
ప్రతీకాత్మక చిత్రం
కాబూల్: ఆఫ్గనిస్తాన్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. హరాత్-కాందహార్ జాతీయ రహదారిపై బాంబులతో విరుచుకుపడ్డాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో సుమారుగా 34 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
కాగా అఫ్గాన్ ప్రభుత్వం, దాని మిత్ర దేశాలకు తాలిబన్లకు జరుగుతున్న యుద్ధంతో... గత కొన్ని రోజులుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మంగళవారం తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మరణించగా.. మరో 23 మంది తీవ్రగాయాలపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment