
హతవిధీ...
ఉరుసు ఉత్సవాల్లో విషాదం ట్యాంక్ కూలి ఐదుగురి మృతి
రాయచూరు జిల్లా యాపలదిన్నె వద్ద ఘటన
మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్, మరొకరు తెలంగాణా వాసి
రాయచూరు రూరల్ : రాయచూరు జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలోని యాపలదిన్ని సమీపంలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన గ్రౌండ్‌లెవల్ మంచినీటి ట్యాంక్ గోడలు శనివారం కూలి ఐదుగురు వృుతి చెంఒదారు. వృుతులను రాయచూరు మడ్డిపేటకు చెందిన సురేశ్(29), దుర్గప్ప(60), తెలంగాణలోని గద్వాల తాలూకా, గట్టు మండల కేంద్రానికి చెందిన హుసేనప్ప(20), కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన షాహజాన్(40) ఒడిసాకు చెందిన జుమేల్(40)గా గుర్తించారు. హనుమంతు, శ్రీనివాస్‌లతో పాటు యమునమ్మ అనే బాలికకు గాయాలు కాగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు..యాపలదిన్నెకు రెండు కిలోమీటర్ల దూరంలో శుక్రవారం జంగ్లప్పస్వామి ఉరుసు ప్రారంభమైంది. తాలూకాతోపాటూ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా,పంజాబ్ తదితర ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పిచేందుకు రూ.3.50లక్షలతో గ్రౌండ్ లెవల్‌లో ట్యాంక్ ఏర్పాటుకు గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు పనులు చేపట్టారు. తూతూ మంత్రంగా13 రోజుల క్రితం పనులు పూర్తి చేశారు.ఈ క్రమంలో శనివారం భక్తులు ట్యాంక్ వద్ద సేదదీరుతుండగా ఉన్నఫళంగా గోడలు కూలిపోయాయి. దీంతో ఐదుగురు అక్కడికక్కడే వృుతి చెందారు. విషయం తెలుసుకున్నరాయచూరు ఏసీ మారుతి, ఎస్‌పీ నాగరాజ్, జెడ్పీ ఉపకార్యదర్శి ముక్కణ్ణ, టీపీ అధికారి శరణబసవలు ఘటనా స్థలానికి చేరుకోగా స్థానికులు ముట్టడించారు. నాసిరకం ఇసుక, సిమెంటు వినియోగించి రూ.90వేలతోనే నిర్మాణాలు పూర్తి చేశారని,దీంతో గోడలు కూలాయని ఆందోళనకారులు మండిపడ్డారు.
వృుతుల కుటుంబాలకు న్యాయం చేయాలని అరగంటపాటు బైఠాయించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కమిసన్లకు కుక్కిర్తి పడటం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటూ వృుతి చెందిన కుటుంబాలకు పరిహారం అందిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.ఇదిలా ఉండగా 15 రోజుల క్రితం కొప్పళ జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ ఘటన మరువక ముందే యాపలదిన్నెలో ఐదుగురు వృుతి చెందడం స్థానికులను కలచివేస్తోంది.