Hamid Karzai
-
కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద రాకెట్ దాడులు
కాబూల్: అఫ్గాన్ రాజధానిలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా సోమవారం రాకెట్ దాడులు జరిగాయి. అయితే ఆధునిక రక్షణ వ్యవస్థ ఈ దాడులను తిప్పికొట్టడంతో రాకెట్లు సమీపంలోని సలీం కార్వాన్ ప్రాంతంలో కూలిపోయినట్లు తెలిసింది. దాడుల్లో ఎవరూ గాయపడినట్లు తెలియరాలేదు. తొలుత దాడులకు ఎవరు కారణమన్నది తెలియరాలేదు, కానీ తామే దాదాపు ఆరు కత్యూషా రాకెట్లు పేల్చామని ఐసిస్ గ్రూప్ ప్రకటించుకుంది. ఒకపక్క రాకెట్ దాడులు జరుగుతున్నా అమెరికా దళాల ఉపసంహరణ కొనసాగింది. అమెరికన్లను తీసుకుపోయేందుకు వచ్చిన సీ–17 కార్గో జెట్ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు కొనసాగాయి. ఐసిస్, ఇతర ఉగ్ర సంస్థలు ఎయిర్‌పోర్ట్‌పై దాడులకు యత్నిస్తూనే ఉన్నాయి. రాజధానిలోని చహరె షహీద్ ప్రాంతం నుంచి తాజా రాకెట్ దాడి జరిగినట్లు అనుమానాలున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు ఉపయోగించి వదిలివెళ్లిన వాహనాన్ని గుర్తించారు. ఇందులో రాకెట్ ట్యూబులను కనుగొన్నారు. రాకెట్ల రవాణాకు ఈ ట్యూబులను టెర్రరిస్టులు ఉపయోగిస్తుంటారు. దాడులకు గురైన సలీం కార్వాన్ ప్రాంతం ఎయిర్‌పోర్టుకు 3 కి.మీ.ల దూరంలో ఉంది. ఇతర గ్రూపులతో భయాలు సరైన పత్రాలున్నవారు అఫ్గాన్ వీడేందుకు అనుమతిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చినట్లు యూఎస్ ప్రపంచ దేశాలకు తెలియజేసింది. అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత కూడా సాధారణ ప్రయాణాలకు విమానాశ్రయాన్ని అనుమతిస్తామని తాలిబన్లు తెలిపారు. పాశ్చాత్య దళాలు తమ దేశం విడిచి సురక్షితంగా వెళ్లేందుకు తాము సహకరిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చినా, ఇతర టెర్రరిస్టు గ్రూపులతో యూఎస్ దళాలకు ప్రమాదం పొంచిఉంది. తాలిబన్లు పాలన చేపట్టాక పలువురు ఖైదీలను విడుదల చేశారు. వీరిలో ఐసిస్–కె టెర్రరిస్టులు ఉన్నారు. వీరంతా యూఎస్ దళాలపై దాడులకు ప్రస్తుతం యత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం సైతం ఐసిస్ తీవ్రవాదులు కాబూల్ విమానాశ్రయంపై దాడికి యత్నించగా, అమెరికా దళాలు తిప్పికొట్టాయి. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు మరణించారు. మంగళవారం నాటికి పూర్తిగా అఫ్గాన్ నుంచి బయటపడాలని అమెరికా యత్నిస్తోంది. సోమవారం రాకెట్ దాడులను తమ సీర్యామ్ వ్యవస్థ తిప్పికొట్టిందని అమెరికా ప్రతినిధి బిల్ అర్బన్ తెలిపారు. దారిలోనే ఐదు రాకెట్లను తమ వ్యవస్థ ధ్వంసం చేసిందన్నారు. అమెరికా డ్రోన్ దాడుల్లో ఏడుగురు మరణించారు కాబూల్‌లో ఆత్మాహుతి బాంబర్పై ఆదివారం అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో ఏడుగురు సాధారణ పౌరులు మరణించారని తాలిబన్లు వెల్లడించారు. ఏదైనా దాడి చేపట్టే ముందు తమకు సమాచారమిస్తే బాగుండేదని, విదేశీగడ్డపై అమెరికా ఇలాంటి చర్యలకు దిగడం చట్ట విరుద్ధమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా చైనా అధికార టీవీ ఛానల్ ‘సీజీటీఎన్’తో అన్నారు. అఫ్గాన్ గడ్డపై ఏదైనా ముప్పు పొంచివుంటే అమెరికా మాకు చెప్పాల్సింది. ఇలా ఏకపక్షదాడులకు దిగడం సరికాదు’ అని జబీహుల్లా పేర్కొన్నారు. పౌరులు మృతి చెందారనే వార్తలపై దర్యాప్తు చేస్తున్నామని పెంటగాన్ తెలిపింది. మతాధికారి జద్రాన్ అరెస్ట్ అఫ్గాన్‌లో తమను వ్యతిరేకించే ప్రముఖుల అరెస్ట్‌ల పర్వాన్ని తాలిబన్లు కొనసాగిస్తున్నారు. అఫ్గాన్‌లో ప్రముఖ మతాధికారి (మౌల్వీ) మొహమ్మద్ సర్దార్ జద్రాన్‌ను అరెస్ట్ చేసినట్ల తాలిబన్లు తాజాగా ధ్రువీకరించారు. అఫ్గాన్‌లో మతాధికారుల జాతీయ మండలికి ఆయన గతంలో అధ్యక్షునిగా సేవలందించారు. ఆయనను బంధించి, కళ్లకు గంతలు కట్టిన ఫొటోను తాలిబన్లు విడుదల చేశారు. -
కాబూల్ రక్తసిక్తం:100 మందికి పైగా మృతి!
కాబూల్: భయపడినంతా జరిగింది. కాబూల్ రక్తమోడింది. దేశాన్ని వదిలి వెళుతున్న పాశ్చాత్యులు, అఫ్గాన్ల లక్ష్యంగా కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం చీకటి పడుతున్న వేళ ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటివరకూ ఈ రెండు బాంబుపేలుళ్లలో 100 మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 90 మంది అఫ్గాన్ జాతీయులే ఉండగా, 13 మంది వరకూ అమెరికా దేశానికి చెందిన వారు ఉన్నారు. చదవండి: ఇటలీ విమానంపై కాల్పులు విమానాశ్రయంలో పేలుడు దృశ్యం ఇది ఇస్లామిక్ స్టేట్ – ఖోరాసన్ (ఐసిస్–కె) ఉగ్రమూక దుశ్చర్యగా భావిస్తున్నారు. కాబూల్ విమానాశ్రయానికి ఉగ్రముప్పు పొంచివుందని, ఆ పరిసరాల్లో ఎవరూ ఉండొద్దని... సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని అమెరికా, బ్రిటన్ సహా పలు పాశ్చాత్య దేశాలు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే బాంబుల మోతతో కాబూల్ దద్దరిల్లింది. ఆత్మాహుతి దాడితో పాటు విమానాశ్రయానికి వచ్చిన వారిపై తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లుగా సమాచారం అందుతోంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని... బిక్కుబిక్కుమంటూ విమానాశ్రయంలోకి ప్రవేశం కోసం వేచిచూస్తున్న అఫ్గాన్లు, విదేశీయులు ఈ దాడితో తీవ్రంగా భయకంపితులయ్యారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. చదవండి: అబ్బాయిల వేషం కట్టి... తప్పించుకుంది రక్తమోడుతున్న ఓ అఫ్గాన్ పౌరుడు విమానాశ్రయం ప్రధాన ద్వారం అబే గేటు వద్ద రాత్రి 6.45 గంటలకు తొలి ఆత్మాహుతి దాడి జరిగింది. అక్కడ వేల సంఖ్యలో జనం గుమిగూడి ఉండటంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. సాధారణ పౌరులతో పాటు అమెరికా భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 11 మంది అమెరికా మెరైన్ దళ సభ్యులు, వైద్య బృందంలో ఒకరు కలిపి మొత్తం 12 మంది అమెరికా సిబ్బంది చనిపోయారని అమెరికా ధ్రువీకరించింది. రెండోదాడి అబే గేటుకు సమీపంలోకి బారన్ హోటల్ గేటు వద్ద రాత్రి 8 గంటలకు జరిగింది. ఇక్కడ 52 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కాబూల్ ఎమర్జెన్సీ ఆసుపత్రిలో ఇప్పటిదాకా 60 మంది క్షతగాత్రులు చేరారు. పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ అమెరికన్ భద్రతా సిబ్బంది మరణించినట్లు, గాయపడ్డట్లు ధ్రువీకరించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం విమానాశ్రయం గేటు వద్ద జరిగిన పేలుడులో పెద్ద సంఖ్యలో జనం మరణించారని, క్షతగాత్రులయ్యారని ప్రత్యక్షసాక్షి అదమ్ ఖాన్ తెలిపారు. చాలామంది కాళ్లు, చేతులు తెగిపడ్డాయన్నారు. గాయపడ్డ మహిళలు రక్తమోడుతూ రోదించడం, చిన్నారుల ఆక్రందనలతో సంఘటనా స్థలం వద్ద భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. విమానాశ్రయం ప్రహరీగోడను ఆనుకొని ఉన్న మురికి కాలువలో దిగి... అమెరికా బలగాలను తమను లోనికి అనుమతించాలని బతిమాలుతున్న అఫ్గాన్లపై ఆత్మాహుతి బాంబర్ దూసుకెళ్లి పేల్చి వేసుకున్నాడు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు నిఘా, భద్రతావర్గాలు తాజా పరిస్థితిని వివరించాయి. బైడెన్ తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విమానాశ్రయం అమెరికా బలగాల అధీనంలోనే ఉందని, లోపల య«థావిధిగా తరలింపు విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయని పెంటగాన్వర్గాలు చెప్పాయి. అమెరికా అధీనంలోని ప్రాంతంలోనే: తాలిబన్లు ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించారు. ఈ బాంబుపేలుళ్లు అమెరికా నియంత్రిత ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. తాము ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని... ఎయిర్పోర్ట్ భద్రతపై నిశితంగా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్‌ను స్థావరంగా వాడుకోవడానికి అనుమతించబోం’ అని జబీహుల్లా ప్రకటించారు. ఐసిస్ ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని తామే అమెరికాను హెచ్చరించినట్లు ఆయన చెప్పారు. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5,800 మంది అమెరికా సైనికులు, వెయ్యిమంది దాకా బ్రిటన్ సైన్యం, ఇతర నాటో దళాలు ఉన్నాయి. ఆగస్టు 31వ తేదీలోగా ఈ బలగాల ఉపసంహరణ పూర్తికావాలని... గడువు పొడిగించే సమస్య లేదని తేల్చిచెప్పిన తాలిబన్లు... విమానాశ్రయం అన్ని వైపుల నుంచీ మోహరించి ఉన్నారు. ఒప్పందం మేరకు విమానాశ్రయం లోనికి వెళ్లే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అయితే ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న అఫ్గాన్లను అడ్డుకుంటున్నారు. ఇళ్లకు తిప్పిపంపేస్తున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి వేలాదిగా విమానాశ్రయానికి తరలివస్తున్న అఫ్గాన్లను చెదరగొడుతున్నారు. గురువారం వీరిపై వాటర్ క్యానన్లను కూడా ప్రయోగించారు. ఆయుధాలు చేజిక్కించుకొని... ఐసిస్(కె) కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ. తాలిబన్లను మించి ఇస్లామిక్ అతివాద భావజాలం. ఐసిస్‌కు తాలిబన్లతో తీవ్రవైరముంది. అంతర్జాతీయ ప్రకంపనలు సృష్టించడం, తాలిబన్లను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టడం లక్ష్యంగా ఐసిస్ ఈ దాడులకు వ్యూహరచన చేసినట్లు కనపడుతోంది. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న క్రమంలో ఆయా ఫ్రావిన్సుల్లోని జైళ్లలో ఉన్న ఖైదీలందరినీ విడుదల చేశారు. వీరిలో తాలిబన్లతో పాటు ఐసిస్ ఉగ్రవాదులు ఉన్నారు. వీరందరూ బయటపడి... అస్త్రసన్యాసం చేస్తున్న అఫ్గాన్ సైనికుల ఆయుధాలను చేజిక్కించుకున్నారని... కొద్దికాలంలోనే బాగా బలపడ్డారని తెలుస్తోంది. ఆగస్టు 31లోగా బలగాల ఉపసంహరణ పూర్తిచేస్తామని, ఆలోగా హమీద్ కర్జాయ్ విమానాశ్రయం జోలికి రావొద్దని అమెరికా – తాలిబన్లతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. రాజకీయ, భద్రతా చానళ్ల ద్వారా తాలిబన్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ... అమెరికన్లను, నాటో దళాలకు సహాయపడ్డ అఫ్గాన్లను ఆగమేఘాలపై తరలిస్తోంది. గడువు సమీపిస్తున్న కొద్దీ తరలింపులో వేగం పెంచింది. చరిత్రలోనే అతిపెద్ద ఎయిర్లిఫ్ట్గా భావిస్తున్న ఆపరేషన్‌లో మంగళవారం 19 వేల మందిని, బుధవారం 13,400 మందిని సురక్షితంగా కాబూల్ బయటకు తరలించింది. 4,500 మంది అమెరికన్లను తరలించగా... మరో 1,500 మంది అమెరికన్లు ఇంకా కాబూల్‌లోనే ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ గురువారం చెప్పారు. భారతీయులందరినీ తరలిస్తాం అఖిలపక్ష భేటీలో విదేశాంగ మంత్రి జై శంకర్ న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయి ఉన్న భారతీయులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. అఫ్గాన్‌లో పరిస్థితులు సంక్లిష్టంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో జై శంకర్ విపక్ష నాయకులకు అఫ్గాన్‌లో పరిస్థితుల్ని వివరించారు. ఈ భేటీకి 31 పార్టీల నుంచి 37 మంది నాయకులు హాజరయ్యారు. జై శంకర్‌తో పాటుగా కేంద్రమంత్రి, రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయెల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. ఇక విపక్షాల నుంచి ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్, డీఎంకేకు చెందిన టి.ఆర్.బాలు తదితరులు హాజరయ్యారు. అనంతరం జైశంకర్ మాట్లాడారు. అఫ్గాన్‌లో పరిస్థితులు చక్కబడే వరకు తాలిబన్ల పట్ల కేంద్రం తన వైఖరిపై ఒక నిర్ణయానికి రాలేదని అన్నారు. ‘మా ముందున్న అతి పెద్ద కార్యక్రమం భారతీయులందరినీ తరలించడం. అఫ్గాన్‌తో స్నేహసంబంధాలను కొనసాగించడమూ మా ముందున్న లక్ష్యం’ అని జై శంకర్ ట్వీట్ చేశారు. -
తాలిబన్లతో కర్జాయ్ చర్చలు
కాబూల్: తాలిబన్ల నేతృత్వంలో అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు వేగం పుంజుకున్నాయి. తాలిబన్ సీనియర్ నాయకుడు, హక్కాని నెట్‌వర్క్‌కు చెందిన అనాస్ హక్కానీ బుధవారం అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో కీలకభూమిక పోషించిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా ఈ భేటీకి హాజరయ్యారు. శాంతియుతంగా అధికార బదిలీ జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగాలనే ఉద్దేశంతో కర్జాయ్ సంప్రదింపులకు నేతృత్వం వహిస్తున్నారు. అనాస్‌తో భేటీ ప్రాథమిక చర్చల్లో భాగమని కర్జాయ్ ప్రతినిధి వెల్లడించారు. తాలిబన్ల రాజకీయ విభాగం సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో తదుపరి కీలకచర్చలకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు. అన్ని పక్షాలను కలుపుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. యూఏఈలో అష్రాఫ్ ఘనీ తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో ఆదివారం దేశం వదిలి పారిపోయిన అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆశ్రయం కల్పించింది. మానవతా దృక్పథంతో ఘనీ, ఆయన కుటుంబాన్ని శరణార్థులుగా అనుమతించా మని యూఏఈ విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. అయితే యూఏఈలో ఎక్కడ తలదాచుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. తొలుత ఆయన తజకిస్తాన్‌కు పరారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
కాబూల్ ఎయిర్‌పోర్టులో తొక్కిసలాట, కాల్పులు
Chaotic Scenes At Kabul Airport అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడంతో దేశంలో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీవనం సాగించిన జనం ఇక రాబోయే గడ్డు రోజులను తలచుకొని బెంబేలెత్తిపోతున్నారు. తాలిబన్ల రాక్షస పాలనలో బతకలేమంటూ త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆరాటపడుతున్నారు. అఫ్గాన్‌లో విదేశీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా స్వదేశాలకు పయనమవుతున్నారు. దేశ సరిహద్దులను, భూమార్గాలను తాలిబన్లు దిగ్బంధించడంతో ఆకాశయానమే దిక్కయింది. రన్‌వేపై విమానాల కోసం వేచిచూస్తున్న వందలాది మంది పౌరులు దేశవిదేశీ పౌరులతో కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కిక్కిరిసిపోతోంది. ఎయిర్‌పోర్టుకు దారితీసే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. కాబూల్ నుంచి ప్రస్తుతం వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం ప్రయాణికుల విమాన సేవలే కొనసాగుతున్నాయి. ఎయిర్‌పోర్టులో హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. జనం గోడలు దూకి లోపలికి ప్రవేశిస్తున్నారు. విమానాల రాకకోసం వేలాది మంది పిల్లా పాపలతో కలిసి ఆకలి దప్పులు మరిచి చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఏకంగా రన్‌వే పైకి చేరుకొని నిరీక్షిస్తున్నారు. ఏదైనా విమానం రావడమే ఆలస్యం ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి ప్రవేశిస్తున్నారు. టేకాఫ్ అవుతున్న విమానాల వెంట ప్రాణాలను పణంగా పెట్టి పరుగులు తీస్తున్నారు. ప్రాణాలు దక్కించుకోవాలన్న ఆకాంక్షే అందరిలోనూ కనిపిస్తోంది. కొందరు విమానం రెక్కలపైకి ఎక్కి కూర్చుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా పోలీసులు గానీ, భద్రతా సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపించారు. ఇక్కడ నిలబడడానికి స్థలం లేదని వాపోయారు. పిల్లల ఏడుపులు, పెద్దల అరుపులు, యువకుల ఆగ్రహావేశాలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం మార్మోగిపోతోంది. వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పది మంది మృతి దేశం విడిచి వెళ్లడానికి కాబూల్ ఎయిర్‌పోర్టులో విమానం పైకి ఎక్కి కూర్చున్న జనం తాజాగా కాబూల్ గగనతలంలో ఎగురుతున్న ఓ ఎయిర్‌క్రాఫ్ట్ చక్రాలను పట్టుకొని వేలాడుతున్న ముగ్గురు వ్యక్తులు పట్టుతప్పి కిందికి జారిపడి మరణించారు. ఈ దృశ్యాలను టెహ్రాన్ టైమ్స్ పత్రిక ట్విట్టర్లో ఉంచింది. గాల్లో విమానం చక్రాల నుంచి జారిపడి ముగ్గురు మరణించిన దృశ్యాలు సోషల్ మీడియాలో నెటిజన్లను కలచివేస్తున్నాయి. సోమవారం కాబూల్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను అదుపు చేయడానికి అమెరికా సైనికులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి టేకాఫ్‌నకు సిద్ధమవుతున్న అమెరికా జెట్ విమానంపైకి ఎక్కేందుకు జనం ఎగబడ్డారు. విమానం కదులుతుండగా పెద్ద సంఖ్యలో జనం దాని వెనుక పరుగులు తీయడం వారి ఆత్రుతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో తొక్కిసలాట జరగడంతోపాటు కొందరు జారిపడ్డారని, ఈ ఘటనలో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు అధికారులు చెప్పారు. అలాగే విమానాశ్రయంలో అమెరికా సైనికుల కాల్పుల్లో ఇద్దరు సాయుధులు చనిపోయారు. బయటకు రావాలంటే భయం భయం ప్రాణం కోసం పరుగులు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకొనే క్రమంలో తాలిబన్లు కేవలం సైనికులు, పోలీసులతో తలపడ్డారు తప్ప సామాన్య ప్రజలపై ఎలాంటి దాడులు చేయలేదు. అయినప్పటికీ జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో బయటకు రావడానికి జంకుతున్నారు. తాలిబన్లు జైళ్లలోని ఖైదీలను విడిచిపెట్టారు. జైళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆయుధాగారాలను లూటీ చేశారు. కాబూల్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం నుంచి సిబ్బంది మొత్తం వెళ్లిపోయారు. ఇతర దేశాలు తమ రాయబార కార్యాలయాలను ఖాళీ చేస్తున్నాయి. ఉద్యోగులు, సిబ్బందిని స్వదేశాలకు తరలిస్తున్నాయి. నిలాన్ అనే 27 ఏళ్ల యువతి మాట్లాడుతూ.. తాను కాబూల్ వీధుల్లో 15 నిమిషాల పాటు ప్రయాణించానని, పురుషులు తప్ప మహిళలెవరూ కనిపించలేదని చెప్పారు. వంట సరుకులు తెచ్చుకోవడం లాంటి చిన్నచిన్న పనుల కోసం కూడా మహిళలు బయటకు వెళ్లలేకపోతున్నారని వివరించారు. ‘ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. మా ఉద్యోగాలు ఉన్నాయో ఊడాయో తెలియదు. మా జీవితం ముగిసిపోయినట్లే, భవిష్యత్తు లేనట్లే అనిపిస్తోంది’ అని నిలాన్ వ్యాఖ్యానించారు. మరో వేయి మంది అమెరికా సైనికులు అఫ్గానిస్తాన్ నుంచి వెనక్కి మళ్లుతున్న అమెరికా, దాని మిత్రదేశాల ఉద్యోగుల రక్షణ కోసం కాబూల్ ఎయిర్‌పోర్టుకు రాబోయే 48 గంటల్లో వేయి మంది సైనికులను తరలిస్తామని అమెరికా ప్రకటించింది. కాబూల్ ఎయిర్పోర్ట్ భద్రత కోసం ఇప్పటికే అమెరికా అక్కడ 5వేల మంది సైనికులను మోహరించింది. ఎయిర్‌పోర్టు జోలికి రావొద్దు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారులు ఖతార్ రాజధాని దోహాలో సీనియర్ తాలిబన్ నాయకులతో తాజాగా చర్చలు జరిపారు. కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి తమ ఉద్యోగులు, పౌరులను స్వదేశానికి తరలిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఎయిర్‌పోర్టు తమ నియంత్రణలోనే ఉంటుందని, దాని జోలికి రావొద్దని సూచించారు. దీనికి తాలిబన్లు అంగీకరించారని సమాచారం. ‘ఉగ్ర’నిలయంగా మారనివ్వద్దు: ఐరాస తాలిబన్ల పాలనలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్ ఉగ్ర మూకలకు నిలయంగా మారకుండా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా వ్యవహరించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ సోమవారం పిలుపునిచ్చారు. అఫ్గాన్ ప్రజలను వారి ఖర్మానికి వారిని వదిలివేయకూడదని భద్రతా మండలికి గుటెరస్ విజ్ఞప్తి చేశారు. అఫ్గాన్ పరిణామాలపై చర్చించేందుకు భద్రతా మండలి ప్రత్యేక అత్యవవసర సమావేశం భారత్ నేతృత్వంలో జరిగింది. అఫ్గాన్‌పై భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం కావడం వారంలో ఇది రెండోసారి. అఫ్గానిస్తాన్‌కు ఇది కీలక కఠోర సమయమని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తాలిబన్లు యత్నించాలని ఈ సందర్భంగా అంటోనియో హితవు పలికారు. తక్షణమే ఈ ప్రాంతంలో హింసను నివారించాలని, మానవ హక్కుల పరిరక్షణ చేయాలని అన్ని పక్షాలను గుటెరస్ కోరారు. -
Afghanistan: అఫ్గాన్‌లో తాలిబన్ రాజ్యం
కాబూల్: అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణం ఒక విఫల ప్రయోగంగానే మిగిలిపోయింది. అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ తాలిబన్లకు అందివచ్చిన అవకాశం మారింది. దేశాన్ని మళ్లీ స్వాధీనం చేసుకున్నారు. ఇక పూర్తి అధికారాన్ని దక్కించుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందరూ ఊహించనట్లుగానే తాలిబన్లు ఆదివారం అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోకి దర్జాగా ప్రవేశించారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఈ చారిత్రక నగరంలో పాగా వేశారు. తాము ఎవరిపైనా దాడులు చేయబోమని, ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని తాలిబన్లు నిర్దేశించారు. దీంతో అఫ్గాన్ కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. శాంతియుతంగా అధికార మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధులు వెల్లడించారు. అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, తన బృందంతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. తజకిస్తాన్‌కు వెళ్లి తలదాచుకుంటున్నారు. అఫ్గాన్ సర్కారు నుంచి తాలిబన్లకు అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించడానికి కో–ఆరి్డనేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ప్రకటించారు. అమ్మో... తాలిబన్ పాలన కేవలం వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు మొత్తం అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించడం గమనార్హం. అఫ్గాన్ భద్రతా దళాలను బలోపేతం చేసేందుకు అమెరికా, నాటో ఇప్పటిదాకా వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టినప్పటికీ అదంతా వృథా ప్రయాసగా మారింది. అఫ్గాన్ సైన్యం తాలిబన్లకు కనీసం ఎదురు నిలువలేకపోయింది. రాజధాని కాబూల్ తాలిబన్ల పరం కావడానికి కనీసం నెల రోజులైనా పడుతుందంటూ అమెరికా సైన్యం వేసిన అంచనాలు తారుమారయ్యాయి. తాలిబన్ల అరాచక పాలనలో బతకలేమంటూ అఫ్గాన్లు, విదేశీయులు అఫ్గానిస్తాన్ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ దాచుకున్న సొమ్మును వెనక్కి తీసుకొనేందుకు జనం ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరారు. కొందరు పేదలు తమ ఇళ్లను వదిలేసి పార్కులు, బహిరంగ ప్రదేశాలకు చేరుకుంటున్నారు. తమ పౌరులను అఫ్గాన్ నుంచి వెనక్కి రప్పించేందుకు అమెరికాతో సహా చాలా దేశాలు ఆత్రుత పడుతున్నాయి. ఆదివారం కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని అమెరికా సైన్యం హెలికాప్టర్లలో కాబూల్ ఎయిర్‌పోర్టులోని ఔట్‌పోస్టుకు తరలించింది. కో–ఆరి్డనేషన్ కౌన్సిల్ తాలిబన్లతో చర్చలు జరపడానికి, దేశంలో అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించడానికి కో–ఆర్డినేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్లు అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ కౌన్సిల్లో గుల్బుదీన్ హెక్మాత్యార్, అబ్దుల్లా అబ్దుల్లాతోపాటు తాను కూడా సభ్యులుగా ఉంటామని తెలిపారు. కాబూల్ వీధుల్లో అలజడి, అశాంతిని నియంత్రించాలని తాలిబన్లకు, అఫ్గాన్ సైనికులకు హామీద్ కర్జాయ్ సూచించారు. అఫ్గాన్‌లో శాంతిని స్థాపించేందుకు, అధికార బదిలీ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అందరూ చొరవ తీసుకోవాలని కోరారు. మరోవైపు తాలిబన్ల ముందు తాను ఎప్పటికీ తల వంచబోనని అఫ్గాన్ మొదటి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తేల్చిచెప్పారు. ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ అఫ్గానిస్తాన్ పేరును మార్చాలని తాలిబన్లు నిర్ణయించారు. ఇకపై ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌గా పిలవాలని ఆదేశించారు. అధ్యక్ష భవన నుంచే ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. అమెరికా సైన్యం రాకముందు తాలిబన్ల పాలన కొనసాగుతున్నప్పుడు అఫ్గాన్‌కు ఇదే పేరు ఉండేది. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు! కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఆదివారం రాత్రి తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు జరిగినట్లుగా సమాచారం అందుతోందని, అందువల్ల అమెరికన్లు ఎక్కడివారక్కడే సురక్షితంగా తలదాచుకోవాలని సూచించింది. ‘కాబూల్‌లో పరిస్థితి క్షీణిస్తోంది. విమానాశ్రయంలో భద్రత ప్రమాదంలో పడింది. వేగంగా పరిస్థితి దిగజారుతోంది. విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడివారక్కడ సురక్షితంగా ఉండండి. రాయబార కార్యాలయంలో అధికారిక విధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ఈ సమయంలో ఎవరూ ఎంబసీకి, విమానాశ్రయానికి రావొద్దు’ అని కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. జెండాను కూడా తీసుకెళ్లిన అమెరికా అఫ్గానిస్తాన్‌లో అమెరికా రాయబారి రాస్ విల్సన్ కాబూల్‌లోని దౌత్య కార్యాలయాన్ని వదిలేసి ఆదివారం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఎంబసీపై ఎగురుతున్న అమెరికా జాతీయ జెండాను తొలిగించి మరీ వెంట తీసుకుపోయారు. కాగా రాయబార కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్లను అమెరికా సిబ్బంది దగ్ధం చేశారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు విషమిస్తుండడంతో అమెరికా ప్రభుత్వం మరో 1,000 మంది సైనికులను ఆదివారం కాబూల్‌కు తరలించింది. ఇప్పటికే అక్కడ ఉన్న తమ 4,000 మంది సైనికులకు సహకరించేందుకు వీరిని కువైట్ నుంచి తరలించినట్లు తెలిపింది. అధ్యక్ష భవనం స్వాధీనం అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రాజీనామా చేయడంతో అఫ్గాన్ అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కాబూల్‌లో అల్లర్లు, లూటీలు జరగకుండా నివారించడానికే తాలిబన్లు నగరంలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిదీన్ ప్రకటించారు. సైనిక దళాలు ఖాళీ చేసిన ఔట్‌పోస్టులను తాము స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందాలి్సన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆదివారం కాబూల్ శివార్లలో జరిగిన ఘర్షణల్లో 40 మంది గాయపడినట్లు తెలిసింది. -
అమెరికా బాంబులు వేయడానికి మేమే దొరికామా?
అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద బాంబు వేయడానికి కారణం ఉగ్రవాదుల అంతం కాదని, వాళ్ల వద్ద ఉన్న ప్రమాదకరమైన ఆయుధాలను పరీక్షించుకోడానికి వాళ్లు తమ దేశాన్ని ప్రయోగశాలలా వాడుకుంటున్నారని అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ మండిపడ్డారు. ’మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’గా చెప్పుకొనే అతిపెద్ద బాంబును అఫ్ఘానిస్థాన్ మీద అమెరికా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 36 మంది ఐసిస్ ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నారు. అయితే, ఇదంతా కేవలం సాకు మాత్రమేనన్నది కర్జాయ్ భావనలా కనిపిస్తోంది. ఈ బాంబు పేలుడు 11 టన్నుల టీఎన్టీ పేలుడుకు సమానమని సైనికరంగ నిపుణులు చెబుతున్నారు. పేలుడు వ్యాసార్థం దాదాపు మైలు పొడవుంటుందని కూడా అంటున్నారు. అయితే అసలు ఇది ఉగ్రవాదం మీద యుద్ధం కానే కాదని, ఈ బాంబు దాడిని తాను గట్టిగా ఖండిస్తున్నానని చెప్పారు. ఇది చాలా అమానవీయమైనదని, తమ దేశాన్ని వాళ్ల కొత్త, ప్రమాదకరమైన ఆయుధాలకు ప్రయోగ కేంద్రంగా ఉపయోగించుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇకనైనా అమెరికాను ఆపాల్సిన బాధ్యత అఫ్ఘాన్ ప్రజల మీదే ఉందని ట్వీట్ చేశారు. అయితే అమెరికా మాత్రం ఐసిస్ ఉగ్రవాదులను అంతం చేయాలంటే ఈ పెద్ద బాంబు (ఎంఓఏబీ)ని ప్రయోగించడం ఒక్కటే మార్గమని అంటోంది. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న లెక్క తమకు కచ్చితంగా తెలియదని పెంటగాన్ చెబుతుంటే, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఇది చాలా చాలా విజయవంతమైన ప్రయోగమని అభివర్ణించారు. అచిన్ ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులతో పోరాడుతున్న అఫ్ఘాన్, అమెరికన్ బలగాలకు ముప్పును వీలైనంత తగ్గించాలనే ఈ దాడి చేసినట్లు అమెరికా సైన్యం చెబుతోంది. I vehemently and in strongest words condemn the dropping of the latest weapon, the largest non-nuclear #bomb, on Afghanistan by US...1/2 — Hamid Karzai (@KarzaiH) 13 April 2017 2/2 military. This is not the war on terror but the inhuman and most brutal misuse of our country as testing ground for new and dangerous... — Hamid Karzai (@KarzaiH) 13 April 2017 2/3 weapons. It is upon us,Afghans, to stop the #USA. — Hamid Karzai (@KarzaiH) 13 April 2017 -
సర్జికల్ స్ట్రైక్స్ న్యాయమైనవి: హమీద్ కర్జాయ్
కాబూల్: ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆఫ్గనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సమర్థించారు. దేశ రక్షణ కోసం భారత్ చేపట్టిన సైనిక చర్య న్యాయమైనది అని శనివారం అయన మీడియాతో పేర్కొన్నారు. ఆఫ్గనిస్తాన్ సంవత్సరాలుగా ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని, ఇలాంటి మిలిటరీ ఆపరేషన్స్‌ను అందరికంటే ఎక్కువగా తాము అవసరంగా భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. సీమాంతర ఉగ్రవాదులపై దాడులు చేపట్టాల్సిందిగా అమెరికాను తాము పదేపదే కోరామని హమీద్ కర్జాయ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఉరీలోని సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిలో 19 మంది భారత సైనికులు మృతి చెందిన నేపథ్యంలో.. ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు దేశప్రజల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేకుల నుంచి మంచి స్పందన వస్తోంది. Indian Army's #SurgicalStrikes on terrorist sanctuaries is a justified step in order to defend their land: Former Afghan Pres. Hamid Karzai — ANI (@ANI_news) 1 October 2016 -
'ఐసిస్ ప్రమాదకర ఆయుధం'
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ లో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఆ దేశం నుంచి కార్యకలాపాలు సాగిస్తోన్న ఉగ్ర సంస్థల్ని అదుపుచేయడం లేదని అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ విమర్శించారు. అఫ్ఘాన్ లో ఉగ్రవాదం పెరుగుదల, ప్రాంతీయంగా ఆ దేశం పాత్రపై చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమ దేశంలో సాగుతున్న పరోక్ష యుద్ధంతో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. బలూచిస్తాన్‌పై మోదీ వ్యాఖ్యల్ని ఆహ్వానించారు. బలూచిస్తాన్ అంశాన్ని కొంతవరకూ తాము అర్థం చేసుకోవడం వల్ల ప్రధాని వ్యాఖ్యల్ని ప్రశంసిస్తున్నామని చెప్పారు. అఫ్ఘాన్ పునర్నిర్మాణంలో నిజాయతీగా భారత్ సహకరిస్తోందన్నారు. ప్రాంతీయ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఉగ్రవాదం అతిపెద్ద సవాలుగా మారిందని, దాన్ని ఓడించేందుకు ఉమ్మడిగా పోరాడాలని సూచించారు. చైనా కూడా మంచి పొరుగుదేశంగా ఉందని అయితే భారత్‌తో ఉన్నంత సన్నిహిత సంబంధాలు లేవన్నారు. నాలుగు ఎంఐ 25 హెలికాఫ్టర్లతో పాటు అఫ్ఘాన్ భద్రతా దళాలకు భారత్ శిక్షణ సాయం అందించిందని చెప్పారు. ఐసిస్ ప్రమాదకర ఆయుధమని, దాన్ని ప్రోత్సహిస్తోన్న వారికి వ్యతిరేకంగా అది పనిచేస్తుందని హెచ్చరించారు. -
ఉగ్రవాదం అంతంతోనే అభివృద్ధి
అఫ్గాన్ పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగం రూ. 600 కోట్లతో భారత్ నిర్మించిన పార్లమెంట్‌ను ప్రారంభించిన ప్రధాని కాబూల్: సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గినప్పుడే అఫ్గానిస్తాన్ అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల వెంట ముష్కర తండాలన్నీ మూతపడ్డప్పుడే ప్రగతి కనిపిస్తుందని స్పష్టంచేశారు. భారత్.. అఫ్గాన్ బంగరు భవితకు పునాదులు వేస్తుందని తప్ప అగ్నికి ఆజ్యం పోయదన్నారు. రూ.600 కోట్లు వెచ్చించి భారత్ నిర్మించిన అఫ్గాన్ కొత్త పార్లమెంట్ భవనాన్ని దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో కలిసి శుక్రవారం మోదీ ప్రారంభించారు. పార్లమెంట్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(శుక్రవారం ఆయన 91వ పుట్టినరోజు) పేరిట నిర్మించిన ‘అటల్ బ్లాక్’నూ ప్రారంభించారు. అనంతరం పార్లమెంట్లో సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. అఫ్గాన్‌లో భారత్ జోక్యంపై పాక్ అభ్యంతరాల పరోక్షంగా ప్రస్తావించారు. ‘మేం ఇక్కడ ఉండడం కొందరికి నచ్చడం లేదు. వారికి భారత్-అఫ్గాన్ మైత్రి బలపడడం నచ్చక ఇబ్బంది పడుతున్నారు’ అని అన్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం పూర్తిగా సమసిపోయినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందంటూ సరిహద్దుల్లో పాక్ ముష్కరుల కార్యకలాపాలను ఎత్తిచూపారు. ఎవరో చెప్పిన మాటలు వినకుండా భారత్‌పై నమ్మకం పెట్టుకున్న అఫ్గాన్ ప్రజలకు శెల్యూట్ చేస్తున్నానని అన్నారు. ‘మీరు మా నిజాయితీని, చిత్తశుద్ధిని ఏమాత్రం అనుమానించలేదు. చెప్పింది వినలేదు.. కళ్లారా చూసిందే నమ్మారు’ అని అన్నారు. ‘మీ త్యాగాలు వృథా కారాదు. మీ ఆశాజ్యోతి ఆరిపోవొద్దు. సంక్షుభిత పరిస్థితులు మళ్లీ వద్దు. అందరం కలిసి కష్టాలు, కన్నీళ్లకు చోటులేని కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుందాం. మీ దేశ భవిష్యత్తు నిర్మాణంలో సాయపడతాం’ అని ఉద్ఘాటించారు. అఫ్గాన్, దక్షిణాసియాను అనుసంధానించే వారధిలా పాకిస్తాన్ ఉండాలన్నారు. కాబూలీవాలా మరోసారి భారత ప్రజల మనసు గెల్చుకోవడానికి రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 500 మందికి ఉపకార వేతనాలు అఫ్గాన్ ఆర్మీలో పనిచేస్తూ అమరులైన జవాన్ల కుటుంబాలకు భారత్ స్నేహహస్తం చాచింది. ఆ కుటుంబాలకు చెందిన 500 మంది పిల్లల చదువులకు ఉపకార వేతనాలు అందిస్తామని మోదీ ప్రకటించారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు భద్రత అంశాలపై వారిరువురు మోదీ.. ఘనీతో చర్చించారు. అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) అబ్దుల్లా అబ్దుల్లాతో కూడా మోదీ భేటీ అయ్యారు. మోదీ రష్యా నుంచి శుక్రవారం వేకువజామునే కాబూల్‌కు చేరుకున్నారు. -
ఆత్మాహుతి దాడిలో కర్జాయ్ సోదరుడి మృతి
కాబూల్: రంజాన్ పండుగనాడు ఓ ముష్కరుడి ఆత్మాహుతి దాడితో అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కాందహార్ రాష్ట్రంలోని కర్జ్ జిల్లాలో మంగళవారం మానవ బాంబర్ జరిపిన దాడిలో కర్జాయ్‌కి వరుసకు సోదరుడు, ఆయనకు గట్టి మద్దతుదారుడైన హష్మత్ ఖలీల్ కర్జాయ్ మృతిచెందారు. రంజాన్ ప్రార్థన తర్వాత హష్మత్‌కు శుభాకాంక్షలు తెలపడానికి ఆయన ఇంటికొచ్చిన బాంబర్ ఆయనతో కరచాలనం చేసి, తన తలపాగాలో దాచిన బాంబులను పేల్చేసుకున్నాడు. 2011 సెప్టెంబర్‌లో అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు రబ్బానీ కూడా అచ్చం ఇలాంటి దాడిలోనే చనిపోయారు. ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీని నిర్వహిస్తున్న హష్మత్ కర్జాయ్ దేశాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మాజీ ఆర్థిక మంత్రి అషఫ్ ్రఘనీ అహ్మద్‌జాయ్‌కి మద్దతిస్తున్నారు. హమీద్ సవతి సోదరుడు అహ్మద్ వలీ 2011లో తన అంగరక్షకుడి దాడిలో చనిపోయాడు. -
శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చి ...
కాబూల్: ఆత్మాహుతి దాడిలో ఆఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హామీద్ కర్జాయి సోదరుడు హస్మత్ కర్జాయి మంగళవారం మరణించాడు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో యువకులు కందహార్లోని హస్మత్ నివాసానికి వచ్చారు. ఆ క్రమంలో వారికి హస్మత్... రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారీగా పేలుడు పదార్థాలతో అక్కడికి వచ్చిన వ్యక్తి తనకు తాను పేల్చివేసుకున్నాడు. దాంతో హస్మత్తోపాటు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన పలువురు మృతి చెందారని ప్రోవెన్షియల్ గవర్నర్ అధికార ప్రతినిధి దవఖాన్ మణిపాల్ వెల్లడించారు. ఇటీవలే ఆఫ్ఘానిస్థాన్ దేశ అధ్యక్షుడి పదవికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ఫలితాలు వెలువడవలసి ఉంది. ఆయితే ఆ దేశాధ్యక్ష పదవి నుంచి హామీద్ కర్జాయి తప్పుకోనున్నారు. -
ఓటేస్తే వేలు తీసేశారు!
అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల క్రూరత్వం కాబూల్: దేశం, పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కీలకమైన అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయాలని అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఇచ్చిన పిలుపుతో ప్రజలు స్పందించారు. మొత్తం 1.35 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 52 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే మరోవైపు ఓటేస్తే దాడి చేస్తాం అంటూ తాలిబన్ ఉగ్రవాదులు చేసిన హెచ్చరికలు తీవ్ర ప్రభావం చూపించాయి. వారు అన్నట్లుగానే హీరట్ రాష్ట్రంలో ఓటు వేసినట్లు సిరా గుర్తు ఉన్న 11 మంది పౌరుల చేతివేళ్లను శనివారం నరికివేశారు. -
సార్క్ దేశాధినేతలతో మోడీ చర్చలు
అఫ్ఘాన్ అధ్యక్షుడితో తొలి భేటీ ఆ దేశ పునర్నిర్మాణం, ఉగ్రవాదంపై చర్చ న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోడీ మంగళవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి ద్వైపాక్షిక చర్చలను అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో జరిపారు. తన ప్రమాణస్వీకారానికి హాజరైన అంతర్జాతీయ నేతలతో చర్చల్లో భాగంగా ఇక్కడి హైదరాబాద్ హౌజ్‌లో కర్జాయ్‌తో మోడీ అరగంట పాటు భేటీ అయ్యారు. అఫ్ఘాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సహకారం పెంపొందించుకోవడంపైనే ప్రధానంగా చర్చించారు. అలాగే హెరాత్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి అంశం కూడా చర్చకు వచ్చింది. అది నిషేధిత లష్కరే తోయిబా సంస్థ పనేనని కర్జాయ్ వెల్లడించినట్లు సమాచారం. అయితే దాడిని ఎదుర్కొనడంలో అఫ్ఘాన్ దళాలు సహకరించినందుకు కర్జాయ్‌కి మోడీ కృతజ్ఞతలు తెలిపారు. అఫ్ఘాన్ పునర్నిర్మాణం, అభివృద్ధికి భారత్ పాటుపడుతుందని మోడీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ తర్వాత మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ అబ్దుల్ గయూం, శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ షిరిన్ శర్మిన్తోనూ మోడీ భేటీ అయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, పలు రంగాల్లో సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయి.‘ప్రతి సమావేశంలోనూ సార్క్ స్వరూపం, దాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపైనే మోడీ మాట్లాడారు. సార్క్‌లోని ప్రతి సభ్య దేశానికీ తనదైన ప్రత్యేక బలాలు, అవకాశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవాలని మోడీ సూచించారు’ అని సుజాతా సింగ్ పేర్కొన్నారు. ఇందుకు సార్క్ దేశాధినేతల నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి హాజరైనందుకు విదేశీ అతిథులందరికీ మోడీ కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. -
సార్క్ దేశాధినేతలతో నరేంద్ర మోడీ భేటీ
న్యూఢిల్లీ : ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సార్క్ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్‌తో కలిసి ఆయన ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇక మోడీ వెంట విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఉన్నారు. -
ఢిల్లీ చేరుకున్న నవాజ్,హమిద్
-
'అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దు'
అమెరికాకు అఫ్ఘాన్ అధ్యక్షుడు కర్జాయ్ స్పష్టీకరణ కాందహర్: తమ దేశంలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా, దాని మిత్రపక్షాలు జోక్యం కలుగజేసుకోవద్దని ఆఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 5న ఆఫ్ఘానిస్థాన్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దైపాక్షిక రక్షణ ఒప్పందానికి సంబంధించి అమెరికా-ఆఫ్ఘానిస్థాన్ మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో కర్జాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శనివారం ఆఫ్ఘాన్‌లో మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కాందహర్లో ప్రారంభించారు. భారత ఆర్థిక సాయంతో నిర్మించిన ఈ వర్సిటీని భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌తో కలసి కర్జాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్జాయ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎన్నికలు నిస్పక్షపాతంగా.. పారదర్శకంగా నిర్వహిస్తుందని, అమెరికా, దాని మిత్ర పక్షాలు ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకోరాదని, ఆఫ్ఘాన్ ప్రజలు స్వచ్చంధంగా ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించాలని కోరారు. 2014 తర్వాత పరిమిత స్థాయిలో నాటో దళాలు ఆఫ్ఘానిస్థాన్‌లో ఉండేందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే అవి ఆఫ్ఘాన్‌కు మద్దతుగా ఉండాలనేదే తమ అభిమతమని చెప్పారు. ఆఫ్ఘాన్‌లో శాంతి కొనసాగాలంటే అమెరికా, పాకిస్థాన్‌ల సహకారం తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. -
అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా జోక్యం వద్దు:కర్జాయ్
కాందహార్: తమ దేశంలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలని ఆఫ్ఘాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్పష్టం చేశాడు. త్వరలో ఆఫ్ఘాన్ లో అధ్యక్ష ఎన్నికలు జరుగునున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికా గానీ, దాని మిత్రపక్షాలు జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలని కర్జాయ్ సూచించారు. రెండు నెలల పాటు జరిగే ఎన్నికల ప్రచారం ఇప్పటికే ఆరంభమైనందున ఎవరు జోక్యాలు అవసరంలేదన్నారు. అధ్యక్ష ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన సృష్టం చేశారు. ఏప్రిల్ 5 న జరిగే అధ్యక్ష ఎన్నికలకు అమెరికా దూరంగా ఉండి, ఓటింగ్ ప్రశాంతంగా జరగడానికి దోహదపడగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
అఫ్ఘాన్‌లో ఆపదమొక్కులు!
అఫ్ఘానిస్థాన్‌లో ఎలాగైనా ఎన్నికలను నిర్వహించి, అక్కడ తమ సైన్యాన్ని నిలిపి ఉంచగలిగేలా కొత్త ప్రభుత్వంతో ఒప్పందం కోసం అమెరికా ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు కర్జాయ్ 2014 తదుపరి కొత్త ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య మధ్యవర్తిగా నిలవాలని యత్నిస్తున్నారు. దీంతో అఫ్ఘాన్‌లో అమెరికా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ‘తప్పుల నుంచి నేర్చుకునే వాడివైతే అసలు ఓడిపోయేవాడివే కావు’ అని అంటే అన్నారేమో. అమెరికాకు అది వర్తించాలని లేదు. తప్పులు చేయడమే తప్ప నేర్చుకోవడమన్నది ఎరగని అమెరికా తప్పులు చేస్తూనే గెలిచి చూపించగలనని అఫ్ఘానిస్థాన్‌లో రుజువు చేసి చూపిస్తానంటోంది. ఏప్రిల్ 5న జరగనున్న అఫ్ఘాన్ ఎన్నికల బరిలోకి దిగిన ఐదుగురు ప్రధాన అభ్యర్థుల మధ్యన ఈ నెల 4న టీవీ చర్చ జరిగింది. తాలిబన్లకు, నాటో బలగాలకు మధ్య యుద్ధం సాగుతుండగానే, బాంబు దాడులు, ఆత్మాహుతి దాడుల విధ్వంస కాండ జోరు తగ్గకుండానే ఎన్నికలేమిటి? అని అనుమానం అక్కర్లేదు. అమెరికా తలిస్తే ఏమైనా జరుగుతుంది. అధ్యక్ష అభ్యర్థులు విడి విడిగా ఎవరు ఏం మట్లాడినా అంతా ఒక్క గొంతుకతో చెప్పింది ఒక్కటే. అమెరికాతో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుని, దాని సేనలను నిలిపి ఉంచుతామని. ఆ ఒప్పందం కోసమే అమెరికా, అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కాళ్లూ, గడ్డం పట్టి ఒప్పించాలని తంటాలు పడింది. 13 ఏళ్లుగా యుద్ధం సాగిస్తున్న తాలిబన్ ‘ఉగ్రవాదు’లతో సయోధ్య కోసం నానా అగచాట్లు పడింది అందుకోసమే. అదంతా వృధా ప్రయాసే అయినా... కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు పుడ తాడన్నట్టు జరిగింది. రేపు ఎవరు అధ్యక్షులైనా అమెరికా ‘రక్షణ’ను కోరేవారే కావడానికి మించి దానికి కావాల్సింది ఏముంది. అమెరికా ఆశీర్వాద ‘బలం’తో 2001లో దేశాధ్యక్షుడైన ఒకప్పటి అనామకుడు కర్జాయ్ గతి ఏమిటి? ఆయన ఏ అథోగతి పాలైనా అమెరికాకు చింతలేదు. కానీ అధ్యక్ష భవనంలోనే రక్షణ లేక బిక్కుబిక్కుమని బతికే ఆయన కాబూల్‌లో నిర్మిస్తున్న భారీ నివాస భవనం అమెరికా కంటికి కనుకు లేకుండా చేస్తోంది. ఏప్రిల్ తర్వాత దేశం విడిచి పారిపోవడానికి బదులుగా ఆయన అఫ్ఘాన్ రాజకీయాల్లో సూత్రధారిగానో లేక అధికారానికి అతి సన్నిహితునిగానో ఉండగలనని విశ్వసిస్తున్నారని దాని అర్థం. కర్జాయ్ ‘మధ్యవర్తి’ అవతారం అఫ్ఘాన్ ‘వాతావరణ పరిస్థితుల’ను అంచనా కట్టడంలో కర్జాయ్‌ని మించిన వారు లేరు. అమెరికా, నాటో బలగాల సత్తా ఏ పాటిదో కర్జాయ్ 2007లోనే గ్రహించారు. అమెరికాతో ఎలాంటి రక్షణ ఒప్పందాన్నైనా తిరస్కరిస్తామన్న తాలిబన్ల వైఖరికి అనుగుణంగానే ఆయన దానితో ద్వైపాక్షిక రక్ష ణ ఒప్పందాన్ని ‘ఆమోదించారు.’ దానిపై సంతకాలు చేసే సర్వాధికారాలున్నా కొత్త అధ్యక్షుడే ఆ పని చేస్తాడంటూ తిరకాసు పెట్టారు. తాలిబన్లతో అమెరికా సాగించిన ఏకపక్ష చర్చలపై కన్నెర్ర చేసిన కర్జాయ్ ఏకపక్షంగా తాలిబన్లతో చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల తదుపరి లేదా ఈ ఏడాది చివరికి అమెరికా సేనల ఉపసంహరణ జరిగాక కొత్త ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య మధ్యవర్తిగా నిలవాలని ఆయన భావిస్తున్నారు. కర్జాయ్ తాలిబన్లతో రహస్యంగా చర్చలు జరుపుతుండటం నిజమేనని అమెరికా ప్రభుత్వ అధికారిక ప్రతినిధులు ఫిబ్రవరి 3న అంగీకరించారు. ‘ఈ చర్చలను మేం వ్యతిరేకిస్తున్నామనడం సరైనది కాదు’ అని అసత్యం చెప్పారు. అదే రోజున అధ్యక్షుడు బరాక్ ఒబామా అఫ్ఘాన్‌లోని తమ సేనాధిపతి జనరల్ జోసెఫ్ డన్ఫోర్డ్, రక్షణ మంత్రి చుక్ హ్యాగెల్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్టిన్ డెంప్సీలతో సమావేశమయ్యారు. త్వరలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో కుదుర్చుకోబోయే ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కాపాడుకోవడమెలాగని వ్యూహ రచన గురించి చర్చించారు. జరుగుతాయో లేదో తెలియని ఎన్నికలు, ఆ తదుపరి ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కుతారో తెలియకముందే వారితో కుదుర్చోకోబోయే ఒప్పందం, దానికి ఇప్పుడే ముప్పు వచ్చి పడ్డం, దాన్ని కాపాడుకోడానికి వ్యూహం! అఫ్ఘాన్‌తో ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుని 2014 తర్వాత అక్కడ కనీసం 10,000 సైన్యాన్ని నిలిపి ఉంచాలని అమెరికా భావిస్తోంది. సేనలను పూర్తిగా ఉపసంహరించడానికి ముందు అమెరికాతో ఒప్పందం కాదుగదా, చర్చలు సైతం వీల్లేదని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలను జరగనిచ్చేది లేదని, రక్తపాతం తప్పదని పదేపదే హెచ్చరిస్తున్నారు. చేసి చూపిస్తున్నారు. కానీ తుపాకులతో ఎలాగోలా ఎన్నికలు జరిగాయనిపించేసి, ఎవరో ఒకరికి అధ్యక్ష పీఠం కట్టబెట్టేసి ఒప్పందంపై సంతకాలు పెట్టించేయాలనే వ్యూహం ఎప్పుడో తయారు చేశారు. తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని, అది చేసుకునే ఒప్పందాలను తిరస్కరిస్తారని, తాలిబన్లతో పోరు కొనసాగక తప్పదని కూడా ముందే తెలుసు. ఇంకా కొత్తగా వచ్చే ముప్పేమిటి? కర్జాయ్ ‘మధ్యవర్తి’ అవతారానికి ముస్తాబవుతుండటమే! తాలిబన్లతో రహస్య మంతనాలు కొలిక్కి వస్తే కర్జాయ్ మధ్యవర్తిగా మారతారు. తాలిబన్లతో సయోధ్య కోసం కొత్త ప్రభుత్వం అమెరికాతో ఒప్పందాన్నిన రద్దు చేసుకునే త్యాగం చేయక తప్పదని ఒప్పిస్తారనే భయం ఇప్పుడు అమెరికాను పట్టి పీడిస్తోంది. చేతికి, నోటికి మధ్య అతి పెద్ద అగాధంగా కర్జాయ్ మారగలరని అమెరికా ఊహించలేదు. కథ అడ్డం తిరిగింది కాబట్టి త్రిమూర్తులతో అధ్యక్షుని సమావేశం తదుపరి విడుదల చేసిన అధికారిక ప్రకటన ‘2014 తర్వాత అఫ్ఘాన్‌లో అమెరికా పాత్రపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు’ అని ముక్తసరిగా ముగించింది. తాలిబన్ రాజ్యం నాటో బలగాలు తాలిబన్లపై పైచేయి సాధించలేవని అమెరికా కంటే చాలా ముందుగా 2007లోనే కర్జాయ్ గ్రహించారు. సంప్రదాయకమైన పాకిస్థాన్ వ్యతిరేక వైఖరిని చేపట్టారు. ఒకవంక అమెరికాతో నెయ్యం సాగిస్తూనే పాక్‌లోని వాయవ్య ప్రాంతంలోని తెగల ప్రాంతంలోని పష్తూన్ల దుస్థితిపై ధ్వజమెత్తారు. అఫ్ఘాన్, పాక్‌లలో ఉన్న ఫష్తూ ప్రజల ఐక్యతను చాటే పష్తూన్ దినోత్సవాన్ని అట్టహాసంగా జరపడం ప్రారంభించారు. ఒప్పందానికి మోకాలడ్డి అమెరికా వ్యతిరేకి గుర్తింపు కోసం పాకులాడుతున్నారు. గత డిసెంబర్లో అమెరికా రక్షణ మంత్రి హ్యాగెల్ అఫ్ఘాన్ పర్యటనకు వచ్చి వెళ్లిన వెంటనే ఆయన హఠాత్తుగా ఇరాన్‌కు వెళ్లి అధ్యక్షుడు హస్సన్ రుహానీతో రహస్య మంతనాలు సాగించారు. ప్రస్తుతం అమెరికా, నాటోల బలగాలు ముమ్మరంగా సైనిక చర్యలు సాగిస్తున్న పర్వాన్ రాష్ట్రంలో వందల మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసి అమెరికాకు పుండు మీద కారం రాసినంత పని చేశారు. గత ముప్పయ్యేళ్లుగా రెండు అగ్రరాజ్యాలు రష్యా, అమెరికాలతో పాటూ పాకిస్థాన్ కూడా అఫ్ఘాన్ లో నెత్తుటి విధ్వంస క్రీడను సాగించింది. అది మెజారిటీ జాతి పష్తూన్లలో బలంగా నాటుకుపోయింది. 2014 తర్వాతి అఫ్ఘాన్‌కు అంతర్గతంగా తాలిబన్ల నుంచి ముప్పు కంటే బయటి నుంచే ముప్పే ఎక్కువని చాలా మంది అఫ్ఘాన్లలాగే కర్జాయ్ కూడా భావిస్తున్నారు. ఇరాన్, చైనా, భారత్‌లలో ఎవరితో వ్యూహాత్మక బంధం లాభసాటి అనే విషయాన్ని అతి జాగ్రత్తగా బేరీజు వేస్తున్నారు. దక్షిణ ఆసియాలో అత్యంత దౌత్య చాతుర్యం ప్రదర్శిస్తున్న నేత కర్జాయేననడంలో సందేహం లేదు. తాలిబన్లు ఆయన ఎత్తుగడలను వ్యతిరేకించడం లేదు. సమర్థిస్తున్నట్టు కనిపిస్తున్నారు. అలా అని 2014 తర్వాతికి ఆయన రూపొం దిస్తున్న ‘శాంతి’ పథకం ప్రకారం నడవాలని భావిస్తున్న దాఖలాలు లేవు. అతి తెలివిగా ఆయన్ను వాడుకోవాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత తాలిబన్, అల్‌కాయిదా ఎత్తుగడలను కర్జాయ్ కంటే బాగా బుష్, ఒబామా ప్రభుత్వాల్లో రక్షణ మంత్రిగా పనిచేసిన రాబర్ట్ గేట్స్ అర్థం చేసుకున్నట్టుంది. ‘శత్రువులు (తాలిబన్లు) ఇప్పుడు ఏమీ చేయనవసరం లేదు. కేవలం వేచి చూస్తే సరిపోతుంది.’ అమెరికా బలగాల నిష్ర్కమణ ప్రకటన వారికి కొత్త ఊపిరులూదిందని గేట్స్ భావిస్తున్నారు. ‘అఫ్ఘాన్‌లో ఓటమి పాలైనామన్న అపప్రథ’ను అల్‌కాయిదా తనకు అనుకూలంగా మలుచుకొని మధ్యప్రాచ్యంలో చెలరేగిపోతోందని వాపోయారు. ఏది ఏమైనా 2014 తర్వాతి తాలిబన్ల పాలనను అందరూ కలిసి ఇప్పుడే అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం అఫ్ఘాన్ పార్లమెంటు ముందున్న ఒక చట్టం ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అది ఆమోదం పొందితే అఫ్ఘాన్ పురుషులకు తమ బంధువులైన మహిళలను హింసించే, అత్యాచారం చేసే హక్కులు లభిస్తాయి. అయినా కొత్త చట్టాలతో పనేముంది? అత్యాచారాలకు గురైన మహిళలను వ్యభిచార నేరం కింద శిక్షించి హంతకులకు వేసే శిక్షల కంటే కఠిన శిక్షలను విధిస్తూనే ఉన్నారు. 1917లోనే 18 ఏళ్ల లోపు వివాహాలను, బురఖాలను నిషేధించిన దేశంలో పాతికేళ్ల అమెరికా జోక్యం సాధించిన ప్రగతి ఇది. - పిళ్లా వెంకటేశ్వరరావు -
ఏదీ అఫ్ఘాన్ శాంతి తీరం?
‘శాంతి చర్చల’ ప్రహసనానికి తెరదించిన అమెరికా... అధ్యక్ష ఎన్నికల కోసం ఎదురు చూస్తోంది. కొత్త అధ్యక్షుడైనా తమ మాట వింటాడని దాని ఆశ. ఆలూ లేదూ చూలూ లేదూ... అంటారే సరిగ్గా అలా ఉంది అఫ్ఘానిస్థాన్ అధ్యక్ష ఎన్నికల సంరంభం. సెప్టెంబర్ 18-అక్టోబర్ 6 మధ్య నామినేషన్లకు గడువు ముగిసిపోవడమే కాదు, అర్హులుగా బరిలో నిలిచిన వారి జాబితా కూడా ఖరారైంది. యుద్ధ ప్రభువులు, మాజీ మంత్రులుసహా అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సోదరుడు ఖయూం కర్జాయ్ కూడా పోటీపడుతున్న పది మందిలో ఉన్నారు. ఇంతకూ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న జరగాల్సిన ఎన్నికలు అసలు జరుగుతాయా? ఎన్నికలను జరగనిచ్చేది లేదని తాలిబన్ల అధినేత ముల్లా మొహ్మద్ ఒమర్ సోమవారం హెచ్చరించారు. తాలిబన్లే కాదు ఏ మిలిటెంటు గ్రూపూ పాల్గొనని ఈ ఎన్నికల ప్రహసం జరిగినా... వచ్చే ఏడాది చివరికి అమెరికా సహా నాటో బలగాలన్నీ నిష్ర్కమించిన తదుపరి తాలిబన్లను ఎదుర్కొని కొత్త ప్రభుత్వం నిలవగలదా? 2014 తర్వాత ‘శిక్షణ అవసరాల కోసం’ అమెరికా సేనలను నిలిపి ఉంచడానికి అవకాశం కల్పించే ‘అమెరికా-అఫ్ఘాన్ ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని’ కుదుర్చుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఇటీవల అఫ్ఘాన్‌కు వెళ్లారు. అక్టోబర్ 11-12 తేదీల్లో ఆయన కర్జాయ్‌తో చర్చలు జరిపారు. ప్రధానాంశాలన్నిటిపైన ‘అంగీకారం’ కుదిరిందని కెర్రీ ప్రకటించారు. ఏ అంశాలపై అంగీకారం కుదిరిందో, ఆ ఒప్పందంలో అసలు ఏముందో వెల్లడించ లేదు. కెర్రీ దౌత్య విజయం ఎంతటి ఘనమైనదో... పత్రికా సమావేశంలో సైతం కాసింత నవ్వును పులుముకోలేకపోయిన ఆ ఇద్దరి మొహాలే వెల్లడించాయి. అవినీతిపరుడు, నమ్మరానివాడు అయిన కర్జాయ్ మొండి పట్టు వల్లనే చర్చలు విఫలమయ్యాయనేది అమెరికా ప్రభుత్వ అనధికారిక కథనం. కర్జాయ్ ‘మొండి పట్టు’ దేనిపైన? 2014 తర్వాత అఫ్ఘాన్‌లో ఉంచే అమెరికా సేనలకు అఫ్ఘాన్ చట్టాలు వర్తించకుండా ‘రక్షణ’ కల్పించడంపైన. ఆ రక్షణ లేనిదే తమ సేనలను నిలపడం అసాధ్యమని అమెరికా అంటోంది. అమెరికా తయారు చేసిన అఫ్ఘాన్ భద్రతా బలగాల ఉన్నత సైనికాధికారుల మండలి సైతం అధ్యక్షుని మొండి పట్టు వల్లనే ఒప్పందం కుదరలేదని అంటోంది. అమెరికా అండ లేకుంటే ఇరాన్, పాకిస్థాన్‌ల నుంచి ‘జాతీయ భద్రత’కు ముప్పు తప్పదని వారి వాదన. లేని విదేశీ ముప్పును చూడగలుగుతున్న సైనికాధికార మండలికి ఉన్న అసలు ముప్పు కనిపించకపోవడంలో ఆశ్చర్యం లేదు. 2001లో అమెరికా దురాక్రమణతో అధికారం కోల్పోయిన నాటి కంటే నేడు తాలిబన్ల బలం అనేక రెట్లు పెరిగిందని, వారి ప్రాబల్యం దేశమంతటికీ విస్తరించిందని అంతా అంగీకరించేదే. ఏడాదికి 50 వేల మంది సైనికులు పారిపోయే సైన్యంపై ఆధారపడి ఏ ప్రభుత్వానికైనా, అసలు తమకే అయినా ముప్పు తప్పదనేదే వారి నిజమైన ఆందోళన. సైన్యం నుంచి పారిపోతున్న వారిలో చాలామంది తాలిబన్లలో చేరుతున్నారనేది వేరే సంగతి. కర్జాయ్ అవినీతిపరుడు నిజమేగానీ అఫ్ఘాన్‌ను అవినీతిమయం చేసిన ఖ్యాతి అమెరికాదే. కర్జాయ్‌కి అది డబ్బు సంచులను చేరవేస్తున్న విషయం కూడా రచ్చకెక్కింది. ఎంత డబ్బు పోసినా కర్జాయ్‌ని పూర్తిగా కొనేయలేకపోయామనేదే అమెరికా బాధ. అమెరికా సేనలకు ‘రక్షణ’ అఫ్ఘాన్ ప్రభుత్వ అధికారాల పరిధిలోనిది కాదని, వచ్చే నెల్లో జరుగనున్న తెగల పెద్దల మండలి సమావేశం... ‘లోయా జిర్గా’ మాత్రమే ఆ సమస్యపై నిర్ణయం తీసుకోగలదని కర్జాయ్ వాదన. ఆయన మొండితనం ఏదన్నా ఉందంటే అది అమెరికా చెప్పినట్టు వినకపోవడమే. కర్జాయ్‌తో గత ఏడాది కుదుర్చుకున్న ‘వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని’ నేడు గౌరవించని అమెరికాను కర్జాయ్ ఎందుకు నమ్మాలి? ఆ ఒప్పందం ప్రకారం తమ సైనిక నిర్బంధ కేంద్రాల్లో ఉన్న బందీలనందరినీ వెంటనే అఫ్ఘాన్ దళాలకు బదలాయించాల్సి ఉన్నా అమెరికా ససేమిరా అంటోంది. అమెరికాతో కుదుర్చుకునే ఎలాంటి ఒప్పందాన్నీ అంగీరించేది లేదని కెర్రీ పర్యటనకు ముందే ముల్లా ఒమర్ ప్రకటించారు. అఫ్ఘాన్ అధ్యక్షునితో సైతం సంబంధం లేకుండా తాలిబన్లతో చర్చల కోసం నానా పాట్లూ పడ్డ బరాక్ ఒబామా ప్రభుత్వమే వారితో సయోధ్య కోసం కర్జాయ్ స్వయంగా చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించిం ది. కర్జాయ్ ప్రభుత్వంతో రహస్య దౌత్యం సాగిస్తున్న సీనియర్ తాలిబన్ నేత లతీఫ్ మెహసూద్‌ను అమెరికా అరెస్టు చేసింది. ఘోర పరాజయంతో అఫ్ఘాన్ నుంచి నిష్ర్కమిస్తున్నట్టు అనిపించకుండా పరువు దక్కించుకునేలా ఏదో ఒక ఒప్పందం కోసం, తమ సేనలను నిలిపి ఉంచే అవకాశం కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవంక రష్యా 2014 తదుపరి అఫ్ఘాన్ నుంచి తమ దేశానికి విస్తరించనున్న జిహాదీ ముప్పును ఎదుర్కోడానికి సిద్ధమౌతోంది. అఫ్ఘాన్‌కు పొరుగు నున్న తజకిస్థాన్‌తో ఇటీవలే అది 40 ఏళ్ల పాటూ ఆ దేశంలో తమ సేనలను నిలిపి ఉంచడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అఫ్ఘాన్ ‘శాంతి చర్చల’ ప్రహసనానికి తెరదించిన అమెరికా... అధ్యక్ష ఎన్నికల ప్రహసనం కోసం ఎదురు చూస్తున్నట్టుంది. కర్జాయ్ తదుపరి అధ్యక్షుడైనా అమెరికా మాట వింటాడని దాని ఆశ. తాలిబన్లు ఈ క్రీడను చూస్తూ ఉంటార నే భ్రమ. - పిళ్లా వెంకటేశ్వరరావు -
మారుతున్న ‘శాంతి’ సమీకరణలు
మన దేశంలో పర్యటనకు ముందే కర్జాయ్ ‘తలరాత’ మారిపోయిన సంగతి మన విదేశాంగ శాఖకు పట్టలేదు. కాబట్టే కర్జాయ్ పర్యటనకు అనవసర ప్రాధాన్యం ఇచ్చి, ప్రధాని మన్మోహన్సింగ్ ఆయనతో రహస్య సమాలోచన సాగించారు. పాకిస్థాన్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ విశ్లేషకులందరి అంచనాలను తలకిందులు చేశారు. 1999లో నవాజ్ ప్రభుత్వాన్ని కూలదోసిన మాజీ సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్‌పై ప్రతీకారాన్ని తీర్చుకోడానికి యత్నించకపోవచ్చని అంతా ఊహాగానాలు చేశారు. ముషార్రఫ్‌ను ఏదో ఒక విధంగా దేశం విడిచిపోయేలా చేయడమే నవాజ్‌కు, పాక్ ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమని సూచించారు. పాక్ చరిత్రలో మొదటిసారిగా ఒక మాజీ జనరల్‌పై పౌర ప్రభుత్వం క్రిమినల్ నేరారోపణలను చేయడం, విచారించడం సైనిక వ్యవస్థకు మింగుడు పడదని అంచనా వేశారు. ముషార్రఫ్‌ను అవమానించడానికి యత్నిస్తే సహించేదిలేదని ఆయన పాక్ గడ్డపై కాలుపెట్టినప్పుడే మాజీ ఆర్మీ చీఫ్‌లు ప్రకటించారు. అది నిజానికి ఆర్మీ చీఫ్ అష్ఫాక్ కయానీ హెచ్చరికేనని అందరికీ తెలిసిందే. అయినా నవాజ్ ముషార్రఫ్‌పై మరణశిక్ష విధించదగిన దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలను ఒక్కటొక్కటిగా చేయిస్తూ వస్తున్నారు. తాజాగా ముషార్రఫ్‌పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యానేరం ఆరోపణను మోపారు. కీలక రాజకీయ పాత్రధారిగా మారిన పాక్ న్యాయవ్యవస్థకు కూడా ముషార్రఫ్ అంటే కంటగింపే. కాబట్టి ముషార్రఫ్ తనకు తగినంత భద్రత కల్పించడం లేదని బెనజీర్ ఒక పాత్రికేయునికి రాసిన లేఖ ఒక్కదాని ఆధారంతోనే కోర్టు కేసు విచారణకు సిద్ధపడటంలో ఆశ్చర్యం లేదు. పైగా నవాజ్ భారత్‌తో సత్సంబంధాలను కోరుతున్నారు. 1999లో సరిగ్గా అందుకే ముషార్రఫ్ ఆయనపై ఆగ్రహించారు. కయానీకి ఈ పరిణామా లు మింగుడుపడతాయా? అందుకే పాక్ చరి త్రలో నాలుగో సైనిక తిరుగుబాటుకు తెరలేస్తున్నదేమోనని భయపడుతున్నారు. సరిహద్దుల్లోని ఇటీవలి ఘర్షణలు పాక్ సైన్యం ప్రేరేపిస్తున్నవేనని, నవాజ్ మాత్రం భారత్‌తో మైత్రికే ప్రాధాన్యం ఇస్తున్నారని తరచుగా వినవస్తోంది. అయితే మే నెలలో అఫ్ఘాన్ అధ్యక్షుడు మన దేశ పర్యటనకు రావడానికి ముందు నుంచి పాక్ సైన్యం ట్యాంకు లు, భారీ శతఘు్నలతో అఫ్ఘానిస్థాన్‌పై కాల్పు లు సాగిస్తోంది. అఫ్ఘాన్‌లోని హమీద్ కర్జాయ్ ప్రభుత్వంతో తప్ప అన్ని తాలిబన్, జిహాదీ గ్రూపులతోనూ పాక్ సైన్యానికి మంచి సంబంధాలున్నాయి. అందుకే పాక్ అఫ్ఘాన్‌లో కీలక పాత్రధారి. అమెరికా సైతం ఈ ఏడాది మొదటి నుంచి కర్జాయ్‌ను వదిలి, కయానీపై ఆధారపడుతోంది. కయానీ సహాయంతోనే రియాద్‌లో తాలిబన్లతో శాంతి చర్చలకు సన్నాహా లు చేస్తోంది. కాగా, రేపటి అఫ్ఘాన్‌లో భారత్ ప్రముఖ పాత్ర నిర్వహించనున్నదనే భ్రమలో మన దౌత్యనీతి బతుకుతోంది. అందుకే మన ప్రభుత్వం అఫ్ఘాన్‌లో రోడ్లు, ఆస్పత్రుల వంటి మౌలిక నిర్మాణాలపై 200 కోట్ల డాలర్లకుపైగా ఖర్చు చేసింది. అఫ్ఘాన్ పోలీసు బలగాలకు శిక్షణను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నదని మీడియా కథనం. అయితే మన దేశంలో పర్యటనకు ముందే కర్జాయ్ ‘తలరాత’ మారిపోయిన సంగతి మన విదేశాంగ శాఖకు పట్టలేదు. కాబట్టే కర్జాయ్ పర్యటనకు అనవసర ప్రాధాన్యం ఇచ్చి, ప్రధాని మన్మోహన్సింగ్ ఆయనతో రహస్య సమాలోచనలను సైతం సాగిం చారు. కర్జాయ్ భారీ శతఘు్నలు, యుద్ధ విమానాలు తదితర ఆయుధ సామాగ్రిని కోరారు. అవి పాక్ సరిహద్దులలో మోహరించడానికేనన్నది స్పష్టమే. అయినా గుర్తించలేని గుడ్డితనం కయానీకి లేదు. అఫ్ఘాన్-భారత్ సైనిక బంధమంటే పాక్‌ను చుట్టుముట్టడమేనని పాక్ సైన్యం భావిస్తున్నది. మన సరి హద్దుల్లోని తుపాకుల మోతకు, అఫ్ఘాన్ సరి హద్దుల్లోని శతఘు్నల ఘోషకు కారణం ఒక్కటే. ‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’ కోసం అమెరికా పాక్‌కు అందిస్తున్న భారీ ఆయుధ, ఆర్థిక సహాయాన్ని సైన్యం దారిమళ్లించి భార త వ్యతిరేక జిహాదీ ముఠాలకు చేరవేస్తోందనేది 2010లో రచ్చకెక్కింది. ఆ తదుపరి అమెరికా పాక్‌కు అందించే సైనిక సహాయం దారి మళ్లకుండా ఆయుధాలు, నిధులు ఉగ్రవాద వ్యతిరేక యుద్ధానికి అవసరమైనవి మాత్రమేనని ధృవీకరించే పద్ధతిని అమల్లోకి తెచ్చింది. నామమాత్రమైన ఆ ధృవీకరణను సైతం అమెరికా ఫిబ్రవరిలో కయానీ కోరిక మేరకు గుట్టు చప్పుడు కాకుండా ఎత్తేసింది. అమెరికా, కయానీల మధ్య కుదిరిన సయోధ్యను గుర్తించకుండానే మన విదేశాంగశాఖ అఫ్ఘాన్, పాక్ విధానాలను రూపొందించుకుంటోంది. అఫ్ఘాన్ యుద్ధం ప్రారంభంలో ముషార్రప్ అమెరికాకు ఎంతటి కీలక మిత్రుడో నేడు కయానీకూడా అంతే కీలక మిత్రుడు. అప్ఘాన్ యుద్ధం ముగింపు దశలో సైన్యం నవాజ్ ‘ధిక్కారాన్ని’ సహించడమంటే వారి మధ్య ‘అంగీకారం’ కుదిరిందనే అర్థం కావాలి. ఆ ‘అంగీకారం’ ముషార్రఫ్‌ను ఉరికంబానికి ఎక్కించవచ్చేమోగానీ భారత్ పట్ల ‘మెతక’ వైఖరిని కనపబరచదనే అర్థం. అలాంటి ‘అంగీకారం’ ఏదీలేకుంటే మనం మరో సైనిక కుట్రను చూడాల్సిరావొచ్చు. - పిళ్లా వెంకటేశ్వరరావు