ఆఫ్ఘాన్లో 22 మంది తీవ్రవాదుల హతం | 22 Afghan militants killed in joint military operations | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘాన్లో 22 మంది తీవ్రవాదుల హతం

Published Sun, Oct 20 2013 1:32 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

22 Afghan militants killed in joint military operations

దేశంలో తీవ్రవాదుల ఏరివేత లక్ష్యంగా గత 24గంటల కాలవ్యవధిలో నిర్వహించిన ఆపరేషన్లో 22 మంది తాలిబాన్ తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆఫ్ఘానిస్థాన్ హోం మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.ఆ ఆపరేషన్లో మిలటరీ సంకీర్ణ దళాలు,నాటో దళాలు సంయుక్తంగా పాల్గొన్నాయని వివరించింది.

 

కందహార్, గజనీ, హెరత్, ఉర్జగన్ తదితర ప్రావెన్స్లో ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపింది.అంతేకాకుండా ఆయుధాలను,పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఆ దాడుల్లో పాల్గొన్న వారిలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement