
సర్జికల్ స్ట్రైక్స్ న్యాయమైనవి: హమీద్ కర్జాయ్
కాబూల్: ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆఫ్గనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ సమర్థించారు. దేశ రక్షణ కోసం భారత్ చేపట్టిన సైనిక చర్య న్యాయమైనది అని శనివారం అయన మీడియాతో పేర్కొన్నారు. ఆఫ్గనిస్తాన్ సంవత్సరాలుగా ఉగ్రవాద బాధిత దేశంగా ఉందని, ఇలాంటి మిలిటరీ ఆపరేషన్స్ను అందరికంటే ఎక్కువగా తాము అవసరంగా భావిస్తున్నామని ఆయన వెల్లడించారు.
సీమాంతర ఉగ్రవాదులపై దాడులు చేపట్టాల్సిందిగా అమెరికాను తాము పదేపదే కోరామని హమీద్ కర్జాయ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఉరీలోని సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడిలో 19 మంది భారత సైనికులు మృతి చెందిన నేపథ్యంలో.. ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్కు దేశప్రజల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
Indian Army's #SurgicalStrikes on terrorist sanctuaries is a justified step in order to defend their land: Former Afghan Pres. Hamid Karzai
— ANI (@ANI_news) 1 October 2016