతువులు తమ స్వభావాలను విడిచి, సాధుజంతువులుగా మసలేవని చెబుతారు. నేటికీ ఓ పాములపుట్ట దర్గా ప్రాంగణంలో ఉంది. చిన్నపిల్లలంటే ఖాకార్షాకు ప్రాణం. తన వద్ద ఉన్న కమండలం వంటి పాత్ర నుంచి బిర్యానీ తీసి పిల్లలకు తినిపించేవారట. గోదావరి నది ఒడ్డున (నేటి గౌతమిఘాట్ ప్రాంతంలో) ఆయన కొబ్బరి చిప్పలోకి నదీ జలాలను తీసుకుని, తన కంబళి నుంచి దారపు పోగులను తీసి ఒత్తిగా చేసి అందులో ఉంచి దీపాలను వెలిగించేవారట. అనారోగ్యానికి గురయిన భక్తులకు ఆయన కలలో కనబడి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంటారని చెబుతారు. సంతానం లేనివారు, శారీక, మానసిక బాధలతో ఉన్నవారు దర్గాను దర్శిస్తే స్వస్థత పొందుతామని భక్తుల విశ్వాసం. కులమతాలకు అతీతంగా నిత్యం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. భగవంతుడిని ఆరాధించాలి ప్రతి ఒక్కరూ భగవంతుని ఆరాధనలో జీవితం గడపాలని, మంచి ప్రవర్తనను అలవర్చుకోవాలని ఖాకార్షా జ్ఞానబోధ చేసేవారుట. ఆయన దర్గా సమీపంలోనే ఆయన సోదరి బషీర్ ఫాతిమా అమ్మాజాన్ దర్గా ఉంది. ఈ ప్రాంగణంలోనే గౌస్ అజం (బాగ్దాద్), గరీబ్ నవాజ్ (అజ్మీర్), కొత్తలంక బాబా, తాజుద్దీన్ (నాగపూర్), కరీముల్లాషా ఖాదరీ తదితర ఔలియాల జెండాలు ఉన్నాయి. -
ఘనంగా గూటుపల్లె ఉరుసు
భక్తిశ్రద్ధలతో పెద్దరాజు స్వామికి గంధం సమర్పణ -వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు - ఆకట్టుకున్న ఫక్కిర్ల సాహస కృత్యాలు గూటుపల్లె (బేతంచెర్ల) : మండల పరిధిలోని గూటుపల్లె గ్రామంలో వెలసిన హజరత్ సయ్యద్‌షా అబ్దుల్ రహమాన్ ఇద్రూస్‌బాష (పెద్దరాజు స్వామి) ఉరుసు ఘనంగా జరిగింది. ఆదివారం తెల్లవారుజామున అశేష భక్తజనం మధ్య గ్రామ పురవీధుల గుండా గంధం ఊరేగింపు నిర్వహించారు. దర్గా పీఠాధిపతి గురు సయ్యద్ అక్బర్‌బాష ఖాద్రి , ఉప పీఠాధిపతి ఇద్రూస్‌బాష ఖాద్రి ఆధ్వర్యంలో దర్గాలో ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా దర్గా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. గగ్గురుపొడిచిన సాహస కృత్యాలు ఉరుసు సందర్భంగా గోవా, ముంబాయి, మహారాష్ట్ర , కర్ణాటక, బెల్గం, బీజాపూర్ ప్రాంతాల నుంచి వచ్చిన ఫక్కిర్లు చేసిన సాహస కృత్యాలు ఔరా అనిపించాయి. ఇనుపచువ్వలు, కడ్డీలను గొంతు, నాలుక, ముఖం, తలపై పొడుచుకునే దృశ్యాలు గగ్గురుపొడిచాయి. కోవెలకుంట్లకు చెందిన ఇనాం దారులు నాట్యం చేసి పలువురి మన్ననలు అందుకున్నారు. బేతంచెర్ల సీఐ సుబ్రమణ్యం , ఎస్ఐ తిరుపాలు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. -
గూటుపల్లెలో మతసామరస్య పరిమళం
- 26 నుంచి ఉరుసు - హాజరుకానున్న మహారాష్ట్ర, గోవా, కర్ణాటక భక్తులు గూటుపల్లె (బేతంచెర్ల): ఇద్రూస్‌బాషా ఉరఫ్ పెద్దరాజుల స్వామి ఉరుసుకు బేతంచెర్ల మండలం గూటుపల్లె గ్రామం సిద్ధమైంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఉరుసును.. ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు రాష్ట్రంలోని భక్తులే కాకుండా మహారాష్ట్ర, గోవా, కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాది మంది రానున్నారు. ఇదీ చరిత్ర.. పెద్దరాజుల స్వామి.. 600 సంవత్సరాల క్రితం సౌది అరేబియా దేశంలోని జిద్దా సమీపంలో గల అదన్ పట్టణంలో సయ్యద్ అబూబకర్ సుభాన్ ఇద్రూస్ వలి మక్కికు జేష్ట పుత్రుడుగా జన్మించారు. లోక కళ్యాణార్థం తొమ్మిదేళ్ల వయస్సులోనే తన తల్లిదండ్రులను వదిలిపెట్టి భారతదేశానికి వచ్చారు. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో కొన్ని సంవత్సరాలు నివాసం ఉండి అనంతరం ఆదోని పట్టణానికి వచ్చారు. ఇద్రూస్బాషాకు ముగ్గురు భార్యలు. వీరిలో ఇద్దరు భార్యలకు సంతానం లేదు. మొదటి భార్యకు ముగ్గురు సంతానం కాగా వారిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. నాడు ఖుదాపల్లె.. ఆదోని నుంచి గూటుపల్లెకు వచ్చిన స్వామికి.. యాదవులు ఆవులు, గొర్రెలు మేపుతూ కనిపించారు. పెద్దరాజుస్వామి కుమార్తె ఫాతిమా ఉదయాన్నే మిస్వాక్ పుల్లను వజూ చేసిన స్థలంలో ఉంచి నాలుగు రకాలుగా నమాజు చేసిన తర్వాత పుల్ల మొక్కగా మారింది. దీంతో స్వామి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామానికి ఖుదాపల్లె అని నామకరణం చేశారు. కాలక్రమేణ అది గూటుపల్లెగా మారింది. స్వామివారి రెండో కుమారుడు సయ్యద్‌హుస్సేన్ షాబాషా 12వ ఏటనే ఆదోని పట్టణంలో జీవసమాధి అయ్యారు. స్వామివారి మహిమలు .. ఇద్రుస్ బాషా..గూటుపల్లెలో స్థిర నివాసం ఏర్పరచుకున్న తరువాత గొర్రెల కాపరుల భయం పోగొట్టేందుకు పులులను కొండ తీగలతో కట్టి తీసుకొచ్చారు. దీంతో స్వామికి పెద్దరాజు అని పేరు వచ్చింది. స్వామి రెండో కుమారుడు హుస్సేన్ షా బాష.. మొండి గోడను నడిపించారని ప్రతీతి. ప్రతి గురువారం పెద్ద పులి వచ్చి తనతోకతో దర్గాను శుభ్రం చేస్తుందని భక్తుల నమ్మకం. దర్గా ఆవరణలో దయ్యం, భూతం, పిశాచి పీడలు ఉన్న వారు..ఒక్క రోజు నిద్ర చేస్తే తొలిగిపోతాయనే విశ్వాసం ఉంది. గూటుపల్లెను సందర్శించిన ఔరంగజేబు.. మొఘల్ సామ్రాజ్య పతనానికి కారకుడైన ఔరంగజేబు.. 1681లో గూటుపల్లె గ్రామాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కాలంలోనే ఔరంగజేబు.. పెద్దరాజస్వామికి వేలాది ఎకరాలు ఇనాంగా ఇచ్చినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. దర్గా పీఠాధిపతిగా అక్బర్ బాషా ఖాద్రీ ఎంతో చారిత్మ్రాకమైన ఇద్రూసాబాష దర్గాకు నేటికి 13 మంది పీఠాధిపతులుగా వ్యవహరించారు. గత 6 సంవత్సరాల క్రితం 12వ పీఠాధిపతి అయిన సయ్యద్ హఖాని బాషా ఆకాల మరణంతో వంశ పారంపర్యంగా పీఠాధిపతిగా అతని కుమారుడైన సయ్యద్ అక్బర్ బాష ఖాద్రీ ఆరు సంవత్సరాల వయస్సుల్లో బాధ్యతలు చేపట్టారు. విశేషమేమిటంటే గూటుపల్లె పీఠంతో పాటు భారత దేశంలోని 90 పీఠాలకు ఈ బాలుడు పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. -
అక్కడి ఉర్సులో పాకిస్థానీలకు నో ఎంట్రీ!
భారత్ - పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. ప్రతియేటా బరేలీలోని దర్గా ఆలా హజ్రత్‌లో జరిగే ఉర్సు ఉత్సవాలకు ఈసారి పాకిస్థానీ మతపెద్దలను అనుమతించకూడదని నిర్ణయించుకున్నారు. ఈనెల 24 నుంచి ఇక్కడ వార్షిక ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి ఇక్కడకు వస్తామని ఆరుగురు పాకిస్థానీ మత గురువులు లేఖలు రాసినా, వాళ్లలో ఎవరికీ అనుమతి లేఖలు పంపకూడదని నిర్ణయించుకున్నారు. గత సంవత్సరం ఆ దేశం నుంచి 12 మందిని ఆహ్వానిస్తూ దర్గా యాజమాన్యం లేఖలు పంపింనా, వాళ్లలో ఐదుగురే వచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాలకు తాము సైతం నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ఇస్లామాబాద్‌కు తెలియజేయాలనే అనుకుంటున్నామని, అందుకే ఈసారి పాకిస్థానీ మతపెద్దలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని దర్గా ప్రతినిధి ముఫ్తీ మహ్మద్ సలీం నూరీ చెప్పారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం వరకు ఇక్కడి ఉర్సుకు ప్రతియేటా వందలాది మంది పాకిస్థానీలు వచ్చేవారని, కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత ఈ సంఖ్య బాగా తగ్గింది. ఉగ్రవాద దాడులు జరిగినప్పుడల్లా భారతీయ ముస్లింలు చాలా బాధపడుతున్నారని, వాళ్లను అంతా అనుమానితులుగా చూస్తున్నారని నూరీ అన్నారు. ఇరు దేశాల సంబంధాలు చెడిపోవడంతో రెండు దేశాల్లోని సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఉగ్రవాదం ఎక్కడున్నా ఖండించాల్సిందేనని.. శాంతి సందేశాన్ని ప్రజలకు పంచాలని చెప్పారు. ఇక్కడ ఉర్సు ఉత్సవాలకు ఫ్రాన్స్, దుబాయ్, మారిషస్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, ఒమన్.. ఇలా చాలా దేశాల నుంచి మత పెద్దలు వస్తుంటారని, మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో అంతా పాల్గొంటారని.. వాళ్లందరినీ కూడా ఉగ్రవాదాన్ని ఖండించాల్సిందిగా కోరుతామని ఆయన వివరించారు. -
హోరెత్తిన మస్తానయ్య నామస్మరణ
గుంతకల్లు : పట్టణంలోని పాతగుంతకల్లు ఏరియా మస్తానయ్య నామస్మరణతో హోరెత్తింది. పాతగుంతకల్లులో వెలసిన హజరత్ మస్తాన్‌వలి 381వ ఉరుసు ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టం షంషీర్ ఊరేగింపు శుక్రవారం వైభవంగా సాగింది. ఆనవాయితీలో భాగంగా స్వామి వారి పూలరథాన్ని (షంషీర్)లాగే గుర్రాన్ని నాగసముద్రం నుంచి ఈడిగ వంశస్తులు గురువారం సాయంత్రం తీసుకొచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున షంషీర్‌ను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఊరేగింపుగా దర్గా నుంచి గణచారి రెడ్డి కులస్తుల ఇంటికి చేరుకుంది. సాజెదినాసేన్ (పూజారులు) ప్రత్యేక ప్రార్థనలు చేసి, అక్కడి నుంచి పట్టణంలోని పక్కీర్లవీధి, కుమ్మరకట్టవీధి, కచేరికట్ట, ఊరి వాకిలి మీదుగా దర్గాకు తిరిగి చేరుకుంది. అశేష భక్త జనంతో దర్గా పరిసరాలన్నీ పోటెత్తాయి. స్వామి వారి ఊరేగింపులో ఎండు కొబ్బరి కాల్పించడానికి భక్తులు ఎగబడ్డారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా పాతగుంతకల్లులోని ప్రతి ఇల్లూ బంధు మిత్రులతో కిటకిటలాడింది. -
మతసామరస్యానికి ప్రతీక మస్తానయ్య ఉరుసు
రేపటి నుంచి ఉత్సవాలు గుంతకల్లు: పట్టణంలోని పాతగుంతకల్లులో వెలసిన హజరత్ సయ్యద్షాఅలీ అక్బర్ ఉరుఫ్ హజరత్ మస్తాన్‌వలి ఉరుసు హిందూముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మస్తాన్‌వలి దర్గా 381వ ఉరుసు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఏటా మొహర్రం పండుగ తర్వాత 15 రోజులకు ఉరుసు ప్రారంభిస్తారు. ఉత్సవాలకు దర్గా కమిటీ సభ్యులు, నిర్వాహకులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. దర్గాకు రంగులు అద్దుతున్నారు. దర్గా ఆవరణంలో పలు రకాల బొమ్మల, మిఠాయి అంగళ్లు వెలిశాయి. మహోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు మస్తాన్‌వలి దర్గా కమిటీ సభ్యులు, నిర్వాహకులు. అందులో భాగంగానే దర్గాకు రంగులు దిద్దుతున్నారు. దర్గా ఆవరణంలో పలు రకాల బొమ్మల, మిఠాయి అంగళ్లు వెలిశాయి. ఈ నెల 26న స్వామివారి గంధం ఊరేగింపు, 27న రాత్రి షంషీర్ (ఉరుసు) జరుగుతుందన్నారు. 28న జియారత్ కార్యక్రమంతో ఉరుసు ముగుస్తుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా తదితర ప్రాంతాలతోపాటు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు ఉత్సవాలకు హాజరవుతారు. ఉరుసు రోజున స్వామి వారి దివిటీల్లో ఎండు కొబ్బరిని కాల్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. -
వైభవంగా అలంపూర్ ఉర్సు
అలంపూర్/అలంపూర్‌రూరల్: షా–అలీ–పహిల్వాన్ ఉర్సు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉర్సు రెండవ రోజు సర్ ముభార్ దర్గాలో శుక్రవారం చిన్న కిస్తి పోటీలు జరిగాయి. మొక్కులు తీర్చుకోనే వారు కిస్తిల్లో పలావ్, మిఠాయిలను వేయగా అక్కడే ఉన్న పహిల్వాన్లు వాటిని వీక్షకులపై విసిరారు. సరదగా సాగిన ఈ కిస్తి పోటీలను వీక్షించడానికి చట్టు పక్కల గ్రామాలు, సూదూర ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చారు. ఉర్సు సందర్భంగా ప్రధాన వీధుల్లో దుకాణాలు, రంగల రట్నాలు వెలిశాయి. ఉర్సు మూడవ రోజు ధడ్ ముభారక్ దర్గాలో పెద్ద కిస్తి పోటీలు జరగనున్నాయి. -
ఘనంగా చిన్న ‘కిస్తీ’ పోటీలు
అలంపూర్/అలంపూర్‌రూరల్: అలంపూర్ షా–అలీ–పహిల్వాన్ ఉర్సు కనులపండవగా సాగుతున్నాయి. రెండోరోజు షా–అలీ–పహిల్వాన్ సర్ ముబారక్ దర్గాలో శుక్రవారం చిన్న కిస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు. యువకులు పోటీ పడి వివిధ విన్యాసాలు చేస్తూ కిస్తీలో పాల్గొన్నారు. ఉర్సును పురస్కరించుకుని కులమతాలకతీతంగా జనం తరలివచ్చి సర్ ముబారక్, ధడ్ ముబారక్ దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి కిస్తీ పొలావు, మిఠాయిలు వేయగా, అక్కడే ఉన్న పహిల్వాన్లు పోటీ పడి వాటిని వీక్షకులపైకి విసిరారు. ఈ క్రమంలో పోటీకి దిగిన పహిల్వాన్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సర సరదగా సాగిన ఈ పోటీలను వీక్షించడానికి భారీగా జనం తరలివచ్చారు. నేడు పెద్ద కిస్తీలు మూడో రోజు షా–అలీ–పహిల్వాన్ ధడ్ ముబారక్ దర్గా వద్ద ఉర్సులో ప్రధాన ఘట్టం పెద్దకిస్తీలు శనివారం నిర్వహిస్తారు. దీనికి జనం తాకిడి అధికంగా ఉంటుందని వారికి కావాల్సిన సౌకర్యాలపై కల్పించడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్‌లు సైతం గట్టి బందోబస్తు నిర్వహించనున్నారు. -
నేటినుంచి షా–అలీ–పహిల్వాన్ ఉర్సు
26న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీలు 27న ధడ్ ముబారక్ దర్గాలో పెద్ద కిస్తీలు అలంపూర్: మత సామరస్యానికి ప్రతీకగా జరిగే అలంపూర్ షా–అలీ–పహిల్వాన్ ఉర్సు గురువారం నుంచి ప్రారంభమవుతుందని దర్గా అభివృద్ధి కమిటీ చైర్మన్ రుక్ముద్దీన్, ఉపాధ్యక్షుడు షఫీ అహ్మద్, మోక్తార్ బాషా, ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ముజీబ్, కార్యదర్శులు ఎండీ జాఫర్, ఖాసీమ్ మియ్య తెలిపారు. సయ్యద్ ఖాదర్ వలి సాహెబ్ కుమారుడు దర్గా చైర్మన్ సయ్యద్ షా అహ్మద్ ఒవైసీ ఖాద్రి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి 28 వరకు ఉర్సు జరగనున్నట్లు పేర్కొన్నారు. కులమతాలకతీతంగా జరిగే ఈ ఉత్సవాలకు వేలాది మంది జనం తరలిరావడంతో వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 4రోజుల పాటు ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి 28వరకు ఉర్సు జరగనుంది. 25వ తేదీ రాత్రి గంధోత్సవం ఉంటుంది. సయ్యద్ ఖాదర్ వలి సాహెబ్ ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి గంధం తీసుకెళ్తారు. అక్కడి నుంచి సర్ ముబారక్, ధడ్ ముబారక్ దర్గాలలో గంధోత్సవం నిర్వహించనున్నారు. 26న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తీలు జరగనున్నాయి. 27న ధడ్ ముబారక్ దర్గా వద్ద పెద్ద కిస్తీలు నిర్వహించనున్నారు. పెద్ద కిస్తీ పోటీలను వీక్షించడానికి వేలాదిమంది జనం తరలి రానున్నారు. 28న మహిళల ప్రత్యేక ఉర్సుతో ఉత్సవాలు ముగుస్తాయి. దూర ప్రాంతాల నుంచి భక్తుల రాక షా–అలీ–పహిల్వాన్ ఉర్సుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటుగా జిల్లాలోని ప్రముఖ పట్టణాలు, కర్నూలు, కర్ణాటకలోని రాయచూరు నుంచి తరలిరానున్నారు. ఉత్సవాల్లో పెద్ద కిస్తీ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. -
25 నుంచి షా–అలీ–పహిల్వాన్ ఉర్సు
– ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత అలంపూర్ : ఈ నెల 25వ తేది నుంచి షా–అలీ–పహిల్వాన్ ఉర్సు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కులమతాలకు అతీతంగా ప్రతి ఏడాది నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు దర్గా అభివద్ధి కమిటీ సభ్యులు చైర్మన్ సయ్యద్ షా అహ్మద్ ఒవైసీ ఖాద్రి, కమిటీ అధ్యక్షుడు ఖ్వాజ రుక్ముద్దిన్, ఉపాధ్యాక్షులు షఫీ అహ్మద్, ముక్తార్ బాష, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ముజీబ్, కార్యదర్శులు ఎండీ జాఫర్, ఖాసీమ్ మియ్యలు ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను కలిసి ఉర్సు ఉత్సవాలకు వసతులు కల్పించాలని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ జయరాముడుకు సైతం ఉర్సు ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ నెల 25వ తేదిన షా–అలీ–పహిల్వాన్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా గంధోత్సవం ఉంటుందని వారు పేర్కొన్నారు. 26వ తేదిన సర్ ముభార్ దర్గాలో చిన్న కిస్తీలు, 27వ తేది ధడ్ ముబారక్ దర్గాలో పెద్ద కిస్తీలు, 28వ తేది మహిళల ప్రత్యేక ఉర్సుతో ఉత్సవాలు ముగియనున్నట్లు వారు పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా భక్తులు తరలి రానుండటంతో అందుకు తగ్గట్టుగా వసతులు కల్పించాలని తహసీల్దార్ మంజులను కలిసి విన్నవించారు.