బాహుబలం
మహానంది (శ్రీశైలం) బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ భారీ శివలింగాన్ని ఎత్తే సీన్ ప్రేక్షకాదరణ పొందింది. అది సినిమా.. నిజ నిజీవితంలో అలాంటి బాహుబలులు అరుదుగా తారసపడతారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో ఆదివారం ఇలాంటి వారు కనిపించారు. సయ్యద్ దస్తగిరిస్వామి ఉరుసు సందర్భంగా ఆదివారం పోటీలు నిర్వహించారు. రాతి గుండు(120 కేజీలు)ను అలవోకగా ఎత్తి శిరివెళ్లకు చెందిన ఉస్మాన్ ప్రథమ స్థానం, కొత్తపల్లె వెంకట లక్ష్మిరెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరికి బహుమతులు ప్రదానం చేశారు. అలాగే ఇసుక సంచి (105 కేజీలు)ని ఎత్తి హబీబుల్లాఖాన్ విజేతగా నిలిచారు. ఒక టైర్ బండిని లాగే పోటీలు ఆసక్తికరంగా సాగాయి.