ఘనంగా ఉరుస్ ఉత్సవం
ఘనంగా ఉరుస్ ఉత్సవం
Published Fri, Jan 20 2017 10:12 PM | Last Updated on Fri, Aug 24 2018 6:44 PM
పెద్దాపురం :
తొమ్మిది మూరల సాహెబ్ ఉరుస్ ఉత్సవం మత సామరస్యానికి ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక షేక్ హజరత్ పాచ్చా ఔలియా (తొమ్మిది మూరల సాహెబ్) సమాధి వద్ద శుక్రవారం నిర్వహించిన ఉరుస్ (గంధోత్సవాన్ని) ఉత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ముస్లిం పెద్దలు అబ్దుల్ గఫర్‌ఖాన్, ఎండీ లాయక్ అలీ, ఎంఎల్ అలీ నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, మున్సిపల్ చైర్మ¯ŒS రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ పట్టణాభివృద్ధితో పాటు దర్గా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎండీ సతార్ ఇంటి నుంచి గుర్రపు గంధాన్ని ఊరేగింపుగా సమాధి వద్దకు తీసుకు రాగా సాహెబ్ సమాధిపై గంధాన్ని పూసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మిమిక్రీ, మ్యూజికల్ నైట్, ఖవ్వాళి, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మ¯ŒS త్సలికి సత్యభాస్కర్, పరదేశి, బొడ్డు బంగారుబాబు, తూతిక రాజు, విరోధుల రాజేశ్వరరావు, విజ్జపు రాజశేఖర్, బేదంపూడి సత్తిబాబు, బాబూలాల్, రఫీ, జిలానీ, ఇర్షద్ అలీ, ఆరీఫ్ ఆలీ పాల్గొన్నారు.
Advertisement