
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో కాందహార్‌లోని షియా మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 32 మంది మరణించగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. షియాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment