చిన్న కిస్తీలో పోటీ పడుతున్న పహిల్వాన్‌లు
ఘనంగా చిన్న ‘కిస్తీ’ పోటీలు
Published Fri, Aug 26 2016 10:17 PM | Last Updated on Fri, Aug 24 2018 6:44 PM
అలంపూర్/అలంపూర్‌రూరల్: అలంపూర్ షా–అలీ–పహిల్వాన్ ఉర్సు కనులపండవగా సాగుతున్నాయి. రెండోరోజు షా–అలీ–పహిల్వాన్ సర్ ముబారక్ దర్గాలో శుక్రవారం చిన్న కిస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు. యువకులు పోటీ పడి వివిధ విన్యాసాలు చేస్తూ కిస్తీలో పాల్గొన్నారు. ఉర్సును పురస్కరించుకుని కులమతాలకతీతంగా జనం తరలివచ్చి సర్ ముబారక్, ధడ్ ముబారక్ దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి కిస్తీ పొలావు, మిఠాయిలు వేయగా, అక్కడే ఉన్న పహిల్వాన్‌లు పోటీ పడి వాటిని వీక్షకులపైకి విసిరారు. ఈ క్రమంలో పోటీకి దిగిన పహిల్వాన్‌లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సర సరదగా సాగిన ఈ పోటీలను వీక్షించడానికి భారీగా జనం తరలివచ్చారు.
నేడు పెద్ద కిస్తీలు
మూడో రోజు షా–అలీ–పహిల్వాన్ ధడ్ ముబారక్ దర్గా వద్ద ఉర్సులో ప్రధాన ఘట్టం పెద్దకిస్తీలు శనివారం నిర్వహిస్తారు. దీనికి జనం తాకిడి అధికంగా ఉంటుందని వారికి కావాల్సిన సౌకర్యాలపై కల్పించడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్‌లు సైతం గట్టి బందోబస్తు నిర్వహించనున్నారు.
Advertisement