
ఘనంగా ఉరుసు మహోత్సవం
బొమ్మనహాళ్ : మండలంలోని దర్గాహోన్నూరు గ్రామంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రమైన సయ్యద్‌షా ఖాజా, సయ్యద్ షా సూఫి సర్మస్, హుసేన్ చిఫ్తి వారి ఉరుసు మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో ఫాతెషా ఆరాధన చేపట్టారు. అనంతరం స్వామివారికి భక్తులు చక్కెర, బెల్లం, గోధుమలను తులాభారంగా ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. బొమ్మనహాళ్ , కణేకల్ ఎస్‌ఐలు ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఉచిత వైద్యం, తాగునీరు సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.