అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి, రూ. 50 లక్షల విలువైన తొమ్మిది కార్లను శివమొగ్గ గ్రామాంతర పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.
రూ. 50 లక్షల విలువైన కార్లు స్వాధీనం
శివమొగ్గ, న్యూస్‌లైన్ :
అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి, రూ. 50 లక్షల విలువైన తొమ్మిది కార్లను శివమొగ్గ గ్రామాంతర పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో దక్షిణ కన్నడ జిల్లాలోని బంట్వాళ తాలూకాకు చెందిన సూరిబైలువిన గ్రామానికి చెందిన యూసఫ్ హైదర్, మంగళూరులోని బోరుగుడ్డె గ్రామానికి చెందిన మహమ్మద్ ఇజాజ్ ఉన్నారు. మరో ఇద్దరు ఫరూక్, మహమ్మద్ హనీఫ్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం హతినగర సమీపంలోమ అనుమానాస్పదంగా తిరుగుతున్న యూసఫ్ హైదర్‌ను ఇన్‌స్పెక్టర్ కుమారస్వామి అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో అతను తెలిపిన మేరకు ఇజాజ్‌ను పట్టుకున్నారు.