mastan vali
-
గుంటూరు కాంగ్రెస్ అభ్యర్థికి 2 కోట్ల ఆఫర్!
సాక్షి, అమరావతి : వచ్చే ఎన్నికల్లో విజయం సాధించలేమని నిర్ధారణకు వచ్చేసిన సీఎం చంద్రబాబు.. పోలింగ్‌కు రెండ్రోజుల ముందు ఎన్ని అక్రమాలకు పాల్పడాలో అన్ని అక్రమాలకూ తెరతీస్తున్నారు. కోట్ల రూపాయలను వెదజల్లడానికి సిద్ధపడ్డారు. ఐదు వేల నుంచి పది వేల ఓటర్లను ప్రభావితం చేసే అభ్యర్థులపై చంద్రబాబు దృష్టిపెట్టారు. గుంటూరు లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్ వలీకి చంద్రబాబు రూ.రెండు కోట్ల ఆఫర్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. గతంలో మస్తాన్‌వలీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు ఆయనను సైలెంట్ చేసి ఆయనకు ఓటు వేసే వారికి డబ్బులిచ్చి వారిని టీడీపీ అభ్యర్థికి ఓట్లు వేయించేలా బేరం ఆడారు. గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఓటమి అంచున ఉండటంతో ఆయనను గట్టెక్కించేందుకు లోపాయికారీగా పొత్తు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థిని సైలెంట్ చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయా లేదా అనే దానిపై ‘దేశం’ నేతలు సందేహిస్తున్నారు. లోపాయికారీ పొత్తులో భాగంగా కాంగ్రెస్, జనసేన అభ్యర్థులను చంద్రబాబే ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయా అభ్యర్థుల్లో ఐదు వేల నుంచి పది వేల వరకు ఓటర్లను ప్రభావితం చేయగల వారిని ఎంపికచేసుకుని, వారికి డబ్బులిచ్చి సైలెంట్ చేస్తున్నారు. వారికి పడాల్సిన ఓట్లను టీడీపీకి వేయించేలా చంద్రబాబు ఒప్పందం చేసుకుంటున్నారు. ఆఖరి ప్రయత్నంలో భాగంగా ఈ రకంగానైనా ఫలితాలు మెరుగుపడతాయనే ఆశతో ఆయనున్నారు. మరోవైపు.. ఈ ప్రయత్నాలు ఇంకా వికటించే అవకాశం ఉందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. -
మతసామరస్యానికి ప్రతీక మస్తానయ్య ఉరుసు
రేపటి నుంచి ఉత్సవాలు గుంతకల్లు: పట్టణంలోని పాతగుంతకల్లులో వెలసిన హజరత్ సయ్యద్షాఅలీ అక్బర్ ఉరుఫ్ హజరత్ మస్తాన్‌వలి ఉరుసు హిందూముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. మస్తాన్‌వలి దర్గా 381వ ఉరుసు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఏటా మొహర్రం పండుగ తర్వాత 15 రోజులకు ఉరుసు ప్రారంభిస్తారు. ఉత్సవాలకు దర్గా కమిటీ సభ్యులు, నిర్వాహకులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. దర్గాకు రంగులు అద్దుతున్నారు. దర్గా ఆవరణంలో పలు రకాల బొమ్మల, మిఠాయి అంగళ్లు వెలిశాయి. మహోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు మస్తాన్‌వలి దర్గా కమిటీ సభ్యులు, నిర్వాహకులు. అందులో భాగంగానే దర్గాకు రంగులు దిద్దుతున్నారు. దర్గా ఆవరణంలో పలు రకాల బొమ్మల, మిఠాయి అంగళ్లు వెలిశాయి. ఈ నెల 26న స్వామివారి గంధం ఊరేగింపు, 27న రాత్రి షంషీర్ (ఉరుసు) జరుగుతుందన్నారు. 28న జియారత్ కార్యక్రమంతో ఉరుసు ముగుస్తుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా తదితర ప్రాంతాలతోపాటు ఏపీలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు ఉత్సవాలకు హాజరవుతారు. ఉరుసు రోజున స్వామి వారి దివిటీల్లో ఎండు కొబ్బరిని కాల్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. -
అమ్మను తుపాకీతో కాల్చి చంపేశాడు
గుంటూరు : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్నతల్లినే రివాల్వర్‌తో కాల్చి చంపాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన జిల్లాలోని కాకుమాను మండలం కొమ్మూరులో బుధవారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మస్తాన్‌వలి (47) ఆర్మీలో పని చేసి రిటైరయ్యాడు. ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి మద్యానికి బానిస అయి తరచూ తల్లి ఫజ్లూం(65)తో ఘర్షణకు దిగివాడు. అక్రమంలో ఈ రోజు కూడా తల్లితో ఘర్షణ పడ్డాడు. ఆ క్రమంలో తన లెసైన్స్డ్ రివాల్వర్‌తో తల్లిని కాల్చి చంపాడు. అనంతరం అతడు పరారైయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని తల్లి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మస్తాన్ వలీతో ప్రాణహాని
రుద్రవరం: ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీతో తనకు ప్రాణహాని ఉందని సినీనటి నీతూ అగర్వాల్ తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసేందుకు ఆమె వచ్చారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కొందరు వ్యక్తులు తనను చంపుతామంటూ ఫోన్లో బెదిరింపులకు పాలుపడుతున్నారన్నారు. ఆ వ్యక్తుల పేర్లు త్వరలో బయట పెడతానని చెప్పారు.తనకు ఏదైనా ప్రమాదం జరిగితే మస్తాన్, అతని కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఎర్రచందనం కేసులో తాను నిర్దోషినని అన్నారు. -
అద్దంకి ఎంపీపీ వైఎస్సార్ సీపీ కైవసం
అద్దంకి: అద్దంకి మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ పదవులు వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు మెజారిటీ ఎంపీటీసీ సభ్యులున్నా గత నెల 4వ తేదీన జరగాల్సిన ఎన్నిక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కో ఆప్షన్ మెంబర్‌గా పోటీ చేసిన ఎస్కే మస్తాన్ వలి నామినేషన్‌ను ప్రిసైడింగ్ అధికారి వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లడంతో వాయిదా పడింది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ వ్యవహరించారు. ఎమ్మెల్యే గొట్టిపాటితో కలిసి వచ్చిన ఎంపీటీసీ సభ్యులు... కో ఆప్షన్ ఎన్నిక నామినేషన్ దాఖలు సమయానికి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తమ పార్టీ తరఫున గెలుపొందిన 8 మంది ఎంపీటీసీలను తీసుకుని మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. కో ఆప్షన్ సభ్యునిగా వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మణికేశ్వరం గ్రామానికి చెందిన ఎస్కే మస్తాన్ వలి, టీడీపీ తరఫున ఎస్కే కరిముల్లా నామినేషన్లు వేశారు. అధికారులు పరిశీలన పూర్తిచేసి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున కో ఆప్షన్ మెంబర్‌గా పోటీ చేసిన ఎస్కే మస్తాన్‌వలి నామినేషన్ చెల్లుబాటైనట్లు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థికరిముల్లా నామినేషన్ ఓటర్ల జాబితాలో నంబరు సరిగా వేయని కారణంగా తిరస్కరించారు. ఒంటి గంట సమయంలో కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల మధ్య ఏ పార్టీకి కేటాయించిన సీట్లలో ఆ పార్టీ ఎంపీటీసీలను కూర్చోబెట్టారు. మండలంలోని 14 మంది ఎంపీటీసీ సభ్యుల చేత జేసీ యాకూబ్ నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. పోటీ లేకపోవడంతో కో ఆప్షన్ సభ్యునిగా ఎస్కే మస్తాన్ వలికి నియామక పత్రం అందజేసి మూడు గంటలకు సభ్యులను సమావేశపరచాలని ఆదేశించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక సమావేశం మూడు గంటలకు ప్రారంభమైంది. అక్షరక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున మండల పరిషత్ అధ్యక్షురాలిగా గోరంట్ల పద్మావతి, ఉపాధ్యక్షురాలిగా కరి అరుణ పేర్లను మణికేశ్వరం ఎంపీటీసీ ఇస్తర్ల వెంకట్రావు, వెంపరాల ఎంపీటీసీ భైరపునేని రామలింగయ్యలు ప్రతిపాదించి బలపరిచారు. టీడీపీ తరఫున చిన్నకొత్తపల్లి ఎంపీటీసీ మానం సరితను, ధేనువకొండ ఎంపీటీసీ ఉయ్యాల రాములును అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ప్రతిపాదించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మద్దతుగా 8 మంది ఎంపీటీసీలు చేతులెత్తారు. టీడీపీ అభ్యర్థులకు ఆరుగురు ఎంపీటీసీల మద్దతు మాత్రమే లభించడంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా గోరంట్ల పద్మావతి, కరి అరుణ ఎన్నికైనట్లు జేసీ ప్రకటించి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో స్టెప్ సీఈవో బీ రవి, ఇన్చార్జి ఎంపీడీవో కృష్ణమోహన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. దర్శి డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐ వీవీ రమణకుమార్, ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లతోపాటు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 250 మంది సిబ్బందితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.