వరంగల్ (కరీమాబాద్) : వరంగల్ జిల్లాలోని ఉరుసు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి శుక్రవారం కాంగ్రెస్ నాయకులు స్థానికులతో కలిసి తాళం వేశారు. వివరాల ప్రకారం.. ఉరుసు ఆసుపత్రి వరంగల్ జిల్లాలోని చంద్రకాంతయ్య మెమోరియల్ ఆసుపత్రికి అనుబంధంగా పనిచేస్తుంది.
ఈ ఉరుసు ఆసుపత్రిలో కొంతకాలంగా వైద్య సిబ్బంది లేరు. ప్రభుత్వాసుపత్రులను పరిశీలించడానికి ఢిల్లీ నుంచి ఎంసీఐ బృందం వస్తుండటంతో అధికారులు హుటాహుటిన డిప్యుటేషన్‌పై వెళ్లిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆసుపత్రికి తాళం వేసి తమ నిరసన తెలిపారు.