కాందహార్: తమ దేశంలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలని ఆఫ్ఘాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్పష్టం చేశాడు. త్వరలో ఆఫ్ఘాన్ లో అధ్యక్ష ఎన్నికలు జరుగునున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికా గానీ, దాని మిత్రపక్షాలు జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలని కర్జాయ్ సూచించారు. రెండు నెలల పాటు జరిగే ఎన్నికల ప్రచారం ఇప్పటికే ఆరంభమైనందున ఎవరు జోక్యాలు అవసరంలేదన్నారు.
అధ్యక్ష ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన సృష్టం చేశారు. ఏప్రిల్ 5 న జరిగే అధ్యక్ష ఎన్నికలకు అమెరికా దూరంగా ఉండి, ఓటింగ్ ప్రశాంతంగా జరగడానికి దోహదపడగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.