
వైభవంగా కడప పెద్దదర్గా గంధోత్సవం
ప్రఖ్యాతిగాంచిన ఆ«ధ్యాత్మిక క్షేత్రం కడప అమీన్‌పీర్ (పెద్ద) దర్గా ఉరుసు ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
కడప కల్చరల్: ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం కడప అమీన్‌పీర్ (పెద్ద) దర్గా ఉరుసు ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అర్ధరాత్రి దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుస్సేనీ సాహెబ్ తన ఇంటి నుంచి గంధం కలశాన్ని తీసుకుని పకీర్ల మేళతాళాలు, ఖడ్గ విన్యాసాల మధ్య ఊరేగింపుగా దర్గా వద్దకు చేర్చారు.
ఏఆర్ రెహమాన్ ప్రార్థనలు: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. తొలుత ఆయన పీఠాధిపతిని కలిసి ఆశీస్సులు పొందారు.