పోలీస్‌ వాటర్‌స్పోర్ట్స్ కు ఏర్పాట్లు | Police water sports | Sakshi
Sakshi News home page

పోలీస్‌ వాటర్‌స్పోర్ట్స్ కు ఏర్పాట్లు

Published Mon, Feb 27 2017 10:33 PM | Last Updated on Fri, Aug 24 2018 6:44 PM

పోలీస్‌ వాటర్‌స్పోర్ట్స్ కు ఏర్పాట్లు - Sakshi

పోలీస్‌ వాటర్‌స్పోర్ట్స్ కు ఏర్పాట్లు

► వచ్చే నెల 3 నుంచి 7 వరకు రాష్ట్రస్థాయి పోటీలు
► ఉర్సు చెరువును పరిశీలించిన పోలీస్‌ అధికారులు


కరీమాబాద్‌ : వరంగల్‌ ఉర్సు రంగసముద్రం చెరువు వద్ద పోలీస్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను ఆదివారం పోలీస్‌ అధికారులు పరిశీలించారు. మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ క్రీడా పోటీలకు అండర్‌ రైల్వేగేట్‌ ప్రాంతంలోని ఉర్సు రంగ సముద్రం చెరువు వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను డీసీపీ వేణుగోపాల్‌రావు, వరంగల్, హన్మకొండ ఏసీపీలు చైతన్యకుమార్, మురళీధర్‌తోపాటు మిల్స్‌కాలనీ సీఐ పుప్పాల తిరుమల్‌ పరిశీలించి మాట్లాడారు.

ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి మంది పోలీస్‌ క్రీడాకారులు హాజరు కానున్నట్లు చెప్పారు. చెరువు వద్ద అన్ని రకాల ఏర్పాట్లు, సదుపాయాలు కలిగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు రవీందర్, రవి, ఏఎస్సై రాజేందర్, పీసీలు రమేష్, శ్రీనివాస్, స్థానిక నాయకులు మేడిది మధుసూదన్, బజ్జూరి వాసు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement