Kandahar
-
ఆఫ్గానిస్తాన్ పేలుడు.. 47కు చేరిన మృతుల సంఖ్య
కాబూల్:ఆఫ్గానిస్తాన్‌లోని కాందహార్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం మసీదులో ప్రార్థనలు చేస్తున్న షియాలే లక్ష్యంగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పేలుడు ఘటనపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ స్పందిస్తూ.. దాడికి తామే బాధ్యులమని పేర్కొంది. -
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు, 32 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో కాందహార్‌లోని షియా మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 32 మంది మరణించగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షియాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
20 ఏళ్ల తర్వాత అఫ్గన్‌కు: కాబోయే అధ్యక్షుడు.. ఎవరీ అబ్దుల్ ఘనీ?!
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఓవైపు అఫ్గన్ ప్రజల నిరసన జ్వాలలు కొనసాగుతున్నప్పటికీ లెక్కచేయక అధికారం చేపట్టేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక తాలిబన్లు అఫ్గన్‌ను హస్తగతం చేసుకున్న వెంటనే అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ అఫ్గనిస్తాన్‌కు కాబోయే తదుపరి అధ్యక్షుడు అనే వార్తలు వెలువడుతున్నాయి. 2001లో తాలిబన్ నాయకత్వం నుంచి తొలగించబడి, దేశం విడిచి వెళ్లిపోయిన అబ్దుల్ మళ్లీ మంగళవారం కాందహార్‌లో అడుగుపెట్టారు. ఒకప్పుడు తాలిబన్ లీడర్‌గా ఓ వెలుగు వెలిగిన అబ్దుల్ ఎందుకు అఫ్గన్‌ను వీడాల్సి వచ్చింది? పాకిస్తాన్లో అరెస్టై, సుమారు 8 ఏళ్ల పాటు నిర్బంధ జీవితం గడిపిన ఆయన ఎవరి చొరవతో బయటపడ్డారు? వంటి ఆసక్తికర వివరాలు మీకోసం.. ►అఫ్గనిస్తాన్‌లోని ఉరుజ్గాన్ ప్రావిన్స్‌లో 1968లో అబ్దుల్ ఘనీ బరాదర్ జన్మించారు. 1980లో సోవియట్ సేనలకు వ్యతిరేకంగా అఫ్గన్ ముజాహిదీన్ తరఫున పోరాడారు. ►1989లో సోవియట్ సేనలు దేశాన్ని వీడిన తర్వాత మహ్మద్ ఒమర్‌తో కలిసి కాందహార్‌లో మదర్సాను స్థాపించిన అబ్దుల్ ఘనీ.. 1994లో తాలిబన్ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలో 1996లో తాలిబన్ అధికారం చేపట్టింది. కాగా తాలిబన్ ఉద్యమ సహచరులుగా ఉన్న అబ్దుల్- ఒమర్ ఆ తర్వాత బంధువులుగా మారారు. ఒమర్ సోదరిని అబ్దుల్ పెళ్లి చేసుకున్నారు. ►తాలిబన్ పాలనలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అబ్దుల్.. న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత అఫ్గన్ పరిస్థితులపై అమెరికా జోక్యంతో దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా అప్పటి తాలిబన్ల ప్రభుత్వాన్ని కేవలం పాకిస్తాన్, సౌదీ అరేబియా, యూఏఈ మాత్రమే గుర్తించిన విషయం తెలిసిందే. ►అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2010లో పాకిస్తాన్‌లోని కరాచీలో అబ్దుల్ అరెస్టయ్యారు. అనంతరం ఆయనను దోహా(ఖతార్)కు తరలించారు. ►ఖతార్‌లో ఉన్న సమయంలో అబ్దుల్ అమెరికా, అఫ్గన్ శాంతిదూతలతో చర్చల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అమెరికా తరఫున ఆ సమావేశాలకు హాజరైన జల్మే ఖలిజాద్ అబ్దుల్ నమ్మదగ్గ వ్యక్తి అని, అఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకై కృషి చేస్తున్నారని ట్రంప్ ప్రభుత్వానికి తెలిపారు. ఈ నేపథ్యంలో 2018లో నిర్బంధ జీవితం నుంచి అబ్దుల్‌కు విముక్తి లభించింది. ►ఈ క్రమంలో 2020లో అమెరికాతో తాలిబన్లకు కుదిరిన చారిత్రాత్మక దోహా ఒప్పందంపై అబ్దుల్ సంతకం చేశారు. ఈ సందర్భంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకై అబ్దుల్‌తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ►అదే విధంగా.. తాలిబన్లను అఫ్గన్ సైన్యంగా, రాజకీయ శక్తిగా గుర్తించిన చైనా ఆహ్వానం మేరకు తొమ్మిది మంది తాలిబన్ నేతల బృందంతో కలిసి అబ్దుల్ 2021లో డ్రాగన్ దేశంతో చర్చలు జరిపారు. ►ఇక అమెరికా సేనల ఉపసంహరణ తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తాలిబన్లు ఆదివారం అఫ్గన్‌ను ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో అబ్దుల్ వారిని ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు. ‘‘తాలిబన్ ఫైటర్లూ.. మున్ముందు అసలైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సాధించాల్సి ఎంతో ఉంది’’ అని పేర్కొన్నారు. ►అంతేగాక, ఆదివారమే ఖతార్ నుంచి అఫ్గన్ చేరుకున్న అబ్దుల్.. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపించాయి. అయితే, తాలిబన్ ప్రతినిధులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపడేశారు. ఆ సమయంలో అబ్దుల్ ఖతార్‌లోనే ఉన్నారని స్పష్టం చేశారు. -వెబ్‌డెస్క్ చదవండి: Afghanistan: జెండా ఎగరేసిన నిరసనకారులు, కాల్పుల మోత Afghanistan: ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు.. కీలక భేటీ! -
తాలిబన్ల ఆధీనంలోకి కాందహార్
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఇటీవల అఫ్గాన్ భూభాగాలను మెరుపువేగంతో తన అధీనంలోకి తెచ్చుకుంటున్న తాలిబన్ సేనలు తాజాగా రెండో అతిపెద్ద నగరమైన కందహార్‌ను స్వాధీనం చేసుకున్నట్టు శుక్రవారం ప్రకటించాయి. ముజాహిదీన్ నగరంలోని అమరవీరుల స్క్వేర్‌కు చేరుకున్నామని తాలిబాన్ ప్రతినిధి ట్వీట్ చేసారు. అలాగే గవర్నర్ కార్యాలయం, ఇతర భవనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది. దీంతో దక్షిణ నగరం వెలుపల సైనిక కేంద్రంనుంచి ప్రభుత్వ బలగాలను మూకుమ్మడిగా ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హింసను పక్కనబెడితే తాలిబన్లతో అధికారం పంచుకునేందుకు సిద్ధమని అఫ్గాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రతిపాదనపై తాలిబన్ల ప్రతిస్పందన కోసం వేచిచూస్తోంది. కాగా దీనిపై తాలిబన్లు అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అఫ్ఘానిస్థాన్ భూభాగాల నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన నాటి నుంచి తాలిబన్లు ఇప్పటికే కీలక భూభాగాలను ఆక్రమించారు. కాబూల్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడో అదిపెద్ద నగరమైన గజ్నీ పట్టణాన్ని గురువారం హస్తగతం చేసుకున్న తాలిబన్లు తాజాగా కందహార్ పట్టణాన్ని సైతం పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. గత వారంలో అప్గాన్‌లోని 34ప్రావిన్షియల్ రాజధానుల్లో సుమారు11 ప్రాంతాలు తాలిబన్లు వశం చేసుకున్నారు. ఇపుడిక ఈ జాబితాలో తాలిబన్ల బలమైన స్థావరం కాందహార్ 12 వ స్థానంలో నిలిచింది. #BreakingNews Ghazni Governor Mohammad Daud Laghmani was safely evacuated by Taliban & sent to Syedabad District, Wardak Province. Governor had agreed with Taliban that if they surrendered the city, they would be allowed to go to Kabul with the police chief. #Talibans #Afghan pic.twitter.com/pskQDaJWzY — PNews360.com (@pnews360) August 12, 2021 Taliban in the palace of the Nimroz governor & See Mal_E_Ganimat.#Taliban#Talibans#Afghanistan #Afganistan #NamakHaram Tribute to Mujahideen pic.twitter.com/o8f1GvBssy — چاچا افلاطون (@chflato) August 12, 2021 -
Danish Siddiqui: ఫొటోజర్నలిస్ట్ హత్యలో చేదు నిజాలు
ఇండియన్ ఫొటోజర్నలిస్ట్, పులిట్జర్ గ్రహీత డానిష్ సిద్ధిఖీ(38) మరణం.. జర్నలిస్ట్ ప్రపంచంలో విషాదం నింపిన విషయం తెలిసిందే. కాందహార్ స్పిన్ బోల్దక్ వద్ద అఫ్ఘన్ సైన్యం-తాలిబన్ల మధ్య పోరును కవరేజ్ చేసే టైంలో ఆయన మరణించారు. అయితే ఆయన సాధారణ కాల్పుల్లో మరణించలేదని, తాలిబన్ల చేతుల్లో క్రూరంగా హత్యకు గురయ్యాడని ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. న్యూయార్క్: ఇండియన్ ఫొటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ తాలిబన్ల కాల్పుల్లో చనిపోయాడని అఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమ ప్రమేయం లేదని చెబుతూ.. డానిష్ మృతిపై తాలిబన్లు సంతాపం కూడా ప్రకటించారు. అయితే తాలిబన్లు కావాలనే ఆయన్ని హింసించి చంపారని చెబుతూ.. ఈమేరకు వాషింగ్టన్కు చెందిన ఓ మ్యాగ్జైన్ గురువారం ఓ కథనం ప్రచురించింది. ‘‘ఆరోజు మిస్టర్ సిద్ధిఖీ అఫ్ఘన్ సైన్య బలగాలతో బయలుదేరారు. అయితే కొద్దిదూరం వెళ్లాక తాలిబన్ దాడితో వాళ్లంతా చెల్లాచెదురయ్యారు. ఈ దాడిలో సిద్ధిఖీ గాయపడగా, స్థానికంగా ఉన్న ఓ మసీదులోకి వెళ్లి వాళ్లంతా తలదాచుకున్నారు. అక్కడే ఆయనకు ఫస్ట్ ఎయిడ్ కూడా చేశారు. అయితే ఆయన మసీదులో ఉన్న విషయం నిర్ధారించుకున్నాకే తాలిబన్లు.. దాడికి తెగబడ్డారు. ప్రాణాలతో పట్టుకుని.. ఆయన సిద్ధిఖీ అని నిర్ధారించుకున్నాకే ప్రాణం తీశారు. సిద్ధిఖీని కాపాడే క్రమంలోనే అఫ్ఘన్ కమాండర్, మిగతా సభ్యులు మరణించారు’’ అని ఆ కథనం పేర్కొంది. ‘‘భారత ప్రభుత్వ సహకారంతో సిద్ధిఖీ మృతదేహం ఫొటోలు, వీడియోలు నేనూ కొన్ని పరిశీలించా. ఆయన తల చుట్టూ గాయాలున్నాయి. బహుశా ఆయన్ని కొట్టి హింసించి ఆపై కాల్పులు జరిపి చంపి ఉంటార’’ని ఏఈఐ సీనియర్ రైటర్ మైకేల్ రుబెన్ అభిప్రాయపడ్డారు. సిద్ధిఖీని వేటాడి చంపాలన్న ఉద్దేశం వాళ్ల(తాలిబన్ల)లో స్పష్టంగా కనిపిస్తోందని, అంతర్జాతీయ సమాజం-యుద్ధ నిబంధనలు, ఉల్లంఘనలు, శాంతిసామరస్యాలు లాంటివి వాళ్ల పరిధిలో లేవనే విషయం స్పష్టమవుతోందని ఆయన ఆ కథనంలో రాశారు. మరి తమ ప్రమేయం లేదని బుకాయిస్తున్న తాలిబన్లు.. ఈ అమెరికా కథనంపై ఎలా స్పందిస్తారో చూడాలి. ముంబైకి చెందిన డానిష్ సిద్ధిఖీ.. నేషనల్ రూటర్స్ మల్టీమీడియా టీం హెడ్‌గా పని చేశారు. అరుదైన ఫొటోలతో అంతర్జాతీయ గుర్తింపును దక్కించుకున్నారు. రొహింగ్యా శరణార్థుల సంక్షోభాన్ని తన ఫొటోలతో కళ్లకు కట్టినట్లు చూపించి.. 2018లో ఆయన పులిట్జర్ ప్రైజ్‌అందుకున్నాడు. 2021 జులై 15న పాక్ సరిహద్దు వద్ద అఫ్ఘన్ సైన్యానికి-తాలిబన్లకు మధ్య జరిగిన పోరును కవర్ చేయడానికి వెళ్లిన ఆయన దారుణ హత్య గురయ్యారు. జర్మన్ సంతతికి చెందిన రికే ఆయన భార్య. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
ఇంటి నుంచి లాక్కెళ్లి.. కమెడియన్ దారుణ హత్య
కాబూల్: అఫ్గనిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రముఖ కమెడియన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ వార్త ప్రపంచాన్ని వణికిస్తుంది. తాలిబన్లే సదరు కమెడియన్‌ను చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సదరు కమెడియన్‌ను ఇంటి నుంచి లాక్కెళ్లి మరి దారుణంగా చంపేశారని తెలిసింది. ఆ వివరాలు.. అఫ్గనిస్తాన్ కాందహార్ ప్రావిన్స్‌లో ఖాషా జ్వాన్‌గా ప్రసిద్ది చెందిన హాస్యనటుడు నాజర్ మొహమ్మద్ దారుణ హత్య ప్రపంచాన్ని వణికించింది. స్థానిక మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు నాజర్ ఇంట్లో ప్రవేశించి.. గన్నులతో బెదిరించి అతడిని బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నాజర్ని హత్య చేసినట్లు ప్రచురించారు. నాజర్ కమెడియన్ కావడానికి ముందు కాందహార్ ప్రావిన్స్‌లో పోలీసు అధికారిగా విధులు నిర్వహించేవాడు. తాలిబన్లే ఈ దారుణానికి ఒడిగట్టారని కమెడియన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ మాత్రం ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని ఖండించింది. అఫ్గనిస్తాన్ భద్రతా దళాలపై తాలిబాన్లు తమ దాడిని తీవ్రతరం చేశారు. ఇప్పటికే దాదాపు 70 శాతం అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దానిలో భాగంగానే ఈ దారుణం చోటు చేసుకుందని భావిస్తున్నారు. కాందహార్‌లో పలు కుటుంబాలు యుద్ధం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల నుంచి పారిపోతున్నాయి. వీరంతా అఫ్గాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. కాందహార్ పార్లమెంట్ సభ్యుడు సయ్యద్ అహ్మద్ సైలాబ్ మాట్లాడుతూ.. ‘‘ఈద్ వేడుకల తరువాత, తాలిబన్లు కాందహార్ ప్రావిన్స్‌లోని అఫ్ఘన్ దళాలపై దాడులను ముమ్మరం చేశారు. భద్రత కోసం పారిపోయిన ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని’’ అని ఇండియా టుడే టీవీకి తెలిపారు. అంతేకాక కాందహార్ సమీపంలోని వలస శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలకు ఆహారం, వైద్య సంరక్షణ అందిస్తున్నామని తెలపారు. ‘‘గ్రామాలను విడిచిపెట్టి కాందహార్ వస్తున్న అన్ని కుటుంబాలకు రెండుసార్లు బ్రేక్ ఫాస్ట్, భోజనం అందించాలని మేము నిర్ణయించుకున్నాము’’ అని సయ్యద్ అహ్మద్ తెలిపారు. -
షాకింగ్: ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణల్లో భారతీయ జర్నలిస్టు మృతి
కాందహార్: ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణల్లో భారతీయ ఫోటో జర్నలిస్టు సిద్దిఖి అహ్మద్ డానిష్ దుర్మరణం పాలయ్యారు. కందహార్ నగరంలోని స్పిన్ బోల్డాక్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో సిద్దిఖీ మృతి చెందినట్లు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశ రాయబారి శుక్రవారం తెలిపారు. సిద్ధిఖి మరణం తీవ్ర విచారకరమని రాయబారి ఫరీద్ మముండ్జాయ్ ప్రకటించారు. పులిట్జర్ బహుమతి గ్రహీత రాయిటర్స్ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ ఆకస్మికమరణంపై పలువురు జర్నలిస్టులు, ఇతర మీడియా మితత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానంటూ ట్వీట్ చేసిన మూడురోజుల్లోనే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని రేపింది. ఈ సందర్బంగా ట్విటర్ వేదికగా సిద్ధిఖీ గతంలో అందించిన కథనాలు, షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. కాగా డానిష్ సిద్దిఖీ టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్‌గా తన వృత్తిని ప్రారంభించి, తరువాత ఫోటో జర్నలిస్టుగా మారారు. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఫోటో జర్నలిస్ట్‌గా ఉన్నారు. అలాగే ఇండియాటుడే గ్రూప్‌లో కొంతకాలం కరస్పాండెంట్‌గా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభ సమయాలను అతి సాహసోపేతంగా కవర్ చేసిన ఘనత సిద్ధిఖీ సొంతం. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో యుద్ధాలు, రోహింగ్యా శరణార్థుల సంక్షోభం, నేపాల్ భూకంపాలు, హాంకాంగ్ నిరసనలు మొదలైనవాటిని కవర్ చేశారు. శ్రీలంక పేలుళ్ల సమయంలో పోలీసు కేసును కూడా సిద్ధిఖీ ఎదుర్కొన్నారు. कल रात कंधार में एक दोस्त दानिश सिद्दीकी की हत्या की दुखद खबर से गहरा दुख हुआ। भारतीय पत्रकार और पुलित्जर पुरस्कार विजेता अफगान सुरक्षा बलों के साथ थे, जब उन पर आतंकवादियों ने हमला किया था। मैं उनसे 2 हफ्ते पहले काबुल के लिए रवाना होने से पहले मिला था। उन्होंने फोटो पत्रकारिता pic.twitter.com/iV79PfjO5i — Farid Mamundzay फरीद मामुन्दजई فرید ماموندزی (@FMamundzay) July 16, 2021 -
మళ్ళీ అదే అనిశ్చితి!
అనుకున్నదే అయింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం తరువాత అమెరికా, దాని మిత్రపక్ష సేనలు అఫ్ఘానిస్తాన్ నుంచి మే 1న వైదొలగడం మొదలవగానే, తాలిబన్ల విస్తరణ, ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. ఒక్కొక్క జిల్లాను హస్తగతం చేసుకుంటూ తాలిబన్లు శుక్రవారం తమ జన్మస్థానమైన కాందహార్‌లోకి ప్రవేశించాయి. భారత్ సైతం కాందహార్‌లోని దౌత్య కార్యాలయ సిబ్బందిని హడావిడిగా వెనక్కి రప్పిస్తోంది. ఒకప్పుడు తాలిబన్ల కేంద్రస్థానమైన కాందహార్ అఫ్ఘాన్‌లో రెండో అతిపెద్ద నగరం. అఫ్ఘాన్ సేనలతో తాలిబన్ల తీవ్రఘర్షణ, అందులో రోజుకు 200 నుంచి 600 మంది దాకా బాధితులు, దేశంలో 85 శాతం తమ చేతుల్లో ఉందన్న తాలిబన్ల వాదన చూస్తుంటే– అఫ్ఘాన్‌లో ఏం జరగచ్చో అర్థమవుతూనే ఉంది. ఆ ఊహే నిజమైతే 1996లో లానే తాలిబన్ల పడగ నీడలోనే అఫ్ఘాన్ జనజీవితం ఇక లాంఛనమే కావచ్చు. ఈ పరిణామాల ప్రభావం భారత ఉప ఖండంపై ఎలా ఉంటుందన్న దాని మీద చర్చ ఊపందుకున్నది అందుకే! అఫ్ఘాన్ ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమంటూనే తాలిబన్లు సాయుధ సంఘర్షణకు దిగడం విచిత్రం. భారత్ మాత్రం ప్రస్తుత అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రభుత్వాన్నే ఇప్పటికీ గట్టిగా సమర్థిస్తోంది. మరోపక్క బైడెన్ అమెరికన్ సర్కారు మాటల ప్రకారం మరో నెలన్నరలో ఆగస్టు 31 కల్లా అఫ్ఘాన్ నుంచి అమెరికన్ సేనల ఉపసంహరణ పూర్తి కానుంది. దాంతో సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం అప్పటి జార్జ్ బుష్ అమెరికన్ ప్రభుత్వం అఫ్ఘాన్‌లోని తాలిబన్ ఏలుబడి పైన, ఉగ్రవాద అల్ కాయిదా సంస్థపైన మొదలు పెట్టిన సైనిక దాడి ప్రతీకార యజ్ఞానికి అర్ధంతరంగా తెర పడనుంది. చరిత్రలోకెళితే, ఇస్లామిక్ తీవ్రవాదుల బృందం అల్ కాయిదా 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో 4 విమానాలను హైజాక్ చేసి, ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’ భవనాలపైన, అమెరికా రక్షణశాఖ కేంద్ర కార్యాలయం పెంటగాన్‌పైన దాడులు జరిపింది. 3 వేల మంది అమాయకుల దుర్మరణానికి కారణమైంది. ‘9/11 తీవ్రవాద దాడులు’గా ప్రసిద్ధమైన ఆ ఘటన, తాలిబన్ల అండ ఉన్న ఆ దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా అంతం చేయడం, ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట అమెరికన్ సేనలు అఫ్ఘాన్‌లో ప్రవేశించడం – ఓ సుదీర్ఘ చరిత్ర. ఉగ్రవాదులు అఫ్ఘాన్‌ను స్థావరంగా చేసుకోవడానికి అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యాన్ని సాధించా మంటూ సేనల్ని ఉపసంహరిస్తూ, అమెరికా – ‘నాటో’ సమష్టి ప్రకటన చేశాయి. క్షేత్రస్థాయిలో అది నేతి బీరకాయలో నెయ్యే కావచ్చు! నిజానికి, 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఎన్నికల వాగ్దానమూ, తాజా బైడెన్ ప్రభుత్వం చేపడుతున్నదీ ఒకటే – అమెరికా సేనల ఉపసంహరణ! కాకపోతే, ఇరవయ్యేళ్ళు ఆతిథ్యమిచ్చిన అఫ్ఘాన్ ప్రభుత్వానికి మాట మాత్రంగానైనా చెప్పకుండా కీలకమైన బాగ్రమ్ సైనిక వైమానిక క్షేత్రం నుంచి అమెరికా సేనలు రాత్రికి రాత్రి వెళ్ళిపోవడం విచిత్రం. అఫ్ఘాన్‌లో కొంత అభివృద్ధికీ, అక్షరాస్యతకూ దోహదపడ్డ అమెరికా ఆఖరికొచ్చేసరికి అక్కడ శాంతిస్థాపన కోసం చూడలేదు. మోయలేని బరువుగా మారిన సైనిక జోక్యాన్ని ఆపేసి, తన దోవ తాను చూసుకుంది. తాజా దండయాత్రలో కీలక బగ్రామ్ వైమానిక క్షేత్రం కూడా తాలిబన్ల చేతికి వచ్చిందంటే, తరువాతి లక్ష్యం అక్కడికి దగ్గరలో ఉన్న కాబూలే. అమెరికా సేనలు దేశం నుంచి తప్పుకోవాలన్నది తొలి నుంచీ తాలిబన్ల డిమాండ్. అది తీరుతున్నా తాలిబన్లు ఘర్షణకు దిగుతున్నారంటే, అది దేనికోసమో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క అఫ్ఘాన్ దేశ నిర్మాణం కోసమేమీ అమెరికా అక్కడకు వెళ్ళలేదనీ, ఆ దేశాన్ని ఎలా నడపాలి, భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలనే నిర్ణయం అఫ్ఘాన్ ప్రజలదేననీ బైడెన్‌కు హఠాత్ జ్ఞానోదయం ప్రదర్శించారు. అఫ్ఘాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణను ఇప్పటికే చైనా తప్పుబట్టింది. ఆ దేశం నుంచి తమ పౌరుల్ని సురక్షితంగా వెనక్కి తెచ్చే పనిలో పడింది. భారత దౌత్య సిబ్బంది పరిస్థితీ అదే. గతంలో 9/11 ఘటనకు రెండేళ్ళ ముందే 1999 డిసెంబర్లో కాందహార్ విమాన హైజాక్ ఉదంతం ద్వారా తాలిబన్ల దెబ్బ భారత్ రుచిచూసింది. ఇండి యన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని తాలిబన్లు హైజాక్ చేయడం, అందులోని అమాయక ప్రయా ణికుల కోసం అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం నలుగురు ఉగ్రవాదులను విడిచిపెట్టడం ఓ తరానికి కళ్ళ ముందు కదలాడే దృశ్యం. పాకిస్తాన్, చైనాలతో పాటు ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్’ ద్వారా మనమూ అఫ్ఘాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్నాం. అందుకే, ఇప్పుడక్కడ పాక్, చైనాలకు అనుకూలమైన తాలిబాన్ల ప్రాబల్యం భౌగోళికంగా, రాజకీయంగా మనకు పెద్ద చిక్కే. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో అంటకాగిన తాలిబన్ మూకలు ఇప్పటికిప్పుడు పవిత్ర మైపోయాయని అనుకోలేం. అమెరికాతో తాలిబన్లు మాట ఇచ్చినట్టు ‘జిహాద్’ను కేవలం తమ దేశానికీ పరిమితం చేస్తాయనీ నమ్మలేం. భారత్‌తో సహా పొరుగు దేశాల్లో జిహాద్‌ను సంకీర్తించే వారు అఫ్ఘాన్‌ను మళ్ళీ తమ అడ్డాగా మార్చుకొనే అవకాశాల్నీ కొట్టిపారేయలేం. వెరసి, సాయుధ తాలిబన్లు గద్దెనెక్కితే శాంతి సౌఖ్యాల కోసం వెంపర్లాడుతున్న మానవతావాదులకూ, మహిళ లకే కాదు... అఫ్ఘాన్ పునర్నిర్మాణం, సహాయ కార్యక్రమాల్లో 300 కోట్ల డాలర్లకు పైగా వెచ్చించిన మన దేశానికీ దెబ్బే. మూడు దశాబ్దాలుగా రకరకాల కారణాలతో అఫ్ఘాన్ రక్తసిక్తం కావడం, రెండు దశాబ్దాల సైనిక జోక్యం తరువాతా ఆ దేశం అనిశ్చితిలోనే మిగలడమే ఓ విషాదం. -
కాందహార్ కబళింపు దిశగా తాలిబన్లు
కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లో అంతర్యుద్ధం వేడి మరింత పెరిగింది. అఫ్ఘన్ ప్రభుత్వ దళాలతో పోరాడుతున్న తాలిబన్లు కీలకమైన కాందహార్ ప్రావిన్సులో ముఖ్యమైన పంజ్వై జిల్లాను గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. తాలిబన్లతో పోరాడి ఓడిన అఫ్ఘన్ దళాలు, తజ్బకిస్థాన్‌లోకి పారిపోయినట్లు స్థానిక ఏఎఫ్‌పీ ఏజెన్సీ తెలిపింది. తాజా విజయంతో అఫ్ఘన్లోని 421 జిల్లాల్లో 100 జిల్లాపై తాలిబన్లకు అదుపు లభించినట్లయింది. ఒక్క కాందహార్ ప్రావిన్సులోనే తాలిబన్ల గుప్పిట్లో ఐదు జిల్లాలున్నాయి. కాందహార్ నగరంపై పట్టు సాధించేందుకు పంజ్వై జిల్లా కీలకమైనది. అఫ్ఘన్ నుంచి యూఎస్ దళాలు వైదొలుగుతున్న తరుణంలో తాలిబన్లు దేశంపై పట్టు పెంచుకుంటూ పోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. పంజ్వై జిల్లాను తాలిబన్లు ఆక్రమించడంతో పలువురు స్థానికులు భయంతో అక్కడ నుంచి వలసపోతున్నారు. తాలిబన్లు తాము పాలించే చోట కఠినమైన షరియా చట్టం అమలు చేస్తారన్న భయంతో స్థానికులు పారిపోతున్నట్లు వార్తా వర్గాలు తెలిపాయి. పంజ్వై పతనం అఫ్ఘన్ ప్రభుత్వ దళాల అసమర్ధతకు నిదర్శనమని కాందహార్ ప్రావిన్షియల్ కౌన్సిల్ ప్రతినిధులు విమర్శించారు. యూఎస్ దళాల మద్దతు కోల్పోయిన అఫ్ఘన్ దళాలు కావాలనే యుద్ధరంగం నుంచి పారిపోయాయని ఆరోపించారు. బాగ్రామ్ కొంపముంచిందా? ఇటీవలే కీలకమైన బాగ్రామ్ ఎయిర్ బేస్ నుంచి అమెరికా, నాటో దళాలు వైదొలిగాయి. ఈ చర్య తాలిబన్ల చొరబాటుకు మరింత వీలు కలిగిస్తుందని అప్పుడే అంచనాలు వెలువడ్డాయి. వీటిని నిజం చేస్తూ తాజా ఘటనలు జరిగాయి. సంవత్సరాల పాటు యూఎస్ తదితర దళాలకు ఈ ఎయిర్‌ఫీల్డ్ కీలక బేస్‌గా మారింది. ప్రస్తుతం యూఎస్ వైమానిక మద్దతు లేకపోవడంతో అఫ్ఘన్ దళాలకు ఓటమి తప్పడంలేదని నిపుణులు భావిస్తున్నారు. అయితే తమ వైమానిక దళం తాలిబన్లపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉందని అఫ్ఘన్ మంత్రి అబ్దుల్ సత్తార్ ప్రకటించారు. పూర్తి శక్తితో తాలిబన్లను అడ్డుకుంటామన్నారు. కాగా ఇప్పటివరకు తమ సరిహద్దులు దాటి దాదాపు 300కుపైగా అఫ్ఘన్ సైనికులు పారిపోయి వచ్చారని తజ్బకిస్థాన్ ప్రతినిధులు చెప్పారు. మానవతా ధృక్పథంతో వారిని దేశంలోకి ఆహ్వానించామన్నారు. -
అఫ్గాన్‌పై పాక్ దాడులు.. ప్రతిదాడికి సిద్దం!
కాబుల్ : దాయాది పాకిస్తాన్ మరోసారి తమ వక్రబుద్ధిని చూపించింది. పొరుగు దేశం అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో గురువారం విచక్షణ రహితంగా దాడులకు తెగబడింది. కందహార్ ప్రావిన్స్‌లోని స్పిన్ బోల్డాక్ జిల్లాలోని నివాస ప్రాంతాలపై జరిగిన ఈ ఫిరంగి దాడుల్లో కనీసం తొమ్మిది మంది పౌరులు మరణించినట్లు, 50 మంది గాయపడ్డారని ఆప్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గాయపడిన వారిలో చాలా మంది పిల్లలు ఉన్నట్లు సాక్షులు పేర్కొన్నారు. (అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి; ఏడుగురి మృతి) దీంతో పాకిస్తాన్‌పై ప్రతిదాడి చర్యలకు సిద్ధంగా ఉండాలని అఫ్ఘన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ యాసిన్ జియా పిలుపు నిచ్చారు. అలాగే ఇందుకు పాక్- అఫ్గాన్‌సరిహద్దు ప్రాంతం డురాండ్ లైన్ వద్ద దేశ సైనిక దళాలను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. కాగా కొన్ని సంవత్సరాలుగా పాక్ సైనిక దళాలు అఫ్గానిస్తాన్ తూర్పు, దక్షిణ భాగాలపై ఫిరంగి దాడులకు పాల్పడుతున్నాయని నిరూపించడానికి అనేక ఉదాహరణలు ఉన్నప్పటికీ పాక్ మాత్రం వీటిని ఖండిస్తూనే ఉంది. (తాలిబన్లపై ప్రతీకారం తీర్చుకున్న బాలిక) -
బాంబు పేలుడు..34 మంది మృతి!
కాబూల్: ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. హరాత్-కాందహార్ జాతీయ రహదారిపై బాంబులతో విరుచుకుపడ్డాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో సుమారుగా 34 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాగా అఫ్గాన్ ప్రభుత్వం, దాని మిత్ర దేశాలకు తాలిబన్లకు జరుగుతున్న యుద్ధంతో... గత కొన్ని రోజులుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మంగళవారం తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మరణించగా.. మరో 23 మంది తీవ్రగాయాలపాలయ్యారు. -
ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి; 10 మంది జవాన్ల మృతి
- 10 మంది జవాన్ల మృతి, ఒకరికి గాయాలు కాందహార్: ఇంగ్లాడ్‌లోని మాంచెస్టర్‌లో ఐసిస్ మారణకాండ జరిగిన కొద్ది గంటలకే అఫ్ఘానిస్థాన్‌లోనూ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అఫ్ఘాన్ సైనిక శిబిరంపై ముష్కరులు జరిపిన దాడిలో 10 మంది జవాన్లు చనిపోగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కాందహార్ ఫ్రావిన్స దక్షిణ ప్రాంతంలోని షావలీ కోట్ జిల్లాలో ఈ సంఘటన జరిగిందని, దాడి జరిగిన సమయంలో క్యాంపులో 205 మంది సైనికులు ఉన్నారని అఫ్ఘాన్ రక్షణ శాఖ తెలిపింది. -
శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చి ...
కాబూల్: ఆత్మాహుతి దాడిలో ఆఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హామీద్ కర్జాయి సోదరుడు హస్మత్ కర్జాయి మంగళవారం మరణించాడు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో యువకులు కందహార్లోని హస్మత్ నివాసానికి వచ్చారు. ఆ క్రమంలో వారికి హస్మత్... రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారీగా పేలుడు పదార్థాలతో అక్కడికి వచ్చిన వ్యక్తి తనకు తాను పేల్చివేసుకున్నాడు. దాంతో హస్మత్తోపాటు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన పలువురు మృతి చెందారని ప్రోవెన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి దవఖాన్ మణిపాల్ వెల్లడించారు. ఇటీవలే ఆఫ్ఘానిస్థాన్ దేశ అధ్యక్షుడి పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ఫలితాలు వెలువడవలసి ఉంది. ఆయితే ఆ దేశాధ్యక్ష పదవి నుంచి హామీద్ కర్జాయి తప్పుకోనున్నారు. -
అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా జోక్యం వద్దు:కర్జాయ్
కాందహార్: తమ దేశంలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలని ఆఫ్ఘాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్పష్టం చేశాడు. త్వరలో ఆఫ్ఘాన్ లో అధ్యక్ష ఎన్నికలు జరుగునున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికా గానీ, దాని మిత్రపక్షాలు జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలని కర్జాయ్ సూచించారు. రెండు నెలల పాటు జరిగే ఎన్నికల ప్రచారం ఇప్పటికే ఆరంభమైనందున ఎవరు జోక్యాలు అవసరంలేదన్నారు. అధ్యక్ష ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన సృష్టం చేశారు. ఏప్రిల్ 5 న జరిగే అధ్యక్ష ఎన్నికలకు అమెరికా దూరంగా ఉండి, ఓటింగ్ ప్రశాంతంగా జరగడానికి దోహదపడగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
ఆఫ్ఘాన్‌లో 22 మంది తీవ్రవాదుల హతం
దేశంలో తీవ్రవాదుల ఏరివేత లక్ష్యంగా గత 24గంటల కాలవ్యవధిలో నిర్వహించిన ఆపరేషన్‌లో 22 మంది తాలిబాన్ తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆఫ్ఘానిస్థాన్ హోం మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.ఆ ఆపరేషన్‌లో మిలటరీ సంకీర్ణ దళాలు,నాటో దళాలు సంయుక్తంగా పాల్గొన్నాయని వివరించింది. కందహార్, గజనీ, హెరత్, ఉర్జగన్ తదితర ప్రావెన్స్లో ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపింది.అంతేకాకుండా ఆయుధాలను,పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఆ దాడుల్లో పాల్గొన్న వారిలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
ఆఫ్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి: ఐదుగురు మృతి
దక్షిణ ఆఫ్ఘానిస్థాన్‌లో కందహార్ నగరంలోని పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద ఈ రోజు ఉదయం ఆత్మహుతి కారు బాంబు పేలిన ఘటనలో ఐదుగురు మృతి చెందారని ప్రోవెన్షియల్ గవర్నర్ జావెద్ ఫైసల్ శనివారం ఇక్కడ వెల్లడించారు. ఆ ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మరో కొంత మంది క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు. గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫైసల్ వివరించారు. చెక్‌పోస్ట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో భాగంగా పోలీసులు ఓ కారును ఆపారని, అయితే ఆ కారులో పేలుడు పదార్థాలతో వస్తున్న ఆ వ్యక్తి తనను తాను పేల్చుకుని అత్మాహుతికి పాల్పడ్డాడని ఆయన వివరించారు. అయితే ఆ ఘటన తామే బాధ్యలు అంటూ ఇప్పటి వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని తెలిపారు. అల్ ఖైదా తీవ్రవాద సంస్థ ఈ ఘాతుకాని ఒడికట్టిందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఎందుకుంటే ఆఫ్ఘానిస్థాన్‌లో దక్షిణ ప్రాంతంలో అల్ ఖైదా ప్రాబల్యం అధికంగా ఉందని ప్రోవెన్షియల్ గవర్నర్ చెప్పారు.