శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చి ...
కాబూల్: ఆత్మాహుతి దాడిలో ఆఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హామీద్ కర్జాయి సోదరుడు హస్మత్ కర్జాయి మంగళవారం మరణించాడు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో యువకులు కందహార్లోని హస్మత్ నివాసానికి వచ్చారు. ఆ క్రమంలో వారికి హస్మత్... రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారీగా పేలుడు పదార్థాలతో అక్కడికి వచ్చిన వ్యక్తి తనకు తాను పేల్చివేసుకున్నాడు.
దాంతో హస్మత్తోపాటు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన పలువురు మృతి చెందారని ప్రోవెన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి దవఖాన్ మణిపాల్ వెల్లడించారు. ఇటీవలే ఆఫ్ఘానిస్థాన్ దేశ అధ్యక్షుడి పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ఫలితాలు వెలువడవలసి ఉంది. ఆయితే ఆ దేశాధ్యక్ష పదవి నుంచి హామీద్ కర్జాయి తప్పుకోనున్నారు.